ఒక్కడినే
ఒక్కడినే 2013, ఫిబ్రవరి 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. గులాబీ మూవీస్ పతాకంపై సి.వి. రెడ్డి నిర్మాణ సారథ్యంలో శ్రీనివాస్ రాగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నారా రోహిత్, నిత్యా మీనన్ నటించగా, కార్తీక్ సంగీతం అందించాడు.[1][2] ఈ చిత్రం ఔర్ ఏక్ దుష్మన్ పేరుతో హిందీలోకి, కనలట్టమ్ పేరుతో మలయాళంలోకి అనువదించబడింది.
ఒక్కడినే | |
---|---|
దర్శకత్వం | శ్రీనివాస్ రాగా |
రచన | చింతపల్లి రమణ |
నిర్మాత | సి. వి. రెడ్డి |
తారాగణం | నారా రోహిత్ నిత్యా మీనన్ |
ఛాయాగ్రహణం | ఆండ్రూ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | కార్తీక్ |
నిర్మాణ సంస్థ | గులాబీ మూవీస్ |
విడుదల తేదీ | ఫిబ్రవరి 14, 2013 |
సినిమా నిడివి | 133 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- నారా రోహిత్ (సూర్య)
- నిత్యా మీనన్ (శైలజ)
- కోట శ్రీనివాసరావు (శివయ్య)
- చంద్రమోహన్
- బ్రహ్మానందం (శోధన్)
- ఎమ్మెస్ నారాయణ
- ఆలీ (నటుడు)
- సత్య కృష్ణన్
- నాగేంద్రబాబు (శ్రీను మామ)
- సాయి కుమార్ (శివాజీరావు)
- శ్రీవిష్ణు (శైలజ అన్న)
- జి. వి. సుధాకర్ నాయుడు (ఇన్స్పెక్టర్)
- స్నిగ్ధ (సుజాత)
- సుధ
- శ్రీనివాస రెడ్డి
- గురుప్రీత్ సింగ్
- రచనా మౌర్య
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: శ్రీనివాస్ రాగా
- నిర్మాత: సి. వి. రెడ్డి
- రచన: చింతపల్లి రమణ
- సంగీతం: కార్తీక్
- ఛాయాగ్రహణం: ఆండ్రూ
- కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్
- నిర్మాణ సంస్థ: గులాబీ మూవీస్
నిర్మాణం
మార్చుచిత్రీకరణ
మార్చుఈ చిత్రం 2012, జనవరి 5న హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభించబడింది.[3] అదే రోజు మొదటి షెడ్యూల్ ప్రారంభించబడి, 2012, జనవరి 9 వరకు హైదరాబాదులో చిత్రీకరణ కొనసాగింది.[4] 2012, ఫిబ్రవరి 24న అరకులో ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ప్రారంభించబడింది.[5] క్లైమాక్స్ దృశ్యాలు 2012, జూన్ 28 రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభించబడ్డాయి.[6] రామోజీ ఫిల్మ్ సిటీలో రచనా మౌర్య, 70 మంది ఇతర నృత్యకారులతో ‘పుట్టింటొల్లు తరిమేసారు…’ (జయమాలిని సూపర్ హిట్ పాట రీమిక్స్) అనే ఐటమ్ సాంగ్ చిత్రీకరించబడింది.[7]
పాటలు
మార్చుఒక్కడినే | ||||
---|---|---|---|---|
పాటలు by | ||||
Released | 22 అక్టోబరు, 2012 | |||
Recorded | 2012 | |||
Genre | పాటలు | |||
Length | 21:02 | |||
Label | ఆదిత్యా మ్యూజిక్ | |||
Producer | క్తారీక్ | |||
కార్తీక్ chronology | ||||
|
ఈ చిత్రానికి కార్తీక్ సంగీతం అందించాడు. తెలుగులో కార్తీక్ కు ఇది తొలి సినిమా. 2012, అక్టోబరు 22న హైదరాబాదులోని శిల్పకళా వేదికలో ఈ చిత్ర ఆడియో విడుదలయింది. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ, కృష్ణంరాజు, కెఎల్ నారాయణ, సాగర్, ప్రసన్న కుమార్, శేఖర్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, గోపినాథ్ రెడ్డి, అశోక్ కుమార్ విచ్చేసారు.[8] నందమూరి బాలకృష్ణ ఆడియో ఆవిష్కరించారు.[9]
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "సీతాకోక నచ్చావే (రచన: రామజోగయ్య శాస్త్రి)" | కార్తీక్, కె.టి. దర్శన | 3:56 | ||||||
2. | "హేయ్ పో (రచన: కృష్ణ చైతన్య)" | శ్వేత మోహన్ | 4:24 | ||||||
3. | "డోలా డోలా (రచన: రామజోగయ్య శాస్త్రి)" | విజయ్ ప్రకాష్, పూజా, మాళవిక | 4:24 | ||||||
4. | "పుట్టింటోళ్ళు తరిమేసారు (రచన: సాహితి)" | రంజిత్, గీతా మాధురి, స్టీవ్ వట్జ్ | 3:41 | ||||||
5. | "హోలా హోలా (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | కార్తీక్, ఎం.ఎం. మనస్వి | 4:37 | ||||||
21:02 |
టివి హక్కులు
మార్చు4 కోట్ల రూపాయలకు సన్ టివి నెట్వర్క్ వాళ్ళు శాటిలైట్ హక్కులు తీసుకున్నారు.[10]
విడుదల
మార్చుఈ చిత్రం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుండి U/A సర్టిఫికేట్ అందుకుంది.[11] ఈ చిత్రాన్ని 2012, డిసెంబరు 7న విడుదల చేయాలని అనుకున్నారు, కాని చాలాసార్లు వాయిదా పడింది.[12][13] చివరగా ఈ చిత్రం 2013, ఫిబ్రవరి 14న[14] ప్రేమికుల దినోత్సవం[15] రోజున విడుదలయింది.
