హుసైన్ ఇబ్న్ అలీ

ముహమ్మద్ ప్రవక్త మనుమడు,
(హుసేన్ ఇబ్న్ అలీ నుండి దారిమార్పు చెందింది)

హుసేన్ ఇబ్న్ అలీ ఇబ్న్ అబీతాలిబ్ (ఆంగ్లం: Ḥusayn ibn ‘Alī ibn Abī Ṭālib) (అరబ్బీ حسين بن علي بن أﺑﻲ طالب ) ‎ (3 షాబాన్ 4 హి.శ. - 10 ముహర్రం 61 హి.శ.; 8 జనవరి 626 సా.శ. - 10 అక్టోబరు 680 సా.శ.) ముహమ్మద్ ప్రవక్త మనుమడు, అలీ ఇబ్న్ అబీ తాలిబ్, ఫాతిమా జహ్రా ల సంతానం. హుసేన్, ఇస్లాం మతంలో ఒక ప్రముఖమైన వ్యక్తిత్వం గలవారు. ఇతను అహ్లె బైత్ (ముహమ్మద్ కుటుంబం) లో ఒకరు. షియా మతస్థుల ఇమామ్ లలో ఒకరు. ముహర్రం 10వ తేదీన జరుపుకునే యౌమ్ ఎ ఆషూరా వీరి వీరమరణ సంస్మణార్థమే. వీరికి ఇమామ్ హుసైన్ అని కూడా సంబోధిస్తారు. వీరి అన్న పేరు హసన్ ఇబ్న్ అలీ.

కర్బలా యుద్ధం

మార్చు
 
ఇరాక్ లోని కర్బలాలో ఇమామ్ హుసేన్ సమాధి.

అక్టోబరు 10 680 (ముహర్రం 10, 61 హి.శ.), వీరు, వీరి కుటుంబ సమూహం దాదాపు 108 నుండి 136 మంది [1][2], 4000మంది శతృసైన్యంతో పోరాడారు. ఈ శతృ సైన్యానికి ఉమ్ర్ ఇబ్న్ సాద్, ఆధిపత్యం వహించాడు. ఈ యుద్ధాన్నే కర్బలా యుద్ధం అని అంటారు. ఈ యుద్ధంలో మగవారంతా మరణించారు, ఒక్క జైనుల్ ఆబెదీన్ తప్ప. మిగిలిన కుటుంబ సభ్యులనంతా, యుద్ధ ఖైదీలుగా 'షామ్' (సిరియా) కు, యజీద్ వద్దకు తీసుకెళ్ళారు.[3]

ఇవీ చూడండి

మార్చు

పాదపీఠికలు

మార్చు
  1. "در روز عاشورا چند نفر شهید شدند؟". Archived from the original on 2013-03-26. Retrieved 2008-11-09.
  2. "فهرست اسامي شهداي كربلا". Archived from the original on 2012-06-29. Retrieved 2008-11-09.
  3. Battle of Karbala

మూలాలు

మార్చు
Books
Encyclopedia

బయటి లింకులు

మార్చు

See the articles and books of Battle of Karbala, Day of Ashura, Mourning of Muharram and Maqtal Al-Husayn in the relevant articles.