దేవదాసు (1974 సినిమా)

దేవదాసు విజయనిర్మల దర్శకత్వంలో 1974 లో విడుదలైన తెలుగు చిత్రం. వినోదా వారి దేవదాసు వచ్చిన రెండు దశాబ్దాల తరువాత కృష్ణ, విజయనిర్మల ద్వయం ఈ చిత్ర కల్పనకు పూనుకున్నారు. చిత్రకథ శరత్ సృష్టి అప్పటికే అనేక పర్యాయాలు భారత తెర (ఇండియన్ స్క్రీన్) మీద కనిపించింది. (సైగాల్, దిలీప్, ఎ ఎన్నార్ వంటి ఉద్దండులతో). కృష్ణ ఎంతో సాహసంతో ఈ చిత్రాన్ని నిర్మించినా విజయం దక్కలేదు. దీనితో పాటే విడుదలైన ఎ ఎన్నార్ దేవదాసు తిరిగి విజయవంతంగా నడిచింది. ఐతే కొత్త (కృష్ణ) దేవదాసు నిశ్చయంగా కొన్ని విషయాలలో ఉన్నతంగా తయారయ్యింది. ఆరుద్ర సంభాషణలు, గీతాలలో సాహితీ విలువలు, ఆ గీతాలను రమేష్ నాయుడు స్వరపరచిన విధానం చిత్రానికి విలువను సంతరించాయి. పొరుగింటి దొరగారికి పొగరు ఎక్కువ, మేఘాలమీద సాగాలి, కల చెదిరింది కథ మారింది, ఇది నిశీధి సమయం మొదలైన పాటలు పాత (ఎ ఎన్నార్) దేవదాసులో కన్న ఎక్కువ తెలుగు దనంతో (సంగీత సాహిత్య పరంగా) గబాళించాయి.

దేవదాసు (1974 సినిమా)
దర్శకత్వంవిజయనిర్మల
తారాగణంకృష్ణ,
విజయనిర్మల
సంగీతంరమేష్ నాయుడు
నిర్మాణ
సంస్థ
భాషతెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు