స్త్రీ జన్మ 1967, ఆగష్టు 31వ తేదీన విడుదలైన తెలుగు చలనచిత్రం. సురేష్ మూవీస్ పతాకంపై నిర్మాత డి.రామానాయుడు నిర్మించిన ఈ సినిమాకి కె ఎస్ ప్రకాశరావు దర్శకుడు. ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, కృష్ణకుమారి , కాంతారావు, కృష్ణ, నాగయ్య, అంజలీదేవి, ముఖ్యపాత్రలు పోషించారు.సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు సమకూర్చారు.

స్త్రీ జన్మ
(1967 తెలుగు సినిమా)

సినిమాపోస్టర్
దర్శకత్వం కె.ఎస్.ప్రకాశరావు
తారాగణం నందమూరి తారక రామారావు,
కృష్ణ కుమారి
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ సురేష్ మూవీస్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

కళ్యాణి విద్యాధికురాలు. ఒక విషమక్షణంలో బలాత్కారానికి లోనై శీలాన్ని కోల్పోతుంది. కళ్యాణం కాకుండానే కన్నతల్లి అవుతుంది. సంఘానికి జడిసి బిడ్డను దేవుని పాదాల వద్ద ఉంచి వెళ్ళిపోతుంది. అన్న బలవంతంమీద కళ్యాణి విధిలేక శేఖర్‌ను వివాహమాడుతుంది. యాదృచ్ఛికంగా తన బిడ్డను భర్త ఇంట్లోనే చూస్తుంది. కలుషితమైన తన శరీరాన్ని భర్తకు అర్పించలేక, కళ్ళెదుట ఉన్న బిడ్డ తన కన్నబిడ్డేనని చెప్పుకోలేక కళ్యాణి చిత్రవధ అనుభవిస్తూ ఉంటుంది. చివరకు భర్తకు తన విషయాన్ని చెబుతుంది. నాడు కళ్యాణి శీలాన్ని అపహరించింది, నేడు కళ్యాణి భర్త శేఖర్ ఒక్కరే. కళ్యాణి కష్టం గట్టెక్కింది[1].

పాటలు

మార్చు
పాట రచయిత సంగీతం గాయకులు
ఏదో ఏదో ఏదో ఏదో అవుతున్నది సి.నారాయణరెడ్డి ఘంటసాల పి.సుశీల
ఎన్నిపూవు లిలా నలిగిపోయినవో ఆత్రేయ ఘంటసాల ఘంటసాల
వెడెలె సింహబలుడు అరవీరభయంకరుడు కొసరాజు ఘంటసాల మాధవపెద్ది
స్వర్ణలత
హల్లో అన్నది మనసూ చలో అన్నది సొగసు ఆరుద్ర ఘంటసాల ఘంటసాల
పి.సుశీల
బాసందీ నదీ తీరాన రసగుల్లా కిల్లా లోన సముద్రాల జూనియర్ ఘంటసాల పిఠాపురం
ఎల్.ఆర్.ఈశ్వరి
చేయని నోమే అడగని వరమై ఆత్రేయ ఘంటసాల పి.సుశీల
ఈనాటి కుర్రకారు చూస్తే ఒకే చిరాకె సముద్రాల జూనియర్ ఘంటసాల పి.సుశీల
ఘంటసాల
ఎడారిలో పూలు పూచె ఎందుకని దాశరథి ఘంటసాల పి.సుశీల
ఘంటసాల
తల్లీ ఇది తరతరాల కథ చెల్లీ ఆత్రేయ ఘంటసాల ఘంటసాల

రాణి డైమoడ్ రాణీ నువ్వు,రచన: సముద్రాల జూనియర్, గానం. పిఠాపురం నాగేశ్వరరావు, ఎల్ ఆర్ ఈశ్వరి

ఏదో ఏదో ఏదో ఏదో అవుతున్నది, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఘంటసాల

బాలిక నన్ను కనోనని పట్టున ,(పద్యం) రచన: సముద్రాల రాఘవాచార్య, గానం.ఘంటసాల.

మూలాలు

మార్చు
  1. మద్రాసు సినిమా విలేకరి (3 September 1967). "చిత్ర సమీక్ష:స్త్రీ జన్మ". ఆంధ్రజ్యోతి దినపత్రిక. Retrieved 31 July 2020.[permanent dead link]

2.ఘంటసాల గానామృతం , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.

బయటిలింకులు

మార్చు