స్పందన
మార్చుఈ చిత్రం విమర్శకుల నుండి ప్రతికూలంగా మిశ్రమ సమీక్షలను అందుకుంది.
పురస్కారాలు
మార్చు- నంది పురస్కారం - 2012 నంది పురస్కారాలులో ఉత్తమ ఫైట్ మాస్టర్ (గణేష్) విభాగంలో అవార్డు వచ్చింది.[20][21][22][23]
మూలాలు
మార్చు- ↑ "ఆంగ్లములో చిత్ర సమీక్ష". Telugumirchi.com. 14 February 2013. Archived from the original on 14 ఫిబ్రవరి 2013. Retrieved 14 February 2013.
- ↑ "'Okkadine' is the title for Nara Rohit's new movie". supergoodmovies.com. 5 January 2012. Archived from the original on 30 June 2016. Retrieved 23 July 2020.
- ↑ "Nara Rohit-Nitya Menon's film launched". ragalahari.com. 5 Jan 2012. Retrieved 23 July 2020.
- ↑ "Nara Rohit's new movie launched". supergoodmovies.com. 5 January 2012. Archived from the original on 4 March 2016. Retrieved 23 July 2020.
- ↑ "Nara Rohit's Okkadine at Araku". ragalahari.com. 19 February 2012. Retrieved 23 July 2020.
- ↑ "Okkadine climax at RFC". ragalahari.com. 28 June 2012. Retrieved 23 July 2020.
- ↑ "Rachana Mourya making the item girls run for their money". ragalahari.com. 2 August 2012. Retrieved 23 July 2020.
- ↑ "Okkadine audio released with fanfare". www.indiaglitz.com. Archived from the original on 23 అక్టోబరు 2012. Retrieved 23 July 2020.
- ↑ "Balakrishna unveils Okkadine audio". article.wn.com. Retrieved 23 July 2020.
- ↑ "Okkadine Satellite Rights". blogspot.in. 8 December 2012. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 23 July 2020.
- ↑ "Crisp run time for Nara Rohith's 'Okkadine'". 123telugu.com. Retrieved 23 July 2020.
- ↑ "Nara Rohit Okkadine Movie Release On Dec 14". timesofap.com. Archived from the original on 7 డిసెంబరు 2012. Retrieved 23 July 2020.
- ↑ "Nara Rohit's Okkadine postponed". 123telugu.com. Retrieved 23 July 2020.
- ↑ "Okkadine – A messed up revenge saga". 123telugu.com. 14 February 2013. Retrieved 23 July 2020.
- ↑ "Nara Rohit-s Okkadine release On Valentine's day". timesofap.com. 4 February 2013. Archived from the original on 8 ఫిబ్రవరి 2013. Retrieved 23 July 2020.
- ↑ "Okkadine Movie Review". timesofap.com. Archived from the original on 17 ఫిబ్రవరి 2013. Retrieved 23 July 2020.
- ↑ "Okkadine". entertainment.oneindia.in. Retrieved 23 July 2020.[permanent dead link]
- ↑ "Okkadine". timesofindia.indiatimes.com. Retrieved 23 July 2020.
- ↑ "Okkadine isn't appealing". rediff.com. Retrieved 23 July 2020.
- ↑ "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 30 June 2020.
- ↑ మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.
- ↑ నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.