కళ్యాణ వైభోగమే
కళ్యాణ వైభోగమే 2016, మార్చి 4న విడుదలైన తెలుగు చలనచిత్రం.[2][3] శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై ఎఎల్ దామోదర్ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో నందినీ రెడ్డి[4] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగ శౌర్య, మాళవిక నాయర్ జంటగా నటించగా, కళ్యాణ్ కోడూరి సంగీతం అందించాడు.
కళ్యాణ వైభోగమే | |
---|---|
దర్శకత్వం | నందినీ రెడ్డి |
రచన | నందినీ రెడ్డి, లక్ష్మీభూపాల్ (మాటలు) |
నిర్మాత | ఎఎల్ దామోదర్ ప్రసాద్ |
తారాగణం | నాగ శౌర్య మాళవిక నాయర్ |
ఛాయాగ్రహణం | జివిఎస్ రాజు |
కూర్పు | జునైద్ సిద్ధికి |
సంగీతం | కళ్యాణ్ కోడూరి |
విడుదల తేదీ | 4 మార్చి 2016 |
సినిమా నిడివి | 158 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | రూ. 3 కోట్లు[1] |
కథా నేపథ్యం
మార్చుబీఎస్సీ పూర్తి చేసిన శౌర్య (నాగశౌర్య) అమెరికాకు వెళ్ళాలి అనుకుంటుంటాడు. దివ్య (మాళవిక) ఎంబీబీఎస్ చదువుతూ ఆ తర్వాత విదేశాల్లో ఎండీ చదవాలని కోరుకుంటుంటుంది. కాని, వీళ్ళ తల్లిదండ్రులు పెళ్ళి కోసం వీళ్ళని తొందర పెడుతుంటారు, వీళ్ళిద్దరికీ అప్పుడే పెళ్ళి చేసుకోవడం ఇష్టం ఉండదు. తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ పెళ్ళికి సిద్ధమై, పెద్దవాళ్ళ కోసం పెళ్ళి చేసుకున్నా తర్వాత విడాకులు తీసుకుని ఎవరి జీవితం వాళ్ళు చూసుకోవాలని ప్లాన్ వేస్తారు. పెళ్ళి చేసుకున్న తరువాతిరోజు నుండే విడాకుల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వాళ్ళు అనుకున్న ప్రకారం విడిపోయారా లేదా అన్నది మిగతా కథ.[5]
నటులు
మార్చు- నాగశౌర్య (శౌర్య)
- మాళవికా నాయర్ (దివ్య)
- రాశి (ప్రమీల దేవి)
- తాగుబోతు రమేష్ (గౌతం, సాఫ్ట్వేర్ ఇంజనీర్)
- గీతా సింగ్ (పంజాబీ అతిథి)
- ఆనంద్
- ప్రగతి
- నవీన్ నేని
- ఐశ్వర్య
- స్నిగ్ధ
- పెర్ల్ మానీ (వైదేహి)
- రాజ్ మాదిరాజు
- ఆశిష్ విద్యార్థి
- ఆర్జే హేమంత్
సాంకేతికవర్గం
మార్చు- రచన, దర్శకత్వం: నందినీ రెడ్డి
- నిర్మాత: ఎఎల్ దామోదర్ ప్రసాద్
- మాటలు, పాటలు: లక్ష్మీభూపాల్
- సంగీతం: కళ్యాణ్ కోడూరి
- ఛాయాగ్రహణం: జివిఎస్ రాజు
- కూర్పు: జునైద్ సిద్ధికి
పాటలు
మార్చుకళ్యాణ వైభోగమే | ||||
---|---|---|---|---|
పాటలు by | ||||
Released | 27 డిసెంబరు, 2015 | |||
Recorded | 2015 | |||
Genre | పాటలు | |||
Length | 23:44 | |||
Label | మధుర ఆడియో | |||
Producer | కళ్యాణ్ కోడూరి | |||
కళ్యాణ్ కోడూరి chronology | ||||
|
ఈ చిత్రానికి కళ్యాణ్ కోడూరి సంగీతం అందించాడు. మధుర ఆడియో ద్వారా పాటలు విడుదలయ్యాయి. లక్ష్మీభూపాల్ చిత్రంలోని అన్ని పాటలు రాశాడు.
