హెచ్. ఎన్. కుంజ్రు
హృదయ నాథ్ కుంజ్రూ (1887 అక్టోబరు 1-1978 ఏప్రిల్ 3) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రజా నాయకుడు, వివిధ సంస్థల, వ్యవస్థల స్థాపకుడు. అతను సుదీర్ఘకాలం పార్లమెంటు సభ్యుడిగా ఉండి, దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ప్రాంతీయ స్థాయిలోనూ, కేంద్ర స్థాయిలోనూ వివిధ శాసన సంస్థలలో పనిచేశాడు. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన భారత రాజ్యాంగ సభలో అతను సభ్యుడు.[1]
హెచ్.ఎన్. కుంజ్రు | |
---|---|
రాజ్యసభ సభ్యుడు | |
In office 1952–1964 | |
ప్రధాన మంత్రి | జవాహర్ లాల్ నెహ్రూ |
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ ఎఫైర్స్ అధ్యక్షుడు | |
In office 1948–1975 | |
అంతకు ముందు వారు | తేజ్ బహదూర్ సప్రూ |
తరువాత వారు | సర్దార్ స్వరణ్ సింగ్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | అలహాబాద్ | 1887 అక్టోబరు 1
మరణం | 1978 ఏప్రిల్ 3 ఆగ్రా, ఉత్తర ప్రదేశ్, భారతదేశం |
జాతీయత | • British India (1887-1947) • India (1947-1978) |
రాజకీయ పార్టీ | స్వతంత్ర్య అభ్యర్థి |
ఇతర రాజకీయ పదవులు | నేషనల్ లిబరల్ ఫెడరేషన్ |
జీవిత భాగస్వామి | సేనాపతి కుంజ్రు |
కళాశాల | ఆగ్రా కళాశాల, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ |
వృత్తి | స్వాతంత్ర్య సమర యోధుడు, పార్లమెంట్ సభ్యుడు |
పురస్కారాలు | భారత రత్న (1968) పురస్కారాన్ని తిరస్కరించాడు |
కుంజ్రు భారతదేశ స్వాతంత్ర్యానంతరం వివిధ సంస్థలను స్థాపించి, నిర్వహించాడు. అంతర్జాతీయ వ్యవహారాలపై భారతదేశంలో అధ్యయన కేంద్రాలు ఉండాలన్న ఆలోచనతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్, ఇండియన్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ సంస్థలను తన సహచరులతో కలసి స్థాపించాడు. రక్షణ వ్యవహారాలను అధ్యయనం చేయడానికి మరో సంస్థను పుణెలో ప్రారంభించాడు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేషనల్ క్యాడెట్ కార్ప్స్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వంటివాటి స్థాపనలో అతని కృషి ఉంది. 1940ల నుంచి 1960ల వరకూ రైల్వేలు, రక్షణ, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ వంటి వివిధ అంశాలపై ఏర్పరిచిన వివిధ కమిటీలు, కమిషన్లలో పనిచేశాడు.
1968లో భారత ప్రభుత్వం ఇతనికి భారతరత్న పురస్కారం ఇవ్వడానికి సిద్ధపడితే భారత గణతంత్రం ఇలాంటి పురస్కారాలు, గౌరవాలు ఇవ్వకూడదన్న తన అభిప్రాయానికి కట్టుబడి తిరస్కరించాడు.
బాల్యం, విద్యాభ్యాసం
మార్చుకాశ్మీరీ పండిట్ అయిన అయోధ్య నాథ్ కుంజ్రూకు, అతని రెండవ భార్య జాంకేశ్వరికి హెచ్.ఎన్. కుంజ్రూ రెండవ కుమారుడు. అతను అలహాబాద్‌లో 1887 అక్టోబరు 1న జన్మించాడు. అతను 1903లో మెట్రిక్యులేషన్, 1905లో ఆగ్రా కళాశాల నుండి ఎఫ్. ఎ. పూర్తి చేశాడు. 1907లో అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి బి. ఎ. పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. తదనంతరం, అతను 1910లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కు వెళ్లాడు, అక్కడ పొలిటికల్ సైన్స్‌లో బి. ఎస్సి పూర్తి చేశాడు.[2]
కుంజ్రుకు 1908లో వివాహం అయింది. అయితే, అతని భార్య 1911లో బిడ్డను ప్రసవిస్తూ మరణించింది. ఆ తరువాత ఆరు నెలల బ్రతికిన ఆ బిడ్డ కూడా మరణించింది. ఇది అతని జీవితంలో ఒక పెద్ద మలుపు. ఈ సంఘటనతో అతను తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు.[3]
రాజకీయ సిద్ధాంతం
