సూర్యాపేట ప్రభుత్వ వైద్య కళాశాల

తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, సూర్యాపేట పట్టణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల

సూర్యాపేట ప్రభుత్వ వైద్య కళాశాల అనేది తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, సూర్యాపేట పట్టణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల. గ్రామీణ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ఔత్సాహిక వైద్య విద్యార్థులకు వైద్య పరిజ్ఞానాన్ని అందించేందుకు తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఉండాలన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం 2018లో ఈ ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించింది.[1] ఇది కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా ఉంది. నేషనల్ మెడికల్ కమిషన్ నుండి 2019-20 విద్యా సంవత్సరానికి 150 ఎంబిబిఎస్ సీట్లకు అనుమతి లేఖను అందుకుంది.[2]

సూర్యాపేట ప్రభుత్వ వైద్య కళాశాల
సూర్యాపేట ప్రభుత్వ వైద్య కళాశాల భవనం
రకంప్రభుత్వ వైద్య విద్య
స్థాపితం2018
అనుబంధ సంస్థకాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం
విద్యార్థులు150
స్థానంసూర్యాపేట, సూర్యాపేట జిల్లా, తెలంగాణ, భారతదేశం

నిర్మాణం మార్చు

నిబంధనల ప్రకారం కళాశాల ఏర్పాటుకు 20 ఎకరాల స్థలం అవసరమవడంతో 2017 నవంబరు 18న అధికారులు జిల్లా కేంద్రం చుట్టూ పరిసరాల్లో అందుబాటులో ఉన్న పలు భూములను పరిశీలించారు.[3]

ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెడికల్‌ కళాశాలను నిర్మించారు. వెయ్యి మంది విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా వసతి గృహాలు, ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు, సిబ్బందికి వేర్వేరుగా వసతి భవనాలు నిర్మించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌తో కలిసి నా లుగు అంతస్తుల్లో భవనాన్ని నిర్మించారు. కళాశాల ప్రాంగణంలో పచ్చదనానికి ప్రాధాన్యం ఇచ్చారు.[4]

ప్రారంభం మార్చు

రూ.500 కోట్లతో చేపడుతున్న మెడికల్‌ కళాశాలకు సంబంధించి 156 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రధాన భవనాలను 2023, ఆగస్టు 20న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించాడు.[5] పండితుల వేదమంత్రోచ్ఛారణలతో కేసీఆర్ కు పూర్ణకుంభ స్వాగతం పలికిన అనంతరం కేసీఆర్ రిబ్బన్ కట్ చేయడంతోపాటు కళాశాల ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని రిమోట్ కంట్రోల్ ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ విద్యార్థులతో చేతులు కలిపి ముచ్చటించిన కేసీఆర్, వారి చదువు వసతులు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[6]

ఆసుపత్రి మార్చు

వైద్య కళాశాలకు వందల పడకల ఆసుపత్రి అవసరముండడంతో ప్రస్తుతమున్న 100 పడకల ఏరియా ఆసుపత్రిలో అదనంగా మరో 200 పడకలు ఏర్పాటుచేశారు.

కోర్సులు - శాఖలు మార్చు

  • అనాటమీ
  • ఫార్మాకాలజీ
  • ఫిజియోలాజీ
  • బయోకెమిస్ట్రీ
  • పాథాలజీ
  • మైక్రోబయోలాజీ
  • ఫోరెన్సిక్ మెడిసిన్
  • జెనరల్ సర్జరీ
  • ఆర్థోపెడిక్స్
  • ఓటో-రైనో-లారిగోలజీ
  • ఆప్తాల్మోలజీ
  • జనరల్ మెడిసిన్
  • టిబి & ఆర్‌డి
  • డివిఎల్
  • సైకియాట్రీ
  • పీడియాట్రిక్స్
  • ఓబిజీ
  • అనస్థీషియాలజీ
  • కమ్యూనిటీ మెడిసిన్
  • రేడియోడియాగ్నోసిస్
  • ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్
  • టీబీసీడీ
  • సీటీ సర్జరీ
  • న్యూరో సర్జరీ
  • న్యూరాలజీ
  • ప్లాస్టిక్‌ సర్జరీ
  • యూరాలజీ
  • గాస్ట్రోఎంట్రాలజీ
  • ఎండోక్రైనాలజీ
  • నెఫ్రాలజీ
  • కార్డియాలజీ
  • ఫిజికల్‌ మెడిసిన్‌ అండ్‌ రిహాబిలిటేషన్
  • ఈఎన్‌టీ
  • ఆప్తల్
  • అనస్తీషియా
  • డెంటల్

పాలిటివ్ కేర్ (స్వాంతన) చికిత్స కేంద్రం మార్చు

దీర్ఘకాలిక వ్యాధులతో అవస్థలు పడుతూ అవసాన దశకు చేరుకున్న వారికి చికిత్సలు అందించడంకోసం వైద్య కళాశాలకు అనుబంధంగా ఏర్పాటుచేసిన పాలిటివ్ కేర్ (సాంత్వన) చికిత్స కేంద్రాన్ని 2021 ఆగస్టు 23న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ప్రారంభించాడు. ఈ కేంద్రంలో చేరి చికిత్సలు పొందిన తరువాత, ఇంటికి వెళ్ళిన వారికి కూడా అవసరమైతే హోమ్ కేర్ చికిత్సలు అందిస్తున్నారు.[7]

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. May 22, Preeti Biswas / TNN /; 2018; Ist, 20:20 (2018-05-22). "Telangana to get two new govt medical colleges in Suryapet, Nalgonda - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 2022-12-02. Retrieved 2022-12-02. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  2. May 29, TNN /; 2019; Ist, 23:28 (2019-05-29). "Five medical colleges approved by MCI in Telangana - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 2022-09-01. Retrieved 2022-12-02. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  3. "2018లో వైద్య కళాశాలకు దరఖాస్తు". andhrabhoomi.net. 2017-11-18. Archived from the original on 2022-12-02. Retrieved 2022-12-02.
  4. ABN (2023-08-19). "సీఎం పర్యటనకు పేట ముస్తాబు". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-08-22. Retrieved 2023-08-22.
  5. telugu, NT News (2023-08-20). "CM KCR | సూర్యాపేటలో కేసీఆర్‌ పర్యటన.. మెడికల్‌ కాలేజీ ప్రారంభించిన సీఎం". www.ntnews.com. Archived from the original on 2023-08-22. Retrieved 2023-08-22.
  6. Velugu, V6 (2023-08-20). "సూర్యాపేటలో కలెక్టరేట్‌, ఎస్పీ ఆఫీసు ప్రారంభించిన సీఎం కేసీఆర్". V6 Velugu. Archived from the original on 2023-08-22. Retrieved 2023-08-22.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  7. telugu, NT News (2021-08-23). "సూర్యాపేట టౌన్: అవసాన దశలో ఉన్న వారికి ఆలంబన.. అందుబాటులోకి హోమ్‌కేర్ సర్వీసులు". www.ntnews.com. Archived from the original on 2022-12-02. Retrieved 2022-12-02.

ఇతర లంకెలు మార్చు