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "చక్కదనాల చుక్క" | కళ్యాణ్ కోడూరి, సునీత ఉపద్రష్ట | 4:14 | ||||||
2. | "చిరునవ్వులే" | హరిచరణ్, సుష్మా త్రియా | 3:52 | ||||||
3. | "పాల్ పాల్" | రాహుల్ నంబియార్, పెర్లే మానే | 3:39 | ||||||
4. | "మనసంతా మేఘమై" | చిన్మయి | 4:14 | ||||||
5. | "పెళ్ళి పెళ్ళి" | దీపు, ధనరాజ్, హేమంత్ కుమార్, లాభో | 3:54 | ||||||
6. | "ఎవరు నీవు" | విజయ్ యేసుదాస్ | 3:51 | ||||||
23:44 |
విడుదల- స్పందన
మార్చుకళ్యాణ వైభోగమే 2016, మార్చి 4న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతటా 300 స్క్రీన్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నైజాం ప్రాంతాల పంపిణీ హక్కులను అభిషేక్ పిక్చర్స్ కు, ఉత్తర భారతదేశం, ఒరిస్సా ప్రాంతాలకు పంపిణీ హక్కులు గోల్డెన్ ట్రీ ఎంటర్టైన్మెంట్ కంపెనీకి ఇచ్చారు.[6][7][8]
బాక్సాఫీస్
మార్చుకల్యాణ వైభోగమే గురువారం ప్రీమియర్స్ సందర్భంగా, $13,257 వసూలు చేసి, బాక్సాఫీస్ వద్ద శుక్రవారం $32,365 వసూలు చేసింది.[9] శనివారం $64,237 వసూలు చేసి మొత్తం $109,859కు చేరుకుంది.[10] కళ్యాణ వైభోగమే 68 స్క్రీన్ల నుండి $142,011 (₹ 95.51 లక్షలు) వసూలు చేసింది. మొదటి వారాంతంలో యుఎస్ బాక్సాఫీస్ వద్ద ప్రియాంక చోప్రా నటించిన బాలీవుడ్ చిత్రం జై గంగాజల్ కంటే ఎక్కువ వసూలు చేసింది.[11] రెండవ వారాంతంలో యుఎస్ బాక్సాఫీస్ వద్ద $46,656 వసూలు చేసింది, 10 రోజులల్లో యుఎస్ మొత్తంలో $7 227,092 (₹ 1.53 కోట్లు) వసూలు చేసింది.
మూలాలు
మార్చు- ↑ Dundoo, Sangeetha Devi (2016-07-11). "Million dollar films". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-07-29.
- ↑ "Nandini Reddy’s film Kalyana Vaibhogame on March 4"
- ↑ It feels great to know that audience have accepted Kalyana Vaibhogame: Damu
- ↑ Kavirayani, Suresh (1 March 2016). "I had narrated Kalyana Vaibhogame to Sid, Sam: Nandini Reddy". Deccan Chronicle. Retrieved 29 July 2019.
- ↑ తుపాకి, సినిమా రివ్యూ (4 March 2016). "కళ్యాణ వైభోగమే". www.tupaki.com. Archived from the original on 22 మే 2017. Retrieved 29 July 2020.
- ↑ 'Guntur Talkies', 'Shourya', 'Kalyana Vaibhogame', 'Shiva Ganga' set for release
- ↑ "Nandini Reddy’s 'Kalyana Vaibhogame' to hit screens on March 4"
- ↑ Kalyana Vaibhogame: Feel-good romantic family drama
- ↑ US box office collection: 'Kalyana Vaibhogame' leads race, beating 'Guntur Talkies', 'Shourya'
- ↑ US Box-office: It's KV All The Way
- ↑ US box office collection: 'Kalyana Vaibhogame' beats 'Jai Gangaajal' in first weekend