నస్పూర్ పురపాలకసంఘం

నస్పూర్ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] నస్పూర్ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం లోని చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

నస్పూర్ పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మంచిర్యాల
మండలం నస్పూర్
ప్రభుత్వము
 - చైర్‌పర్సన్‌ ఈసంపల్లి ప్రభాకర్
 - వైస్ చైర్‌పర్సన్‌
వైశాల్యము
 - మొత్తం 53.31 km² (20.6 sq mi)
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషుల సంఖ్య 39,788
 - స్త్రీల సంఖ్య 36,853
 - గృహాల సంఖ్య 21,748
పిన్ కోడ్ - 504302
Area code(s) టెలిఫోన్ కోడ్ - 08736
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

చరిత్రసవరించు

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న నస్పూర్, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]

భౌగోళికంసవరించు

నస్పూర్ 53.31 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 18°51′32″N 79°29′13″E / 18.859°N 79.487°E / 18.859; 79.487 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 284 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం మంచిర్యాల నుండి 5.5 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలుసవరించు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 76641 మంది కాగా, అందులో 39788 మంది పురుషులు, 36853 మంది మహిళలు ఉన్నారు. 21748 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 5 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]

పౌర పరిపాలనసవరించు

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 25 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం ఈసంపల్లి ప్రభాకర్ చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లుసవరించు

  1. బండి పద్మ
  2. బాడిగే మల్లయ్య
  3. పంబల గంగ
  4. బేడికె లక్ష్మి
  5. బౌతు లక్ష్మి
  6. పూదారి కుమార్
  7. చిదం మహేష్
  8. బి. సంధ్యరాణి
  9. ఈసంపల్లి ప్రభాకర్
  10. సిపతి సుమతి
  11. జబిన్ బేగం
  12. బి. సంధ్యారాణి
  13. తోట శ్రీనివాస్
  14. ప్రకాష్ రెడ్డి
  15. గెల్లు రజిత
  16. తెనుగు లావణ్య
  17. మేకల దాసు
  18. కోడూరి లాహరి
  19. రేగుంట చంద్రశేఖర్
  20. సురిమిల్ల వేణు
  21. బేర సత్యనారాయణ
  22. వంగ తిరుపతి
  23. అగాల్డుటి రాజు
  24. మారీ రాజమోగిలి
  25. కురిమిల్ల అన్నపూర్ణ

మూలాలుసవరించు

  1. "Naspur Municipality". naspurmunicipality.telangana.gov.in. Retrieved 13 May 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 13 May 2021.
  3. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 13 May 2021.
  4. "Basic Information of Municipality, Naspur Municipality". naspurmunicipality.telangana.gov.in. Retrieved 13 May 2021.
  5. admin (2020-05-20). "Naspur municipality Councillors list 2020". Telangana data. Retrieved 13 May 2021.

వెలుపలి లంకెలుసవరించు