మార్చుపండిట్ కుంజ్రూ తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్‌లో చేరి ప్రారంభించాడు, కానీ కాంగ్రెస్ విడిచిపెట్టి తేజ్ బహదూర్ సప్రు, మదన్ మోహన్ మాలవీయ వంటి ఇతర మితవాదులతో కలిసి నేషనల్ లిబరల్ ఫెడరేషన్ పార్టీని ఏర్పాటు చేశాడు. కుంజ్రు 1934లో నేషనల్ లిబరల్ ఫెడరేషన్‌కు అధ్యక్షుడయ్యాడు. నేషనల్ లిబరల్ ఫెడరేషన్ ఉన్నత మనస్తత్వంగల వ్యక్తుల సమాగమం. కుంజ్రు ఆ సంప్రదాయానికి కట్టుబడి, తన మొదటి ఎన్నికల్లో మొదలుపెట్టి ఆ తరువాత ప్రతి ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డాడు.[3] ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం శక్తివంతంగా ఉండకూడదనే తన ఉదారవాద రాజకీయ సిద్ధాంతం ఆధారంగా ప్రభుత్వేతర సంస్థలకు బలమైన మద్దతునిచ్చాడు.[1] అందుకు తగ్గట్టే, రాజ్యాంగ సభ చర్చలలో అతను జోక్యం చేసుకున్న అంశాల్లో ప్రజలపై ప్రభుత్వ అధికారాన్ని తగ్గించేవి అనేకం ఉన్నాయి.[4]
కెరీర్
మార్చుపార్లమెంటు సభ్యుడిగార
మార్చుకుంజ్రు సుదీర్ఘకాలం శాసనసభల్లో సభ్యుడిగా పనిచేశాడు. అతను యునైటెడ్ ప్రావిన్సెస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ (1921–26)లో, తరువాత సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (1926–30), కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ (1936), రాజ్యాంగ సభ (1946–50), ప్రొవిజనల్ పార్లమెంట్ (1950–52), రాజ్యసభ (1952–64)ల్లో సభ్యుడయ్యాడు.
రైల్వేలను పరిశీలించడానికి ఏర్పాటు చేసిన రెండు నిపుణుల కమిటీలకు కుంజ్రు నాయకత్వం వహించాడు. మొదటిది 1944లో భారతీయ రైల్వేలో భాగంగా ఉన్న వివిధ రైల్వే కంపెనీలను విలీనం చేయడానికి ఏర్పాటు అయింది. రెండవది 1962లో ఏర్పాటు చేసిన రైల్వే ప్రమాదాల కమిటీ. ఈ రెంటికీ అతను అధ్యక్షత వహించి పనిచేశాడు.
1946లో క్యాడెట్ కార్ప్స్‌ను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసిన కమిటీకి ఆయన ఛైర్మన్‌గా వ్యవహరించాడు. ఈ సూచనకు ఫలితంగా 1948లో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ రూపుదిద్దుకుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఏర్పాటు చేయాలని సిఫారసు చేసిన మరో కమిటీకి కూడా అతను నాయకత్వం వహించారు. 1953 నుండి 1955 వరకు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ సభ్యుడిగానూ ఉన్నాడు. అతను విస్తృతంగా పర్యటించాడు. అతను దక్షిణాఫ్రికా, యునైటెడ్ స్టేట్స్, జపాన్, పాకిస్తాన్ సహా అనేక దేశాలకు పార్లమెంటరీ కమిటీలు, ఇతర ప్రతినిధుల బృందాల్లో భాగంగా పర్యటించాడు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పసిఫిక్ రిలేషన్స్ నిర్వహించిన 1950, 1954, 1958 పసిఫిక్ సమావేశాలకు కూడా అతను అధ్యక్షత వహించాడు.[5]
విద్యావేత్తగా
మార్చుభారతదేశంలో అంతర్జాతీయ సంబంధాల అధ్యయనాన్ని ప్రోత్సహించడంలో కుంజ్రు కీలకపాత్రను పోషించాడు. అతను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్, ఇండియన్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ఏర్పాటు చేయడానికి సహాయం చేసాడు. తన ప్రభావాన్ని, పరిచయాలను ఉపయోగించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్‌కి ప్రధాన కార్యాలయమైన సప్రూ హౌస్‌ని నిర్మించడానికి రూ. 6 లక్షలు.[6] అతను బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయం, అలహాబాద్ విశ్వవిద్యాలయం, శ్రీ రామ్ ఇన్స్టిట్యూట్, ఢిల్లీ వంటి సంస్థలకు సెనేట్ సభ్యునిగానూ, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యునిగానూ వివిధ కాలాల్లో పనిచేశాడు. అతని కృషికి గుర్తింపుగా, ఈ విశ్వవిద్యాలయాలు అతనికి గౌరవ డిగ్రీలను ప్రదానం చేశాయి.[2] అతను 1953 నుండి 1966 వరకు 12 సంవత్సరాల పాటు యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ సభ్యునిగానూ, 1966లో కొంతకాలం పాటు దాని ఛైర్మన్‌గానూ పనిచేశాడు.[7] .
