సింగాపూర్ (నస్పూర్)

సింగాపూర్, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, నస్పూర్ మండలానికి చెందిన జనగణన పట్టణం, రెవెన్యూ గ్రామం.2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని మంచిర్యాల మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన నస్పూర్ మండలం లోకి చేర్చారు.[2] ఈ పట్టణం నస్పూర్ పురపాలక సంఘంలో భాగంగా ఉంది.[1]

సింగాపూర్
సింగాపూర్ is located in Telangana
సింగాపూర్
సింగాపూర్
తెలంగాణలో ప్రాంతం ఉనికి
సింగాపూర్ is located in India
సింగాపూర్
సింగాపూర్
సింగాపూర్ (India)
Coordinates: 18°51′50″N 79°29′31″E / 18.86391°N 79.49183°E / 18.86391; 79.49183
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామంచిర్యాల జిల్లా
 • Rank11.42
Elevation
576 మీ (1,890 అ.)
జనాభా
 (2011)[1]
 • Total20,061
భాష
 • అధికార భాషతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
504302
Vehicle registrationటిఎస్

భౌగోళికం

మార్చు

సింగపూర్ పట్టణం 18°51′50″N 79°29′31″E / 18.86391°N 79.49183°E / 18.86391; 79.49183 అక్షాంశరేఖాంశాల మధ్యలో ఉంది.[3]

సమీప ప్రాంతాలు

మార్చు

రామారావుపేట (1 కి.మీ.), సీతారాంపల్లి (3 కి.మీ.), ఇందారం (3 కి.మీ.), శ్రీరాంపూర్ (4 కి.మీ.), నస్పూర్ (4 కి.మీ.) మొదలైన గ్రామాలు సింగపూర్‌కు సమీపంలో ఉన్నాయి.[4]

జనాభా గణాంకాలు

మార్చు

2001 నాటికి భారతదేశ జనాభా లెక్కల ప్రకారం,[5] సింగాపూర్ పట్టణంలో 23,458 జనాభా ఉంది. ఈ జనాభాలో పురుషులు 51% మంది కాగా, స్త్రీలు 49% మంది ఉన్నారు. సింగాపూర్ సగటు అక్షరాస్యత రేటు 55% కాగా, ఇది జాతీయ సగటు 59.5% కంటే తక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 62% కాగా, స్త్రీల అక్షరాస్యత 48%గా ఉంది. సింగపూర్‌లోని జనాభాలో 11% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సుగలవారు ఉన్నారు.

రవాణా

మార్చు

ఇక్కడికి సమీపంలోని మంచిర్యాల, రవీంద్రఖని, పెద్దంపేట్ ప్రాంతాలలో రైల్వే స్టేషన్లు ఉన్నాయి. మంచిర్యాల నుండి తాళ్ళపల్లికి రోడ్డు కనెక్టివిటీ ఉంది.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "District Census Handbook – Karimnagar" (PDF). Census of India. pp. 13, 30. Retrieved 10 June 2016.
  2. "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "Singapur Pin Code, Singapur , Adilabad Map , Latitude and Longitude , Andhra Pradesh". indiamapia.com. Retrieved 2021-10-28.
  4. "Singapur Village , Mancherial Mandal , Adilabad District". www.onefivenine.com. Retrieved 2021-10-28.
  5. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.

వెలుపలి లంకెలు

మార్చు