సీత రత్నాకర్ (Sitha Ratnakar) పసిద్ధ నాట్యకారిణి. ఆమె చెన్నై దూరదర్శన్ కేంద్రంలో అసిస్టెంటు స్టేషను డైరక్టరుగా 1975 నుండి 2012 వరకు పనిచేసారు.[1][2][3]

సీత రత్నాకర్
సీత రత్నాకర్ చిత్రం
జననం
సీత

చెన్నై
ఇతర పేర్లుసీత రత్నాకర్
వృత్తిదూరదర్శన్ లో అసిస్టెంటు డైరక్టరు
క్రియాశీల సంవత్సరాలు1975-2012
సుపరిచితుడు/
సుపరిచితురాలు
నృత్యకారిణి
తల్లిదండ్రులు
బంధువులుదేవులపల్లి కృష్ణశాస్త్రి
వింజమూరి సీతాదేవి
వింజమూరి వెంకటరత్నమ్మ

జీవిత విశేషాలు మార్చు

ఆమె చెన్నై నగరంలో ప్రముఖ గాయకురాలు వింజమూరి అనసూయ, ఆల్ ఇండియా రేడియో వ్యాఖ్యాత, సినిమా నటుడు అవసరాల శేషగిరిరావు దంపతులకు చివరి సంతానంగా జన్మించారు.[1] ఆమె ప్రారంభంలో కలైమణి పురస్కార గ్రహీత కె.జె.సరస గారి వద్ద నుండి భరతనాట్యాన్ని అభ్యసించారు. కూచిపూడి నృట్యాన్ని వెంపటి చినసత్యం వద్ద అభ్యసించారు. ఒక దశాబ్దం పాటు భారతదేశంతో పాటు విదేశాలలో భరతనాట్య ప్రదర్శానలిచ్చారు.

ఆమె 1975 నుండి దూరదర్శన్ లో ప్రోగ్రాం డైరక్టరుగా పనిచేసేవారు. తరువాత ఆమె దూరదర్శన్ లోకి చేరక పూర్వం అడ్వర్టైజింగ్ ఏజన్సీలో కాపీరైటర్ గా కెరీర్ ప్రారంభించారు. ఆమెకు మిడియా రంగంలో 40 యేండ్ల అనుభవం ఉంది. ఆమె దూరదర్శన్లో వివిధ ప్రసిద్ధి చెందిన నాట్య కళాకారులను నృత్యాలకు దర్శకత్వం వహించారు. ఈ రికార్డింగ్స్ దూరదర్శన్ ఆర్చివ్స్ లలో లభిస్తాయి. ఆమె టెలివిజన్ కొరకు అనేక నృత్యరీతులకు దర్శకత్వం వహించారు. అందులో ప్రసిద్ధమైనది "రసవృష్టి". ఈ నాట్యరీతిలో కృష్ణుని యొక్క అనేక నృత్య భంగిమలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమం 1985లో జరిగిన గోల్డెన్ ప్రాగ్ ఫెస్టివల్ లో అధికారికంగా ప్రవేశించింది. ఆమె యొక్క నిజమైన కళాదృష్టి "ఎ ట్రైస్ట్ విత్ ట్రడిషన్" డాక్యుమెంటరీలో ఉంది. దూరదర్శన్ కెరీర్ లో ఆమె వివిధ నాట్యరీతుల అభివృద్ధి, వాటిని భద్రపరచుటపై కృషిచేసారు. అదే విధంగా అనేక నృత్య ఉత్సవాలను చిత్రీకరించారు. వాటిలో చిదంబరం యొక్క నాట్యాంజలి ఉత్సవం ప్రసిద్ధమైనది. ఆమె తమిళనాడు లోని తంజావూరు బృహదీశ్వరాలయంలోని మిలీనియం సెలబ్రేషన్స్ ను చిత్రీకరించడం ఆమెకు మంచి జ్ఞాపకం. ఆ కార్యక్రమంలో వేలాది నృత్యకారులు ప్రదర్శనలిచ్చారు. నటరాజు యొక్క గౌరవార్థం "కాస్మిక్ కనెక్షన్" డాక్యుమెంటరీని తీసారు. దానిలో నృత్యకారిణిగా, దర్శకురాలిగా సేవలనందించారు. దీనికి హోస్టన్ లోని వరల్డ్‌ఫెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్తివల్ లో 2014 సంవత్సరానికి గోల్డెన్ రెమి పురస్కారం లభించింది.[4][5]

ఆమె కె.జె.సరసతో కలసి మలేసియా, సింగపూర్, సింగపూర్ లలో నాట్యప్రదర్శనలిచ్చారు.[6]

కుటుంబం మార్చు

ఆమె కుటుంబం అంతా ప్రముఖ సాహితీకారులు, గాయకులు, సంగీతకారులు, రంగస్థల కళాకారులు. ఆమె తల్లి వింజమూరి అనసూయ దక్షిణ భారతదేశంలో ఫోక్ మ్యూజిక్ దర్శకురాలిగా ఉన్న మొట్టమొదటి మహిళ, రచయిత. ఆమె తండ్రి అవసరాల శేషగిరిరావు తెలుగు సినిమా నటుడు. ఆయన సుమంగళి (1940) చిత్రంలో నటించారు. ఆయన రంగస్థల కళాకారులూ, ఆల్ ఇండియా రేడియోలో వ్యాఖ్యాత. ఆమె అమ్మమ్మ వింజమూరి వెంకటరత్నమ్మ భారతదేశంలో మొట్టమొదటి మహిళా పత్రిక "అనసూయ" స్థాపకురాలు, రచయిత్రి.[7] ఆమె తాతగారు (తల్లి యొక్క తండ్రి) వింజమూరి వెంకట లక్ష్మీనరసింహారావు ప్రఖ్యాత రంగస్థల కళాకారులు, రచయిత. ఆయన భారత ప్రభుత్వం చే పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఆమె యొక్క అమ్మమ్మ యొక్క సోదరుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి భావకవిగా సుప్రసిద్ధుడు, పద్మవిభూషణ పురస్కార గ్రహీత.[8] ఆమె సోదరి రత్నపాప కూడా ప్రసిద్ధ నాట్యకారిణి.[9]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 With many firsts to her credit, April 11, 2008, The Hindu
  2. Season Of Splendor - First International Kuchipudi Dance Conference in North America by Kalyani Giri, Houston
  3. Confluence of arts, BY OUR CORRESPONDENT, The Hindu, January 29, 2010
  4. Samskriti to Present Award-Winning Documentary, Cosmic Connection
  5. Film on Natyanjalis wins a Gold Remi in USA By BuzyBee[permanent dead link]
  6. Nattuvanar of rare calibre, The Hindu, S. SHIVPPRASADH, January 12, 2012
  7. Queen of folk music
  8. "Form and feeling". ARUNA CHANDARAJU. The Hindu. 13 January 2012. Retrieved 4 June 2016.
  9. Rathna Kumar: Cannot imagine my life without Kuchipudi - Lalitha Venkat

ఇతర లింకులు మార్చు