సి.వి.సర్వేశ్వరశర్మ
సి.వి.సర్వేశ్వరశర్మ (చావలి వెంకట సర్వేశ్వరశర్మ) పాపులర్ సైన్స్ రచయితగా పేరుపొందాడు.[1] సి.వి.సర్వేశ్వరశర్మ తొలిరచన 'అదృష్టం' 1958 మే 16 న ప్రచురితమైంది. 1976 నుండి పాపులర్ సైన్సు రచనలపై దృష్టి సారించిన సర్వేశ్వరశర్మ వివిధ పత్రికలలో ఇప్పటికి ఆరువేల సైన్సు వ్యాసాలు మించి వ్రాశాడు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో మొత్తం 101 పుస్తకాలు ఈయన రచించాడు. 1984 ఫిబ్రవరి 25న కోనసీమ సైన్సు పరిషత్‌ను స్థాపించి రాష్ట్రవ్యాప్తంగా 1880 కోనసీమ సైన్సు పరిషత్ మహాసభలు నిర్వహించాడు. ఇతనికి సైన్స్ చక్రవర్తి అనే బిరుదు ఉంది. బాలల కోసం ఎన్నో సైన్సు నాటికలు, సైన్సుపాటలు, సైన్సు బుర్రకథలు, సంగీత నృత్యకథలు రచించాడు.
జీవిత విశేషాలుసవరించు
ఇతడు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం లో సుబ్బలక్ష్మి, సూర్యనారాయణ సోమయాజులు దంపతులకు సెప్టెంబరు 7, 1942 న జన్మించాడు. ఎమ్మెస్సీ (గోల్డ్ మెడలిస్టు), బి.యిడి చదివాడు. దాదాపు 40 సంవత్సరాలు కళాశాల అద్యాపకుడిగా పనిచేసి, 2000, సెప్టెంబరు 30 న అమలాపురం లోని ఎస్.కె.బి.ఆర్. కళాశాల నుండి ఫిజిక్స్ రీడర్ (అసోసియేట్ ప్రాఫెసర్) గా పదవీ విరమణ చేశాడు. ప్రస్తుతం అమలాపురం లోనే స్థిరపడ్డాడు.[2]
రచనలుసవరించు
- సైన్స్ గ్రిప్ (శాస్త్రీయ విజ్ఞానం పై పట్టు సాధించేందుకు)
- సైన్స్ సైట్ (ఆసక్తిదాయకమైన సైన్సు విశేషాలు)
- స్కై సైన్స్ (అకాశశాస్త్ర విజ్ఞానం)
- కొత్తశక్తి జనకాలు
- శాస్త్రీయ విజ్ఞానంతో వ్యవసాయం
- పర్సనాలిటీ ప్లస్ (యువత భవితకు నేస్తం)
- సైన్సు డాట్ కాం (విద్యార్థుల సైన్సు దృష్టిని కేంద్రీకరించే ఒక బయో లెన్స్)
- 101 సైన్సు ప్రయోగాలు (విద్యార్థుల సాంకేతిక నైపుణ్యం పెంచే ప్రియనేస్తం)
- సైన్సు దర్శిని (జనభాషలో ఆధునిక సైన్సు విశేషాల ఫోకస్)
- మీరే విజేతలు! విజయాలన్నీ మీవే!! (మీ భవిష్యత్తును విజయాలవెల్లువ చేసే అమృతకలశం)
- పర్సనాలిటీ టచ్ (వ్యక్తిత్వ వికాస దిక్సూచి)
- అపాయాలు - ఉపాయాలు
- నమ్మకాలు - నిజాలు (చుక్కపల్లి పిచ్చయ్య తో కలిసి)
పురస్కారాలుసవరించు
మూలాలుసవరించు
- ↑ సర్వేశ్వరశర్మకు జాతీయ పురస్కారం[permanent dead link]
- ↑ [permanent dead link] బాలసాహిత్యం భవిష్యత్తును తీర్చిదిద్దాలి[permanent dead link] - పైడిమర్రి రామకృష్ణ
- ↑ తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారాలు[permanent dead link]
- ↑ Largest science articles written by one person[permanent dead link]