సిక్కిం జిల్లాల జాబితా
భారత రాష్ట్రమైన సిక్కింలో 6 (2023 నాటికి) జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లాలను కేంద్ర ప్రభుత్వం నియమించిన జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తారు. వీరు జిల్లాల పౌర ప్రాంతాల పరిపాలనకు బాధ్యత వహిస్తారు. సిక్కిం రాష్ట్రం సున్నితమైన సరిహద్దు ప్రాంతం కావడంతో భారత సైన్యం ఎక్కువ ప్రాంతంపై నియంత్రణ కలిగి ఉంది. అనేక ప్రాంతాలు పరిమితం చేయబడ్డాయి. వాటిని సందర్శించడానికి అనుమతులు అవసరం ఉంటుంది. సిక్కింలో మొత్తం ఎనిమిది పట్టణాలు, తొమ్మిది ఉప విభాగాలు ఉన్నాయి.
సిక్కిం జిల్లాలు | |
---|---|
రకం | జిల్లాలు |
స్థానం | సిక్కిం |
సంఖ్య | 6 జిల్లాలు (2023 ఆగష్టు) |
జనాభా వ్యాప్తి | మంగన్ – 43,354 (అత్యల్ప); గాంగ్‌టక్ – 281,293 (అత్యధిక) |
విస్తీర్ణాల వ్యాప్తి | మంగన్ – 4,226 కి.మీ2 (1,632 చ. మై.) (అతిపెద్ద); సోరెంగ్ – 293 కి.మీ2 (113 చ. మై.) (అతి చిన్న) |
ప్రభుత్వం | సిక్కిం ప్రభుత్వం |
2021 డిసెంబరు 21న, సిక్కిం ప్రభుత్వం 2 కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న 4 జిల్లాల పేర్లను మారుస్తున్నట్లు ప్రకటించింది. సిక్కిం ప్రభుత్వం ఉత్తర సిక్కిం జిల్లాను ఇప్పుడు మంగన్ జిల్లా, పశ్చిమ సిక్కిం జిల్లాను గ్యాల్‌షింగ్ జిల్లా, తూర్పు సిక్కిం జిల్లాను, గాంగ్‌టక్ జిల్లా, దక్షిణ సిక్కిం జిల్లాను, నాంచి జిల్లా అనే పేర్లుతో అధికారికంగా మార్చింది. [1]
ఆరు జిల్లాలు జాబితా
వ.సంఖ్య
|
కోడ్[2]
|
జిల్లా[3]
|
ముఖ్య పట్టణం
|
జనాభా (2011)
|
విస్తీర్ణం
|
జనసాంద్రత [3]
|
ప్రభుత్య వెబ్సైట్
|
జిల్లా పటం
|
1 | ES | గాంగ్‌టక్ జిల్లా | గాంగ్‌టక్ | 281,293 | 954 | 295 | ||
2 | NS | మంగన్ జిల్లా | మాంగన్ | 43,354 | 4,226 | 10 | ||
3 | PS | పాక్యోంగ్ జిల్లా | పాక్యోంగ్ | 74,583 | 404 | 180 | ||
4 | SGS | సోరెంగ్ జిల్లా | సోరెంగ్ | 64,760 | 293 | 221 | ||
5 | SS | నాంచి జిల్లా | నాంచి | 146,742 | 750 | 196 | ||
6 | WS | గ్యాల్‌షింగ్ జిల్లా | గ్యాల్‌షింగ్ | 136,299 | 1,166 | 117 | ||
IN-SK | సిక్కిం | గాంగ్టక్ | 610,577 | 7,096 | 86 |
మూలాలు
మార్చు- ↑ "Sikkim gets two new districts, rejigs others". Retrieved 22 December 2021.
- ↑ "NIC Policy on format of e-mail Address: Appendix (2): Districts Abbreviations as per ISO 3166–2" (PDF). Ministry of Communications and Information Technology (India), Government of India. 12 ఫిబ్రవరి 2018. pp. 5–10. Archived from the original (PDF) on 10 మే 2021. Retrieved 10 మే 2021.
- ↑ 3.0 3.1 "Indian Districts by Population, Growth Rate, Sex Ratio 2011 Census". 2011 census of India. Retrieved 27 December 2012.