పాక్యోంగ్
పాక్యోంగ్ అనేది భారతదేశం, సిక్కిం రాష్ట్రం, పాక్యోంగ్ జిల్లా లోని ఒక నగరం, ఇది పాక్యోంగ్ జిల్లాకు ప్రధాన కార్యాలయం. ఇది హిమాలయాల దిగువ ప్రాంతంలో ఉంది. ఇక్కడ అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. పాక్యోంగ్ విమానాశ్రయం సిక్కింలోని ఏకైక విమానాశ్రయం."జాతీయ ఆర్కిడ్స్ పరిశోధన కేంద్రం" (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) కూడా ఇక్కడే ఉంది. జిల్లా కేంద్రమైన పాక్యోంగ్‌లో అనేక బ్యాంకులు పనిచేస్తున్నాయి.
Pakyong | |
---|---|
Coordinates: 27°14′22″N 88°35′46″E / 27.2394°N 88.5961°E | |
Country | India |
State | Sikkim |
District | Pakyong |
Government | |
• Type | Municipal Council |
• Body | Pakyong Municipal Council |
Elevation | 1,120 మీ (3,670 అ.) |
Languages | |
• Official | Sikkimese, Nepali (Gorkha), Lepcha, Limbu, Newari, Rai, Gurung, Mangar, Sherpa, Tamang and Sunwar |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 737 106 |
Telephone code | 03592 |
Vehicle registration | SK 07 |
Climate | Cwb |
Lok Sabha | Sikkim Constituency |
Vidhan Sabha | Gnathang-Machong, Rhenock, Namcheybung |
సెయింట్ జేవియర్స్ అనే మిషనరీ రన్ పాఠశాల ఉంది, [1] ఇది 1990లలో సిక్కింలో మొదటి రెండు పాఠశాలల్లో ఒకటిగా నిలిచింది. భారతదేశ ఫుట్‌బాల్ జట్టుకు కెప్టెన్ గా పనిచేసిన, పద్మశ్రీ అవార్డు గ్రహీత బైచుంగ్ భూటియా పూర్వ విద్యార్థులలో ఒక ప్రముఖుడు.
చరిత్ర
మార్చుబ్రిటీష్ కిల్లా వద్ద గతంలోని బ్రిటీష్ బంకర్‌ల ఉనికిని సూచిస్తుంది. పాక్యోంగ్ అనే పేరు లెప్చా పదాల పా యోంగ్ నుండి వచ్చింది. దీని అర్థం "విల్లుకు వాడే వెదురు", ఎందుకంటే ఒక ప్రదేశంలో కనిపించే అవసరమైన వస్తువులకు పేరు పెట్టడం లెప్చాస్ సాధారణ పద్ధతి. 2018 సెప్టెంబరు 24న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాక్యోంగ్ విమానాశ్రయాన్ని ప్రారంభించాడు. సాధారణ ఎయిర్ సర్వీస్ 2018 అక్టోబరు 4న ప్రారంభమైంది.
భౌగోళికం
మార్చుపూర్వ తూర్పు సిక్కిం జిల్లాలో ప్రస్తుత పాక్యోంగ్ జిల్లాలో ఈ పట్టణం సముద్ర మట్టానికి 1,700 మీటర్లు (5,600 అడుగులు) ఎత్తులో ఉంది. ఇది భూటాన్, టిబెట్‌లతో తన సరిహద్దులను పంచుకుంటుంది. స్థలాకృతి కొండలు ప్రాంతంతో కూడిన మంచి వ్యవసాయ భూమి కలిగి ఉంది.
పాక్యోంగ్ చుట్టుపక్కల నామ్చేబాంగ్, గాంచుంగ్, కపుతాంగ్, రైగోవాన్, పచెయ్, సాంసింగ్, తారేతంగ్, పచెయ్‌ఖాని, పచక్, దుగలఖా, లింకీ, పర్ఖా, మచాంగ్, దామ్లాఖా, చలంతంగ్, మాచొంగ్, దమ్లాఖా, చలంతంగ్, చంజ్ బరాపత్, మాంలాఖా అంబాసి, కార్తోక్ అనే గ్రామాలు ఉన్నాయి
జనాభా
మార్చుబ్రిటీష్ పాలనలో ఈ ప్రాంతంలో స్థిరపడిన జాతి నేపాలీలు, జనాభాలో ఎక్కువ మంది ఉన్నారు.లెప్చా, భూమికి చెందినవారు, భూటియాలు జనాభాలో గణనీయమైన శాతాన్ని కలిగి ఉన్నారు.ఈ ప్రాంతానికి స్థానికంగా లేని వలస రెసిడెంట్ కమ్యూనిటీలలో మార్వాడీలు ఉన్నారు. వీరు వ్యాపార సంఘానికి వెన్నెముకలాంటివారుగా ఉన్నారు.పట్టణం పరిధిలో చాలా దుకాణాలను కలిగి ఉన్నారు.వివిధ వ్యాపారాలలో పనిచేసే బీహారీలు, వడ్రంగి పని చేసే బెంగాలీలు ఎక్కువుగానే ఉన్నారు. ఈ పట్టణం దక్షిణాది నుండి కేరళ, తమిళనాడు వంటి ప్రజలతో కాస్మోపాలిటన్ జనాభాను ఆకర్షించింది.
ఆర్థిక వ్యవస్థ
మార్చుస్థానిక ఆర్థిక వ్యవస్థ పాఠశాలలు.ఇంకా చిన్న స్థానిక వ్యాపారాలకు మాత్రమే పరిమితం చేయబడింది. అల్లం సాగు ఎక్కువుగా చేస్తారు. పూల సాగు ప్రసిద్ధి చెందింది. భౌగోళికంగా దీన్ని ఆచరణీయంగా చేస్తుంది. గూండ్రుక్, కినెమా, సింకి స్థానిక మార్కెట్‌లో విక్రయించే ప్రసిద్ధ పులియబెట్టిన ఆహారాలు. "డల్లె ఖోర్సాని" (ఎర్ర మిరపకాయ) స్థానిక కూరగాయల సాగుదారులలో ప్రసిద్ధి చెందింది. ఆవు పాలు,పెరుగు, చూర్పి(ఉడకబెట్టిన మజ్జిగ అవశేషాలు) ఆదాయాన్ని సంపాదించే ఇతర మార్గాలు. నల్ల ఏలకులు, చీపురు మొక్కలు (కుచ్చో), అల్లం వంటి పంటలు అయా కాలానుగుణంగా పట్టణంలో వర్తకం చేయబడతాయి.
రవాణా
మార్చురోడ్డు
మార్చుపాక్యోంగ్ జాతీయ రహదారి-717ఎ పై బాగ్రాకోట్ నుండి లాభా, అల్గారా మీదుగా గాంగ్‌టక్‌ను కలుపుతుంది. [2] ఈ పట్టణం సిక్కిం, దాని పొరుగు రాష్ట్రాలలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు బాగా అనుసంధానించబడి ఉంది. నేరుగా మోటారు వాహనాల సేవలు సిక్కింలోని దాదాపు అన్ని నగరాలు, పట్టణాలుకు, పశ్చిమ బెంగాల్ నగరాలు , పట్టణాలైన సిలిగురి, కాలింపాంగ్, జైగావ్, బిర్పారా, పానిటాంకి, మల్బజార్, బాగ్డోగ్రాలకు మంచి ప్రయాణసౌకర్యాలు ఉన్నాయి. పాక్యోంగ్‌లో, జాతీయ రహదారి 717ఎ కింది ప్రధాన రహదారులతో కలుస్తుంది:
- రోరతంగ్- తరేతంగ్- మామ్రింగ్- పాక్యోంగ్ రోడ్.
- రోంగ్లీ- రోలెప్- మచోంగ్, లింకీ- పాక్యోంగ్ రోడ్.
- రంగ్పో- దుగా- పదంచే- పాక్యోంగ్ రోడ్.
- రాణిపూల్- అస్సాంలింగ్జీ- సెంటి- పాక్యోంగ్ రోడ్.
- పచక్- మామ్జే- డిక్లింగ్- పాక్యోంగ్ రోడ్.
- రోంగ్లీ- గతి, బేరింగ్- మామ్రింగ్- పాక్యోంగ్ రోడ్.
- దామ్లాఖా- కార్టోక్- నామ్‌చేబాంగ్- పాక్యోంగ్ రోడ్.
రాణిపూల్ ద్వారా గాంగ్‌టక్‌ను కలుపుతూ తరచుగా ఎస్.ఎన్.టి బస్సులు ప్రతి అరగంటకు పట్టణం నుండి అందుబాటులో ఉంటాయి. రోంగ్లీ, రెనాక్, రోరతంగ్ నుండి గ్యాంగ్‌టాక్‌కు అనుసంధానించే ఎస్.ఎన్.టి బస్సులు కూడా పాక్యోంగ్ మీదుగా నడుస్తాయి. రంగ్‌పో, మెల్లి, సెవోక్ మొదలైన వాటి ద్వారా సిక్కిం జాతీయ రవాణా బస్ టెర్మినస్ (సిలిగురి) కి పాక్యోంగ్‌ను అనుసంధానించే ఎస్.ఎన్.టి బస్సు రోజువారీ సేవలు పాక్యోంగ్ పట్టణం నుండి ఉన్నాయి.
రైల్వే
మార్చుసమీప రైల్వే స్టేషన్ సిలిగురి జంక్షన్, ఇది 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. న్యూ జల్పైగురి జంక్షన్ 126 కిలోమీటర్ల దూరంలో ఉంది.
