సియాచెన్ ఘర్షణ
సియాచెన్ హిమానీనదం ప్రపంచంలోకెల్లా ఎత్తైన యుద్ధ క్షేత్రం.[8][9] భారత్ పాకిస్తాన్లు 1984 ఏప్రిల్ 13 నుండి అడపాదడపా అనేక సార్లు ఘర్షణ పడ్డాయి. రెండు దేశాలూ శాశ్వత సైనిక స్థావరాలను స్థాపించాయి. ఇక్కడి వాతావరణ పరిస్థితుల కారణంగా ఇరుదేశాలూ కలిసి 2000 మంది వరకూ కోల్పోయాయి. NJ9842 బిందువు తరువాతి ప్రాంతాన్ని సరిగ్గా విభజించి చూపకపోవడాన సియాచెన్ ఘర్షణ తలెత్తింది. 1949 నాటి కరాచీ ఒప్పందం, 1972 నాటి సిమ్లా ఒడంబడికలు సియాచెన్‌ను ఎవరు నియంత్రిస్తున్నారో వివరించలేదు. సంధి రేఖ NJ9842 వద్ద ముగిసిందని మాత్రమే అవి ప్రకటించాయి. సియాచెన్ లాంటి అతి శీతలమైన, బీడు భూమిని భారత పాకిస్తాన్లు పట్టించుకోవని ఐక్యరాజ్యసమితి అధికారులు భావించారు.[10]
సియాచెన్ ఘర్షణ | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
ఇండో-పాకిస్తాన్ యుద్ధాలు, కాశ్మీరు సమస్యలో భాగము | |||||||||
కాశ్మీరులో సియాచెన్ (తెల్లనిది) సియాచెన్ హిమానీ నదం కారకోరం పర్వత శ్రేణిలో ఉంది. | |||||||||
| |||||||||
ప్రత్యర్థులు | |||||||||
India | Pakistan | ||||||||
సేనాపతులు, నాయకులు | |||||||||
Col. Narendra Kumar LGen P.N.Hoon LGen M.L.Chibber MGen Shiv Sharma LGen V.R.Raghavan BGen C.S.Nugyal BGen R.K.Nanavatty BGen V.K.Jaitley | LGen Zahid Ali Akbar BGen Pervez Musharraf | ||||||||
బలం | |||||||||
3,000+ [2] | 3,000[2] | ||||||||
ప్రాణ నష్టం, నష్టాలు | |||||||||
846 మృతులు (సాయుధ ఘర్షణేతర మరణాలతో కలిపి )[3][4] 36 casualties during combat (1984)[5] | 213 మృతులు (సాయుధ ఘర్షణేతర మరణాలతో కలిపి 2003, 2010 మధ్య)[4][6][7] 200 casualties during combat (1984)[5] | ||||||||
పర్వత రాజకీయాలు
మార్చు1949 లో, భారత పాక్‌ల మధ్య ఒక సంధి రేఖ ఒడంబడిక కుదిరింది. ఐక్యరాజ్యసమితి సైనిక పరిశీలక బృందం కూడా దాన్ని గుర్తించింది. 1956–58 లో జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సియాచెన్‌తో పాటు ఇతర హిమానీనదాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ప్రచురించింది.
సైనిక సాహసయాత్ర
మార్చుపాకిస్తాన్ వైపు నుండి సియాచెన్ గ్లేసియరుకు జరుగుతున్న చొరబాటు యాత్రలను గమనించిన కల్నల్ నరేంద్ర కుమార్, 1977 లో ఒక యాత్ర చేపట్టి పాకిస్తాను వారు జరిపిన చొరబాట్లకు ఋజువులుగా వారు వదలిపెట్టిన వస్తువులను తీసుకువచ్చాడు. 1981 లో నరేంద్ర కుమార్ మరో యాత్ర చేసాడు.
పోరాటాలు
మార్చుసియాచెన్కు భారత్ మళ్ళీ మళ్ళీ చేస్తున్న సాహసయాత్రలు, అ ప్రాంతాన్ని భారత్ ఆక్రమించుకోడానికి ముందే తామే దాన్ని ఆక్రమించుకోవాలనే ఆలోచన పాకిస్తాన్ సైన్యంలో రేకెత్తించేలా చేసాయి. దీనికోసం వనరులను సేకరించుకునే తొందరలో పాకిస్తాన్ వ్యూహకర్తలు ఓ ఎత్తుగడ తప్పిదం చేసారు. పాకిస్తాన్ సైన్యానికి చెందిన ఒక కలనల్ చెప్పినదాని ప్రకారం "అతిశీతల వాతావరణానికి అవసరమైన దుస్తుల కోసం లండన్ లోని ఒక సరఫరాదారునికి ఆర్డరు ఇచ్చాం. గతంలో భారత్‌కు కూడా ఆ కంపెనీ సరఫరా చేసింది. దీంతో పాకిస్తాన్ ఆర్డరు సంగతి భారత్‌కు తెలిసిపోయింది. వాళ్ళు వెంటనే 300 దుస్తులకు - మాకంటే రెట్టింపు - ఆర్డరు వేసారు. ఆ వెంటనే భారత్ తన సైనికులను సియాచెన్‌కు పంపింది కూడా." అతిశీతల వాతావరణానికి అవసరమైన వస్తువులను సేకరించడం అక్కడ చేపట్టాల్సిన పోరాటాలకు నాందిగా నిలిచాయి.
ఆపరేషన్ మేఘదూత్: సియాచెన్ లోని సియా లా, బిలాఫోండ్ లా లను ఆక్రమించాలన్న పాకిస్తాన్ ఆలోచనలను భారత్ సైన్యం పసిగట్టింది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు భారత సైన్యం నిశ్చయించింది. లడఖ్ స్కౌట్స్, కుమావోన్ రెజిమెంటుకు చెందిన సైనికులు భారత వైమానిక దళం సాయంతో ఏప్రిల్ 13 న బిలాఫోండ్ లా, 14 న సియా లానూ ఆక్రమించారు. హెలికాప్టరు గస్తీలో పాకిస్తాన్ ఈ సంగతిని కనుక్కుంది. ఈ 300 పైచిలుకు భారత సైనికులను అక్కడి నుండి ఖాళీ చేయించేందుకు పాకిస్తాన్ సైన్యం తన స్పెషల్ సర్వీసెస్ గ్రూప్, నార్దర్న్ లైట్ ఇన్ఫాంట్రీలతో ఒక ఆపరేషన్ను మొదలుపెట్టింది. ఈ చర్య 1984 ఏప్రిల్ 25 న సియాచెన్‌లో తొట్టతొలి సాయుధ ఘర్షణకు దారితీసింది.[11]
1987 జూన్ - జూలై: ఆపరేషన్ రాజీవ్: ఆ తొలి ఘర్షణ తరువాత మూడేళ్ళ పాటు భారత సైన్యం ఆక్రమించుకుని ఉన్న కనుమలకు దాపున ఉన్న శిఖరాలను ఆక్రమించుకునే ప్రయత్నంలోనే పాకిస్తాన్ ఉంది. ఈ ప్రయత్నాల్లో వారు పొందిన విజయాల్లో ఒకటి బిలఫోండ్ లా కు ఎదురుగా ఉన్న ప్రదేశం. పాకిస్తాన్ దానికి కైద్ పోస్ట్ అనే పేరు పెట్టింది. మూడేళ్ళ పాటు అక్కడి నుండి భారత శిబిరాలపై ఆధిక్యత ప్రదర్శించింది. 1987 జూన్ 25 న బ్రిగే జన చందన్ నుగ్యాల్, మే వరీందర్ సింగ్, లెఫ్టి రాజీవ్ పాండే, నాయిబ్ సుబే బాణా సింగ్ ల నేతృత్వంలోని భారత సైన్యం కైద్ పోస్టుపై దాడిచేసి దాన్ని పాకిస్తాన్ దళాల నుండి వశపరచుకుంది. ఈ దాడిలో సుబేదార్ బాణా సింగ్ ప్రదర్శించిన ధైర్య సాహసాలకు గాను ఆయనకు పరమవీరచక్ర పురస్కారాన్ని బహూకరించారు. ఈ పోస్టును అతడి పేరిట బాణా సింగ్ పోస్టుగా పిలుస్తున్నారు.
