బిలాఫోండ్ లా (బాల్టీ భాషలో "సీతాకోకచిలుకల కనుమ" అని అర్థం) సాల్టోరో రిడ్జ్‌పై ఉన్న ఒక కనుమ మార్గం. దీన్ని దీనిని సాల్టోరో కనుమ అని కూడా అంటారు. ఇది విశాలమైన సియాచిన్ గ్లేసియర్‌కు పశ్చిమాన దాదాపు 40 కి.మీ. (25 మై.) దూరాన ఉంది. సిమ్లా ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్, భారతదేశాల మధ్య 1972 నాటి నియంత్రణ రేఖ ముగింపును బిందువు NJ 980420 కు సూటిగా ఉత్తరాన ఉంది. బిలాఫోండ్ లా భారత ఉపఖండాన్ని, చైనానూ కలిపే పురాతన సిల్క్ రూట్‌లో ఉంది.[3]

బిలాఫోండ్ లా
బిలాఫోండ్ లా is located in Gilgit Baltistan
బిలాఫోండ్ లా
గిల్గిట్-బల్టిస్తాన్‌లో బిలాఫోండ్ లా స్థానం
సముద్ర మట్టం
నుండి ఎత్తు
5,450 m (17,881 ft)
ప్రదేశంభారతదేశం, సియాచెన్ హిమానీనదం, కారకోరం శ్రేణి, గిల్గిట్-బల్టిస్తాన్, భారతదేశం[1][2]
శ్రేణితూర్పు కారకోరం శ్రేణి
Coordinates35°23′N 76°57′E / 35.383°N 76.950°E / 35.383; 76.950
పటం
ఇండో-పాకిస్తాన్ పరస్పరం అంగీకరించిన వివాదరహిత "అంతర్జాతీయ సరిహద్దు" (IB) నల్ల రేఖ. ఇండో-పాకిస్తానీ "నియంత్రణ రేఖ" (LoC) ఉత్తర పశ్చిమాలలో నల్ల చుక్కల రేఖ. ఇండో-చైనా "వాస్తవాధీన రేఖ" (LAC ) తూర్పున నల్ల చుక్కల రేఖ. ఉత్తరాన సియాచిన్ మీదుగా ఇండో-పాకిస్తానీ రేఖ "వాస్తవ క్షేత్ర స్థితి రేఖ" (AGPL). ఆకుపచ్చ రంగులో చూపిన ప్రాంతాలు రెండూ పాకిస్తాన్-ఆక్రమిత ప్రాంతాలు: ఉత్తరాన గిల్గిత్-బల్టిస్తాన్, దక్షిణాన ఆజాద్ కాశ్మీర్. నారింజ రంగులో చూపబడిన ప్రాంతం జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లు తూర్పున ఐమూలగా పట్టీలు గీసిన ప్రాంతం అక్సాయ్ చిన్ అని పిలువబడే చైనా ఆక్రమిత ప్రాంతం. ఉత్తరాన, "పాకిస్తాన్ చైనాకు అప్పగించిన భారత భూభాగాలు" షక్స్‌గామ్ (ట్రాన్స్-కారకోరం ట్రాక్ట్).

భారత పాకిస్తాన్ల మధ్య సియాచిన్ వివాదంలో భాగంగా 1984 లో సైనిక చర్య ప్రారంభమైన సమయంలో బిలాఫోండ్ లా ఒక ప్రముఖమైన ప్రదేశం. భారత సైన్యం 1984 లో ఉత్తరాన సియా లా, 1987 లో దక్షిణాన గ్యోంగ్ లాతో పాటు ఈ కనుమను స్వాధీనం చేసుకుంది.[2] భారతదేశం ప్రస్తుతం బిలాఫోండ్ లా వద్ద పటిష్టమైన సైనిక స్థావరాన్ని నిర్వహిస్తోంది.[4]

భౌగోళిక రాజకీయ సమస్యలు

మార్చు

బిలాఫోండ్ లా కనుమ, అలాగే సమీపంలోని సియా లా, గ్యోంగ్ లా కనుమలూ 1984లో సియాచిన్ వివాదంలో భాగమైన ఆపరేషన్ మేఘదూత్ సమయంలో సైనిక కార్యకలాపాలు జరిగిన ప్రదేశాలు.[5] సియాచిన్ గ్లేసియర్‌కు పశ్చిమాన వ్యూహాత్మకమైన స్థానంలో ఉన్న ఈ కనుమ, భారత పాకిస్తాన్ల మధ్య ప్రస్తుత వాస్తవ క్షేత్ర స్థితి రేఖకు సమీపంలో ఉన్నందున, భారత సైన్యం ఇక్కడ సైనిక శిబిరాన్ని నిర్వహిస్తోంది.[6][7]

ఇవి కూడా చూడండి

మార్చు
వాస్తవ క్షేత్రస్థితి రేఖ (AGPL) దగ్గర
  • NJ9842, నియంత్రణ రేఖ ముగిసి, AGPL మొదలయ్యే బిందువు
  • చుమిక్ గ్లేసియర్
  • సాల్టోరో పర్వతాలు
  • సాల్టోరో కాంగ్రీ
  • ఘెంట్ కాంగ్రీ
  • ఇందిరా కల్
సరిహద్దులు
వివాదాలు
సైనిక చర్యలు

గమనికలు

మార్చు
  1. Baghel, Ravi; Nusser, Marcus (2015-06-17). "Securing the heights; The vertical dimension of the Siachen conflict between India and Pakistan in the Eastern Karakoram". Political Geography. 48. Elsevier: 31–32. doi:10.1016/j.polgeo.2015.05.001.
  2. 2.0 2.1 Wirsing, Robert (15 November 1991). Pakistan's security under Zia, 1977-1988: the policy imperatives of a peripheral Asian state. Palgrave Macmillan, 1991. ISBN 978-0-312-06067-1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Wirsing" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. "The Tribune, Chandigarh, India – Opinions". Tribuneindia.com. Retrieved 11 August 2017.
  4. Child, Greg (1998). Thin air: encounters in the Himalayas. The Mountaineers Books, 1998. ISBN 978-0-89886-588-2.
  5. Barua, Pradeep P. (30 June 2005). The State at War in South Asia (Studies in War, Society, and the Military). University of Nebraska Press. pp. 253–255. ISBN 978-0-8032-1344-9. Retrieved 2009-08-06.
  6. See "BHARAT RAKSHAK MONITOR – Volume 6 (1) July-August 2003". 14 June 2012. Archived from the original on 14 June 2012. Retrieved 11 August 2017.
  7. See http://www.hinduonnet.com/fline/fl2304/stories/20060310001704400.htm Archived 11 డిసెంబరు 2008 at the Wayback Machine for a detailed, current map.

మూలాలు

మార్చు
  • . "Nomenclature in the Karakoram: Discussion".
  • "A Slow Thaw". Time. 7 November 2005. Archived from the original on 11 September 2005. Retrieved 26 April 2010.