సిరిసిల్ల ప్రభుత్వ వైద్య కళాశాల
సిరిసిల్ల ప్రభుత్వ వైద్య కళాశాల అనేది తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల. గ్రామీణ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ఔత్సాహిక వైద్య విద్యార్థులకు వైద్య పరిజ్ఞానాన్ని అందించేందుకు తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఉండాలన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం 2023లో ఈ ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించింది. ఇది కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా ఉంది. నేషనల్ మెడికల్ కమిషన్ నుండి 2023-24 విద్యా సంవత్సరానికి 100 ఎంబిబిఎస్ సీట్లకు అనుమతి లేఖను అందుకుంది.[1]
రకం | ప్రభుత్వ వైద్య విద్య |
---|---|
స్థాపితం | 2023, సెప్టెంబరు 15 |
అనుబంధ సంస్థ | కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం |
విద్యార్థులు | 100 |
స్థానం | సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ, భారతదేశం |
జాలగూడు | కళాశాల వెబ్సైటు |
ఏర్పాటు
మార్చు2021 జూలై 4న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ముఖ్యంత్రి కేసీఆర్ వైద్య కళాశాల ఏర్పాటు ప్రకటన చేశాడు.[2] ప్రభుత్వ వైద్య కళాశాలకు 166 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ 2022 ఆగస్టు 6న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు (జీఓ ఎంఎస్ నెంబరు 99) జారీ చేసింది.[3][4]
నిర్మాణం, ప్రారంభం
మార్చుజిల్లా కేంద్రంలోని రెండో బైపాస్ రోడ్డులో 30 ఎకరాల్లో కళాశాల నిర్మాణం, మరో 29 ఎకరాల్లో జీ ప్లస్5 పద్ధతిన 200 పడకల దవాఖాన నిర్మాణం జరిగింది. కళాశాల భవనంలోని (జీ+3) ప్రతి ఫ్లోర్స్ లో నాలుగు బ్లాక్స్ ఉన్నాయని ఉన్నాయి.
2023 సెప్టెంబరు 15న తెలంగాణ రాష్ట్ర ఐటీ-పురపాలక-పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ వైద్య కళాశాల భవన సముదాయాన్ని ప్రారంభించాడు.[5]
కోర్సులు - శాఖలు
మార్చు- అనాటమీ
- ఫార్మాకాలజీ
- ఫిజియోలాజీ
- బయోకెమిస్ట్రీ
- పాథాలజీ
- మైక్రోబయోలాజీ
- ఫోరెన్సిక్ మెడిసిన్
- జెనరల్ సర్జరీ
- ఆర్థోపెడిక్స్
- ఓటో-రైనో-లారిగోలజీ
- ఆప్తాల్మోలజీ
- జనరల్ మెడిసిన్
- టిబి & ఆర్డి
- డివిఎల్
- సైకియాట్రీ
- పీడియాట్రిక్స్
- ఓబిజీ
- అనస్థీషియాలజీ
- కమ్యూనిటీ మెడిసిన్
- రేడియోడియాగ్నోసిస్
- ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్
- టీబీసీడీ
- సీటీ సర్జరీ
- న్యూరో సర్జరీ
- న్యూరాలజీ
- ప్లాస్టిక్ సర్జరీ
- యూరాలజీ
- గాస్ట్రోఎంట్రాలజీ
- ఎండోక్రైనాలజీ
- నెఫ్రాలజీ
- కార్డియాలజీ
- ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్
- ఈఎన్టీ
- ఆప్తల్
- అనస్తీషియా
- డెంటల్
తరగతుల ప్రారంభం
మార్చుఈ కళాశాలలో మొత్తం 100 మంది వైద్యులు (50 మంది ఫ్యాకల్టీ, 30 మంది సీనియర్ రేసిడెంట్ డాక్టర్స్, ఇతర డాక్టర్స్), 250మంది నాన్ టీచింగ్ అండ్ ఇతర సిబ్బంది ఉన్నారు.[6]
2023 సెస్టెంబరు 15 నుండి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రగతి భవన్ వేదికగా ఆన్లైన్ ద్వారా ఒకేసారి 9 వైద్య కళాశాలల ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం తరగతులను సీఎం కేసీఆర్ ప్రారంభించాడు.[7][8] ఈ కార్యక్రమంలో కళాశాల నుండి మంత్రి కేటీఆర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Punnam, Venkatesh (2023-04-22). "సిరిసిల్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్ఎంసి అనుమతి". Mana Telangana. Archived from the original on 2023-04-22. Retrieved 2023-09-11.
- ↑ telugu, NT News (2022-11-04). "సిరిసిల్ల మెడికల్ కాలేజ్ శరవేగం". www.ntnews.com. Archived from the original on 2022-11-05. Retrieved 2023-09-21.
- ↑ Today, Telangana (2022-08-06). "Telangana govt sanctions Rs 1,479 cr to establish 8 more medical colleges". Telangana Today. Archived from the original on 2022-08-07. Retrieved 2023-09-21.
- ↑ Telugu, 10TV; naveen (2022-08-06). "8 New Medical Collges In Telangana : రాష్ట్రంలో మరో 8 మెడికల్ కాలేజీలు.. పరిపాలన అనుమతులు జారీ చేసిన ప్రభుత్వం". 10TV Telugu (in Telugu). Archived from the original on 2023-09-21. Retrieved 2023-09-21.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ telugu, NT News (2023-09-15). "Minister KTR | మోదీ సహకరించుకున్నా.. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం : మంత్రి కేటీఆర్". www.ntnews.com. Archived from the original on 2023-09-18. Retrieved 2023-09-25.
- ↑ "నేడు సిరిసిల్ల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రారంభం.. చూడటానికి రెండు కండ్లు సరిపోవు..!". News18 Telugu. 2023-09-15. Archived from the original on 2023-09-15. Retrieved 2023-09-21.
- ↑ "KCR: వైద్య విద్యలో నవశకం.. 9 మెడికల్ కళాశాలలు ప్రారంభం". EENADU. 2023-09-15. Archived from the original on 2023-09-15. Retrieved 2023-09-21.
- ↑ telugu, NT News (2023-09-15). "CM KCR | ఒకేసారి 9 మెడికల్ కాలేజీలు ప్రారంభం.. సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం ఇది : సీఎం కేసీఆర్". www.ntnews.com. Archived from the original on 2023-09-17. Retrieved 2023-09-21.