1987 సెప్టెంబరు: ఆపరేషన్ వజ్రశక్తి/ఆపరేషన్ కైదత్: కైద్ పోస్టును తిరిగి స్వాధీనం చేసుకునేందుకు, బ్రిగే. జన. పర్వేజ్ ముషారఫ్ నేతృత్వంలో పాకిస్తాన్, ఆపరేషన్ కైదత్ చేపట్టింది. కొత్తగా నిర్మించిన ఖప్లు గారిసన్ వద్ద ఇందుకోసం పెద్ద ఎత్తున బలగాలను సమకూర్చారు.[12] దీన్ని పసిగట్టిన భారత్, ఆపరేషన్ వజ్రశక్తిని చేపట్టి దాన్ని ఎదుర్కొంది.[13][14]
1989 మార్చి-మే: 1989 మార్చిలో చుమిక్ హిమానీ నదానికి ఎదురుగా ఉన్న పాకిస్తానీ పోస్టును స్వాధీనం చేసుకునేందుకు భారత్, ఆపరేషన్ ఐబెక్స్ ను చేపట్టింది. పాకిస్తాన్ దళాలను ఆ స్థావరం నుండి పారదోలడంలో విఫలమైంది. అయితే, బ్రిగే. ఆర్.కె నానావతి నేతృత్వంలోని భారత దళం కౌసర్ స్థావరంపై శతఘ్ని దాడి చేసి, దాన్ని ధ్వంసం చేసింది. కౌసర్‌ను కోల్పోయిన పాక్, చుమిక్ పోస్టును కూడా ఖాళీ చేసింది. దీంతో ఆపరేషన్ ఐబెక్స్ ముగిసింది.[15]
1992 జూలై 28 – ఆగస్టు 3: చులుంగ్ వద్ద ఉన్న బహదూర్ పోస్టుపై పాకిస్తాన్ పెద్ద ఎత్తున దాడి చెయ్యగా, దాన్ని ఎదుర్కొనేందుదుకు భారత సైన్యం ఆపరేషన్ త్రిశూల్ శక్తిని చేపట్టింది. 1992 ఆగస్టు 1 న పాకిస్తాన్ హెలికాప్టరుపై భారత్ ఇగ్లా క్షిపణులతో దాడి చెయ్యగా ఆనాటి ఉత్తర ప్రాంత దళ కమాండరు బ్రిగే. మసూద్ నవీద్ అన్వరీ (PA 10117) తో పాటు ఇతర సైనికులు మరణించారు. దీంతో పాకిస్తాన్ పక్షాన స్థైర్యం సన్నగిల్లి, వారి దాడి ఆగిపోయింది.[16]
1995 మే: త్యాక్షి పోస్టు యుద్ధం:పాకిస్తాన్ ఐన్యానికి చెందిన ఎన్‌ఎన్‌ఐ యూనిట్లు త్యాక్షి పోస్టుపై దాడి చేయగా, భారత దళాలు దాన్ని తిప్పికొట్టాయి.[17]
1999 జూలై: భారత సైన్యానికి చెందిన బ్రిగే. పి.సి. కటోచ్, కల్నల్ కోన్సామ్ హిమాలయ సింగ్ లు, పాకిస్తాన్ నియంత్రణలోని పాయింట్ 5770 (నవీద్ టాప్/చీమా టాప్/బిలాల్ టాప్) ను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు.[18]
సంధి తరువాత సంభవించిన మంచు తుఫానులు, భూపాతాలు
మార్చు2010–2011
మార్చు2010 ఫిబ్రవరి 11 న సియాచెన్ లోని భారత సైనిక శిబిరంపై మంచు తుఫాను తాకడంతో, ఒక సైనికుడు మరణించాడు. ఒక బేసుక్యాంపుపై కూడా పడడంతో ఇద్దరు లడఖ్ స్కౌట్లు మరణించారు. అదే రోజున సంభవించిన మరొక తుపానులో పాకిస్తానీ సైనిక శిబిరంలోని 8 మంది సైనికులు మరణించారు.[19]
2011 లో సియాచెన్ వాతావరణానికి, ప్రమాదాల్లోనూ 24 మంది భారత సైనికులు బలయ్యారు.[20] జూలై 22 న ఇద్దరు అధికారులు వారి శిబిరంలో జరిగిన ఒక అగ్నిప్రమాదంలో మరణించారు.[21]
2012–2014
మార్చు2012 ఏప్రిల్ 7 తెల్లవారుఝామున గాయరీ సెక్టరులోని పాకిస్తానీ సైనిక ప్రధాన కార్యాలయంపై మంచుతుఫాను విరుచుకు పడగా 129 మంది సైనికులు, 11 మంది పౌర కాంట్రాక్టర్లూ మరణించారు.[22][23] ఈ సంఘటన తరువాత, భారత పాకిస్తాన్లు సియాచెన్ నుండి తమతమ బలగాలను వెనక్కు తీసుకోవాలని పాక్ సైనిక ప్రధానాధికారి జన. అష్ఫాక్ కయాని చెప్పాడు.[24]
మే 29 న చోర్బాట్ సెక్టరులో జరిగిన భూపాతంలో ఇద్దరు పాకిస్తానీ సైనికులు మరణించారు.[25] 2013 లో, వాతావరణ పరిస్థితుల కారణంగా 10 మంది భారత సైనికులు మరణించారు.
