బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం

(బిస్మిల్లా నుండి దారిమార్పు చెందింది)

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం (అరబ్బీ بسم الله الرحمن الرحيم ), అరబ్బీ భాష పదజాలం, దీని అర్థం : అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను, అతను కృపాశీలుడు, కరుణామయుడు. ఈ బిస్మిల్లాహ్ తోనే ఖురాన్ ప్రారంభమౌతుంది.

వ్యాసముల క్రమము


ఇస్లాం మతం

విశ్వాసాలు

అల్లాహ్ · ఏకేశ్వర విశ్వాసం దేవుడు
ముహమ్మద్ · ఇతర ప్రవక్తలు

ఆచరణీయాలు

మూల విశ్వాసం · నమాజ్
ఉపవాసం · దాన ధర్మాలు · తీర్థయాత్ర

గ్రంధాలు, చట్టాలు

ఖుర్'ఆన్ · సున్నహ్ · హదీస్
ఫిఖ॰ · షరియా · కలాం · సూఫీ తత్వం

చరిత్ర, ఖలీఫాలు

ఇస్లామీయ చరిత్ర కాలపట్టిక
అహ్లె బైత్ · సహాబా
సున్నీ · షియా
రాషిదూన్ ఖలీఫాలు · ఇమామ్

సంస్కృతి, సమాజం

విద్య · జంతువులు · కళలు
కేలండరు · పిల్లలు
జనగణన · పండుగలు
మస్జిద్‌లు · తత్వము
శాస్త్రము · స్త్రీ
రాజకీయాలు · దావాహ్ · జిహాద్

ఇస్లాం, ఇతర మతములు

క్రైస్తవం · యూదమతము
హిందూ మతము · సిక్కు మతం · జైన మతము

'

విమర్శ ·  ముస్లింలలో అపవిశ్వాసాలు
ఇస్లామోఫోబియా
ఇస్లామీయ పదజాలము

భారతదేశంలో ఇస్లాం
ఆంధ్రప్రదేశ్‌లో ఇస్లాం

బిస్మిల్లాహ్ లేదా బస్మలా
బిస్మిల్లాహ్ ఇస్లామీయ లిపీకళాకృతులు

ఖురాన్, బిస్మిల్లా

మార్చు

ఖురాన్ "బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం" అనే వచనంతోనే ప్రారంభమవుతుంది. ఖురాన్ లోని అన్ని సూరాలు (అధ్యాయాలు) బిస్మిల్లా తోనే ప్రారంభమౌతాయి (ఒక అధ్యాయం "సూరా తౌబా" మినహాయించి).

సంఖ్యా శాస్త్రం

మార్చు
 
బిస్మిల్లా

అరబ్బీ భాష లోని అక్షరాలకు (అబ్‌జద్) సంఖ్యలు ఇవ్వబడ్డాయి. బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం, అనే వాక్యంలో గల అక్షరాల సంఖ్యలను కూడితే '786' అనే సంఖ్య వస్తుంది. అందుకే ముస్లింలు తరచూ ఈ 786 అనే సంఖ్యను వాడుతూ ఉంటారు. కాని దీనికి ఎలాంటి అందరం ఖుర్ఆన్, హదీసులో లేదు.

ఆచారాలలో బిస్మిల్లా

మార్చు

బిస్మిల్లా ఖ్వాని

మార్చు

ముస్లిం ఆచారాలలో బిస్మిల్లా ఖ్వాని ఒకటి. పిల్లలు విద్యాభ్యాస వయస్సుకు చేరుకున్నప్పుడు, విద్యాభ్యాసం "బిస్మిల్లా ఖ్వానీ"తో ప్రారంభం ఔతుంది. అనగా, విద్యాభ్యాసం బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీంతో ప్రారంభిస్తారు.

కార్యక్రమాలు - బిస్మిల్లా

మార్చు

ముస్లింలు ఏ కార్యక్రమమైనా ప్రారంభించేటపుడు "బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం" తోనే ప్రారంభిస్తారు. భోజనం మొదలు పెట్టేటపుడు కూడా బిస్మిల్లా చదువుతారు.


ఇవీ చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు