సి. ఆర్. మోహన్ ప్రముఖ రంగస్థల, సినీ నటుడు, నాటక రచయిత. వీరు రంగస్థల, సినిమానటి స్వరాజ్యలక్ష్మి గారిని వివాహం చేసుకొని తెనాలిలో స్థిరపడ్డారు.[1]

వీరు కొంతకాలం ఉపాధ్యాయులుగా పనిచేశారు. 1947లో నాటకరంగ ప్రవేశం చేసి అనేక సాంఘిక, పౌరాణిక నాటకాలలో ప్రముఖ పాత్రలు పోషించారు. కొన్ని నాటకాలలో స్త్రీవేషాలు కూడా వేశారు. వీరు కొన్ని నాటకాలను రచించారు. ప్రముఖ దర్శకులు వేదాంతం రాఘవయ్య, కె.వి.రెడ్డి, జంపన చంద్రశేఖరరావు మొదలైన వారికి అసోసియేట్ డైరెక్టరుగా పలుచిత్రాలకు పనిచేశారు. వీరు పనిచేసిన చిత్రాలలో ఇంటిగుట్టు, స్వప్నమంజరి, ఋణానుబంధం, భాగ్యరేఖ, దీపావళి, భట్టి విక్రమార్క మొదలైనవి.

వీరు రేపల్లెలో శ్రీ లక్ష్మీ మ్యూజికల్ యూనిట్ నిర్వాహకులుగా ఉండి, నాటకరంగంలొ నటుడిగా, రచయితగా, రూపశిల్పిగా పనిచేస్తున్నారు.

మూలాలు

మార్చు
  1. శ్రీ సి.ఆర్. మోహన్, నూరేళ్ళ తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణలు, తెనాలి, 2006, పేజీ: 210.