2015
మార్చు2015 నవంబరు 14 న భారత మూడవ లడఖ్ స్కౌట్స్ కు చెందిన ఒక, కెప్టెను, దక్షిణ సియాచెన్‌లో సంభవించిన మంచుతుఫానులో మరణించాడు. ఈ సంఘటనలో 15 మందిని రక్షించారు.[26]
2016
మార్చు2016 జనవరి 4 న, లడఖ్ స్కౌట్స్‌కు చెందిన నలుగురు సైనికులు నోబ్రా లోయలో గస్తీ విధుల్లో ఉండగా సంభవించిన మంచుతుఫానులో మరణించారు.[27]
మూలాలు
మార్చు- ↑ "Siachen: The Stalemate Continues". Archived from the original on 2004-10-27. Retrieved 2017-12-17. Published 1999 April.
- ↑ 2.0 2.1 "War at the Top of the World". Time.com. November 7, 2005. Archived from the original on 2012-04-12. Retrieved 2017-12-17.
- ↑ 846 Indian soldiers have died in Siachen since 1984 – Rediff.com News. Rediff.com. Retrieved on 2013-07-12.
- ↑ 4.0 4.1 తివారి, బి.కె. ఇండియాస్ నైబర్స్:పాస్ట్ అండ్ ఫ్యూచర్. Spellbound Publications, 1997. ISBN 9788176000048.
- ↑ 5.0 5.1 The Illustrated Weekly of India – Volume 110, Issues 14–26. Times of India.
Pakistani troops were forced out with over 200 casualties as against 36 Indian fatalities
- ↑ "In Siachen 869 army men died battling the elements". The Hindu. Retrieved 12 December 2015.
- ↑ Ives, Jack. Himalayan Perceptions: Environmental Change and the Well-Being of Mountain Peoples. Routledge, 2004. ISBN 9781134369089.
- ↑ VAUSE, Mikel.
- ↑ CHILD, Greg.
- ↑ Modern world history- Chapter-The Indian subcontinent achieves independence/The Coldest War.
- ↑ "Siachen Glacier: Battling on the roof of the world". Indian Defence Review.
- ↑ J. N. Dixit (2002). India-Pakistan in war & peace. Routledge. ISBN 0-415-30472-5.(pp. 39)
- ↑ Baghel, Ravi; Nusser, Marcus (2015-06-17). "Securing the heights; The vertical dimension of the Siachen conflict between India and Pakistan in the Eastern Karakoram". Political Geography. 48. Elsevier: 31–32. doi:10.1016/j.polgeo.2015.05.001. Retrieved 2016-09-23.
- ↑ The fight for Siachen, Brig. Javed Hassan (Retd) April 22, 2012, The Tribune (Pakistan)
- ↑ Harish Kapadia. Siachen Glacier: The Battle of Roses. Rupa Publications Pvt. Ltd. (India).
- ↑ Siachen- Not a Cold War Archived 2015-07-11 at the Wayback Machine, Lt. Gen. P. N. Hoon (Retd)
- ↑ Endgame at Siachen Archived 2015-07-03 at the Wayback Machine, Maj Gen Raj Mehta, AVSM, VSM (Retd) December 2, 2014, South Asia Defence and Strategic Review
- ↑ "Siachen avalanche kills 3 Indian, 8 Pak soldiers". Retrieved 2016-02-05.
- ↑ "50 Indian soldiers die in Siachen in 3 yrs". www.nationalturk.com. Retrieved 2016-02-05.
- ↑ "Indian army officers killed in Siachen fire – BBC News" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2016-02-05.
- ↑ "Pakistan resumes search for 135 buried by avalanche" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 8 April 2012. Retrieved 28 April 2012.
- ↑ "Huge search for trapped Pakistani soldiers". Al Jazeera English. 7 April 2012. Retrieved 7 April 2012.
- ↑ "Pakistan army chief urges India on glacier withdrawal – BBC News" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2016-02-05.
- ↑ "Two soldiers killed in Siachen landsliding". Retrieved 2016-02-04.
- ↑ "Army Captain dies in avalanche in Siachen glacier, 15 soldiers rescued". Archived from the original on 2016-02-05. Retrieved 2016-02-04.
- ↑ "Siachen avalanche kills four Indian Army soldiers – Firstpost" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2016-02-04.