ఇతర విశేషాలు
మార్చుభారతీయ బాల భటుల సంస్థ (స్కౌటింగ్) వ్యవస్థాపకుల్లో ఇతను ఒకడు. అతను భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మొదటి జాతీయ కమిషనర్‌గా పనిచేశాడు. ఇతను 1909లో గోపాల కృష్ణ గోఖలే స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలో చేరి, 1936లో దాని జీవితకాల అధ్యక్షుడయ్యాడు. అతను చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీకి మొదటి అధ్యక్షునిగానూ వ్యవహరించాడు.[2]
ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ స్థాపించిన సన్నాహక కమిటీలో అతను ఒకడు. దాని ఐదుగురు ఒరిజినల్ లైఫ్ ట్రస్టీలలోనూ ఒకడు.[8] రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్ కూడా ఆయన సభ్యుడిగా ఉన్నాడు.
గౌరవాలు, పురస్కారాలు
మార్చు- 1968లో అత్యున్నత భారత పౌర పురస్కారమైన భారతరత్నకు కుంజ్రును నామినేట్ చేశారు. కానీ, గణతంత్రంలో ప్రభుత్వం ఇలాంటి గౌరవాలను ఇవ్వడాన్ని తాను వ్యతిరేకిస్తూ రాజ్యాంగ సభ చర్చల్లో తాను నిలచిన నిలువుకే కట్టుబడి భారతరత్నను తిరస్కరించాడు.[6]
- 1987లో కుంజ్రు మరణానంతరం అతని బొమ్మతో కూడిన భారత తపాలా బిళ్ళను అతని గౌరవార్థం భారత ప్రభుత్వం విడుదల చేసింది.[9]
- అతని ఆధ్వర్యంలో 1972లో పుణెలో స్థాపించిన రక్షణ వ్యవహారాల అధ్యయన కేంద్రం పేరును అతని మరణానంతరం 1980లో కుంజ్రు సెంటర్ ఆఫ్ డిఫెన్స్ అఫైర్స్ స్టడీస్ అండ్ రీసెర్చ్‌గా మార్చారు.[10]
- ఇండియన్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ కుంజ్రు పేరుతో వార్షిక ఉపన్యాసాలను ప్రారంభించింది, ఇది నేటికీ కొనసాగుతోంది.[11]
- అతనికి అలహాబాద్ విశ్వవిద్యాలయం ఎల్ఎల్.డి., అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం డి. లిట్., బనారస్ హిందూ విశ్వవిద్యాలయం డి. ఎల్. గౌరవ డిగ్రీలు ప్రదానం చేశాయి.[12]
వ్యక్తిగత జీవితం
మార్చుపండిట్ కుంజ్రుకు నవలా రచయిత హరి కుంజ్రు మేనల్లుడి మునిమనుమడు.[13] కుంజ్రు 1978 ఏప్రిల్ 3న మరణించాడు.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 (October 1978). "Pandit Hriday Nath Kunzru, A Memoir".
- ↑ 2.0 2.1 2.2 Sharga, Dr. B.N. (2008). Dr. Hriday Nath Kunzuru: A Great Patriot and Selfless Worker in S. Bhatt, J.N. Kaul, B.B. Dhar and Arun Shalia (ed.) Kashmiri Scholars Contribution to Knowledge and World Peace, Delhi:A.P.H. Publishing, ISBN 978-81-313-0402-0, pp.39–53
- ↑ 3.0 3.1 Gurtu, G. K. "From Kunjargaon to Agra: The Great Kunzru Family of Agra" (PDF). 'Kashmiri Pandits : A Cultural Heritage. Lancer Books. Archived from the original (PDF) on 1 September 2012. Retrieved 19 August 2012.
- ↑ "CONSTITUENT ASSEMBLY OF INDIA – VOLUME XI". Debates of the Constituent Assembly. Parliament of India. Retrieved 19 August 2012.
- ↑ "Participants List of the USA Council of the IPR" (PDF). Archived from the original (PDF) on 29 April 2014. Retrieved 19 September 2012.
- ↑ 6.0 6.1 Vivekanandan, B. (12 April 2012). "A Tribute to Life and Work of Professor M.S. Rajan".
- ↑ "Former Commission Members". University Grants Commission. Retrieved 18 August 2012.
- ↑ "History of the India International Centre". India International Centre. Retrieved 21 August 2012.
- ↑ "India- 87 : PANDIT H.N.KUNZRU". Archived from the original on 4 మార్చి 2016. Retrieved 1 March 2013.
- ↑ "Kunzru Centre: About Us". Kunzru Centre. Archived from the original on 14 సెప్టెంబరు 2013. Retrieved 18 August 2012.
- ↑ "Kunzru Lectures 2008" (PDF). JNU. Archived from the original (PDF) on 2 March 2013. Retrieved 18 August 2012.
- ↑ "Former Members of the Rajya Sabha" (PDF). Parliament of India. Retrieved 19 August 2012.
- ↑ Kunzru, Hari. "I'm all three — 'ari, Haah-ri and Hari". Tehelka. Archived from the original on 17 March 2004. Retrieved 19 August 2012.