సీమ సాహితీ స్వరం శ్రీ సాధన పత్రిక
సీమ సాహితీ స్వరం శ్రీ సాధన పత్రిక సాహిత్య పరిశోధకుడు, రచయిత అప్పిరెడ్డి హరినాథరెడ్డి వ్రాసిన పుస్తకం.[1] ఈ పుస్తకానికికు 2014లో కేంద్రసాహిత్య అకాడమీ వారి యువ పురస్కారం లభించింది.[2] జెన్నె మాణిక్యమ్మ పబ్లికేషన్స్ వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు.
సీమ సాహితీ స్వరం శ్రీ సాధన పత్రిక | |
"సీమ సాహితీ స్వరం శ్రీ సాధన పత్రిక" పుస్తక ముఖచిత్రం | |
కృతికర్త: | అప్పిరెడ్డి హరినాథరెడ్డి |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | శ్రీసాధన పత్రిక పత్రికలోని సాహిత్యాంశాల పరిశోధనా గ్రంథం. |
ప్రచురణ: | జెన్నె మాణిక్యమ్మ పబ్లికేషన్స్,అనంతపురము 515 001 |
విడుదల: | 2014 |
పేజీలు: | 268 |
ప్రతులకు: | శ్రీమతి జెన్నె(ఎం)మాణిక్యమ్మ పబ్లికేషన్స్,రెండవ అంతస్తు,రూమ్ నెం.7, మహమ్మద్ కాంప్లెక్స్,ఉపాధ్యాయ భవన్ ఎదురుగా, ఆదిమూర్తి నగర్,అనంతపురము |
పుస్తక నేపథ్యం
మార్చు1926 వ సంవత్సరంలో పప్పూరు రామాచార్యులు సంపాదకత్వాన శ్రీసాధన పత్రిక అనంతపురం కేంద్రంగా వెలువడింది. ఈ పత్రిక ఆధారంగా అందులోని సాహిత్యాంశాలను పరిశోధించి పుస్తకంగా ముద్రించారు. రాయలసీమ సాహిత్యంలో ఇప్పటి వరకూ వెలుగులోకి రాని ఎన్నో సాహిత్య విషయాలు ఈ పుస్తకం ద్వారా వెలుగులోకి వచ్చాయి. రాయలసీమలో అనేక ఆధునిక సాహిత్య ప్రక్రియల వికాసానికి పట్టుకొమ్మగా నిలిచిన శ్రీసాధన పత్రిక సంచికలను ప్రెస్ అకాడెమీకానీ, విశ్వవిద్యాలయాలు కానీ, రాజ్యాభిలేఖా గారము కానీ భద్రపరచలేక పోయి ఈ తరం సాహిత్యాభిమానులకు, పరిశోధకులకు తీవ్రమైన అన్యాయం చేశాయి. యువ పరిశోధకుడు డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి ఈ పత్రిక పాతసంచికలను అనంతపురం లలితకళాపరిషత్‌లో వున్న గ్రంథాలయంలో గుర్తించి శిథిలావస్థలో ఉన్న వాటిని ఎంతో శ్రమకోర్చి ఎత్తి వ్రాసుకుని ఈ పత్రికను మళ్ళీ వెలుగులోనికి తెచ్చాడు.
శ్రీసాధన పత్రికలో ప్రచురింపబడిన కవిత్వం, కథలు, స్కెచ్‌లు, నాటికా సాహిత్యం, లేఖాసాహిత్యం, యాత్రా చరిత్రలు, పుస్తక విమర్శలు, పుస్తక పరిచయాలు, సాహిత్య విమర్శావ్యాసాలు, చారిత్రక వ్యాసాలు మొదలైన వాటినన్నీ వివరిస్తూ విశ్లేషిస్తూ డా.అప్పిరెడ్డి వ్రాసిన వ్యాసాల సంకలనం ఈ 'సీమసాహితీ స్వరం శ్రీసాధన పత్రిక'. జాతీయోద్యమం, సంఘసంస్కరణ, ప్రజల జీవన స్థితిగతులు, కరువులు, క్షామనివారణ, సాగునీటి సమస్యలు, సహకారోద్యమం, స్వదేశీ వస్త్ర ఉద్యమం, స్త్రీవిద్య, వితంతు సమస్యలు, సామ్యవాద సిద్ధాంతము, మానవీయ సంబంధాలు, ఓట్ల రాజకీయాలు, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక, ధార్మిక అంశాలు మొదలైన ఎన్నో విషయాలపై ఈ పత్రికలో వెలువడిన సాహిత్యాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది.
- శ్రీసాధన పత్రిక పూర్వాపరాలు
- కవిత్వం
- కథాసాహిత్యం, విధ్వాన్ విశ్వం కథలు, కందాళ శేషాచార్యుల కథలు, పురాణ కథలు, అనువాద కథలు, స్కెచ్ లు, హెచ్.నంజుండరావు కథాలక్షణ వ్యాసం.
- నాటికా సాహిత్యం, ఏకాంకికలు, సంభాషణలు,
- నాటక సాహిత్య విశ్లేషణ, నాటక ప్రదర్శనల ప్రకటనలు
- ఆదోని పురాణ సంఘం ఉపన్యాసాలు
- లేఖా సాహిత్యం.
- యాత్రా చరిత్రలు
- శాసనాలు
- శీర్షికలు
- వ్యావహారిక, గ్రాంధిక భాషావాదాలు
- పత్రికల వివరాలు
- పుస్తక విమర్శలు, పుస్తక పరిచయాలు, పుస్తక ప్రకటనలు
- సాహిత్య సంస్థలు, కార్యక్రమాలు, శ్రీకృష్ణదేవరాయ జయంత్యుత్సవాలు, శ్రీకృష్ణదేవరాయ విద్యాపరిషత్తు.
- సాహిత్య విమర్శక వ్యాసాలు, చారిత్రక వ్యాసాలు
- సాహితీ సహృదయ చూడామణి - పిట్ దొరసానమ్మ