వాయుమార్గం
మార్చు2018 సెప్టెంబరు 24న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాక్యోంగ్ విమానాశ్రయాన్ని ప్రారంభించాడు.పాక్యోంగ్ విమానాశ్రయంలో రెండు పార్కింగ్ బేలు, టెర్మినల్ భవనం ఉన్నాయి. ఇది ఒకేసారి 100 మంది ప్రయాణీకులను గమ్యస్థానానికి చేర్చగలదు. విమానాశ్రయం 4,500 అడుగులు (1400 మీటర్లు) ఎత్తులో పాక్యోంగ్ పట్టణం పైన ఉన్న కొండపై ఉంది. రన్‌వేతో సహా మొత్తం విమానాశ్రయం, లోతైన లోయలలో 263 అడుగుల ఎత్తులో కట్టగోడను నిర్మించడం ద్వారా సృష్టించబడిన భూమిపై నిర్మించబడింది. [3]
సంస్కృతి
మార్చునేపాలీ (సిక్కిమీస్) అత్యంత విస్తృతంగా మాట్లాడే భాష. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇంగ్లీషు, హిందీ భాషలను అర్థం చేసుకుంటారు.ఇతర భాషలలో భూటియా (సిక్కిమీస్), టిబెటన్, లెప్చా (సిక్కిమీస్) ఉన్నాయి.
స్కూలు పిల్లలు గిటార్‌లు కట్టుకుని నడుచుకోవడం సర్వసాధారణం. పాశ్చాత్య హిప్-హాప్ సంగీతం ప్రజాదరణ పొందింది. ఫుట్‌బాల్, క్రికెట్ రెండు అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడలు. సెయింట్ జేవియర్స్ స్కూల్ మైదానం టోర్నమెంట్ వేదికగా పనిచేస్తుంది, ముఖ్యంగా ఇండిపెండెన్స్ డే కప్, ఇందులో గతంలో కలకత్తా, నేపాల్, భూటాన్ దేశాల జట్లు ఉన్నాయి.
వంటలు
మార్చుమోమో, తుక్పా, చౌమీన్, గ్యాతుక్, వొంటన్ వంటి స్థానిక ఇష్టమైనవి రెస్టారెంట్లలో లభిస్తాయి. మామో అనేది కూరగాయలు, చికెన్, బీఫ్ లేదా పోర్క్ ఫిల్లింగ్, ఆవిరితో ఉడికించి, సూప్‌తో వడ్డించే ప్రసిద్ధ చిరుతిండి. కొండప్రాంత ప్రజలు సాంప్రదాయకంగా మద్యం పట్ల ఉదారవాద వైఖరిని కలిగి ఉంటారు.వివాహాలు మొదలైన అనేక స్థానిక కార్యక్రమాలలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.ఒక సాధారణ స్థానిక పానీయం రక్సీ .
పర్యాటక ఆకర్షణలు
మార్చుడిక్లింగ్ మనే-లాఖాంగ్, శివాలయ దేవాలయం, పచెయ్‌ఖాని గుహ, చేంజీ మఠం, పాక్యోంగ్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం,దేవి మందిర్,కార్తోక్ మొనాస్టరీ, సన్యాసుల రిట్రీట్ కేంద్రం వంటి ఆకర్షణలు ఉన్నాయి. బుధవారం బజార్ 'హాత్' ప్రసిద్ధి చెందింది.
ఆర్.డి.డి. సముదాయం చుట్టూ పైన్ చెట్లు, ఒక చిన్న ఉద్యానవనం ఉంది. పాక్యోంగ్ పైభాగంలో ఉన్న ఝండి దారాలో ట్రెక్కింగ్ అందుబాటులో ఉంది. సమీపంలోని నోబ్ గావ్‌ను వర్జిన్ లోయ ఉంది. బ్రిటీష్ కిల్లా పైన ఉన్న కొండ ఇది.
విద్య
మార్చుసెయింట్ జేవియర్స్ పాఠశాల, డిక్లింగ్ సీనియర్ సెకండరీ పాఠశాల.పాచీ సీనియర్ సెకండరీ స్కూల్ విద్యార్థులకు విద్యను అందిస్తాయి. పాకిమ్ పాలటైన్ కళాశాల స్థానిక విద్యార్థులకు, గ్యాంగ్‌టాక్, రోరతంగ్, రెనాక్, రాణిపూల్, భూటాన్ వంటి పట్టణాల విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తుంది. పుష్పాంజలి పాఠశాల ఉత్తమంగా అభివృద్ధి చెందుతున్న స్వయంప్రతిపత్త విద్యా సంస్థలలో ఒకటి. పాఠశాలలు గ్రామంలోని పిల్లలను చదివిస్తాయి. ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాల మామ్రింగ్ 1952లో స్థాపించబడింది.
ఇతర విశేషాలు
మార్చు2020లో భారత ప్రభుత్వంలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వే ప్రకారం,సిక్కింలోని పాక్యోంగ్ జిల్లాలోని పాక్యోంగ్ పోలీస్ స్టేషన్ దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన పది పోలీసు స్టేషన్‌లలో ఇది ఏడవస్థానంలో నిలిచింది. [4]
మూలాలు
మార్చు- ↑ "St. Xaviers School - Pakyong - East Sikkim - www.zaverian.com". Archived from the original on 2008-03-06. Retrieved 2008-02-18. St Xavier's School
- ↑ "Doklam effect: Sikkim to get new all-weather highway- The New Indian Express".
- ↑ "Is this one of the most beautiful airports?". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2018-09-24. Retrieved 2018-09-24.
- ↑ "Pakyong Police Station comes 7th in top performing police stations of India". thenortheasttoday.com. 3 December 2020.[permanent dead link]