సిసింద్రీ (సినిమా)
1994 సినిమా
సిసింద్రీ 1995 లో విడుదలైన తెలుగు సినిమా. ప్రముఖ తెలుగు నటుడు అక్కినేని నాగార్జున కుమారుడు అక్కినేని అఖిల్ ఈ చిత్రంలో బాల నటుడిగా నటించాడు. శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో నాగార్జున అక్కినేని నిర్మించాడు.[1]
సిసింద్రీ | |
---|---|
దర్శకత్వం | శివనాగేశ్వరరావు |
రచన | మరుధూరి రాజా (సంభాషణలు) |
తారాగణం | అక్కినేని అఖిల్, ఆమని, శరత్ బాబు, చలపతిరావు |
సంగీతం | రాజ్ |
నిర్మాణ సంస్థ | |
భాష | తెలుగు |
గిరిబాబు, తనికెళ్ళ భరణి, సుధాకర్, ఆమని, శరత్ బాబు, సుభలేఖ సుధాకర్ ఇతర నటులు. ఈ చిత్రంలో టబు, పూజా బాత్రా అతిథి పాత్రల్లో కనిపించారు. రాజ్ స్వరపరిచిన సంగీతం, రాజ్ కోటి ద్వయంగా కాకుండా అతడు ఒక్కడే సంగీత దర్శకత్వం చెయ్యడం ఇదే మొదలు. ఈ చిత్రం హాలీవుడ్ చిత్రం బేబీస్ డే అవుట్ (1994) యొక్క భారతీయ అనుసరణ. ఈ చిత్రాన్ని తమిళంలో చుట్టి కుజాంధాయ్ అనే పేరుతో అనువదించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది.
నటీనటులు
మార్చు- అక్కినేని నాగార్జున
- శరత్ బాబు - తండ్రి
- ఆమని - తల్లి
- అక్కినేని అఖిల
- చలపతిరావు
- టబు
- తనికెళ్ళ భరణి
- గిరిబాబు
- సుధాకర్
- శుభలేఖ సుధాకర్
పాటలు
మార్చుసం. | పాట | గాయనీ గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "ఆటాడుకుందామా" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర | 5:11 |
2. | "హెల్లో పిల్లా" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర, సురేష్ పీటర్స్ | 5:18 |
3. | "చిన్ని తండ్రీ" | స్వర్ణలత | 5:10 |
4. | "ఓరి నాయనో" | మనో, మురళీధర్, కోట శ్రీనివాసరావు | |
5. | "క్యా సీన్ హై" | మనో, అనుపమ | 5:02 |
మొత్తం నిడివి: | 25:47 |
మూలాలు
మార్చు- ↑ "Sisindri (1995) | Sisindri Movie | Sisindri Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2020-08-18.