హెడ్లీ హోవార్త్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

హెడ్లీ జాన్ హోవర్త్ (1943, డిసెంబరు 25 - 2008, నవంబరు 7[1]) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. న్యూజీలాండ్ క్రికెట్ జట్టు తరపున 30 టెస్టులు, తొమ్మిది వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. ఇతను న్యూజీలాండ్ మాజీ కెప్టెన్ జియోఫ్ హోవర్త్ అన్నయ్య.

హెడ్లీ హోవర్త్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
హెడ్లీ జాన్ హోవర్త్
పుట్టిన తేదీ(1943-12-25)1943 డిసెంబరు 25
గ్రే లిన్, న్యూజీలాండ్
మరణించిన తేదీ2008 నవంబరు 7(2008-11-07) (వయసు 64)
ఆక్లాండ్, న్యూజీలాండ్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్
పాత్రబౌలర్
బంధువులుజియోఫ్ హోవార్త్ (సోదరుడు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 120)1969 24 July - England తో
చివరి టెస్టు1977 25 February - Australia తో
తొలి వన్‌డే (క్యాప్ 8)1973 11 February - Pakistan తో
చివరి వన్‌డే1975 18 June - West Indies తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1963/64–1978/79Auckland
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 30 9 145 30
చేసిన పరుగులు 291 18 1,668 106
బ్యాటింగు సగటు 12.12 6.00 13.78 10.60
100లు/50లు 0/1 0/0 0/3 0/0
అత్యుత్తమ స్కోరు 61 11 61 29
వేసిన బంతులు 8,833 492 37,421 1,617
వికెట్లు 86 11 541 46
బౌలింగు సగటు 36.95 25.45 25.27 20.36
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 2 0 31 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 6 0
అత్యుత్తమ బౌలింగు 5/34 3/29 8/75 5/22
క్యాచ్‌లు/స్టంపింగులు 33/– 3/– 137/– 9/–
మూలం: Cricinfo, 2016 22 October

దేశీయ క్రికెట్ మార్చు

హోవార్త్ ఆక్లాండ్ గ్రామర్ స్కూల్‌లో చదివాడు. పేస్ బౌలర్ గా రాణించాడు. వెన్నునొప్పి రావడంతో ఇతని కోచ్ మెర్వ్ వాలెస్ స్పిన్ బౌలింగ్ తీసుకోవాలని సూచించాడు.[2] దాంతో బౌలర్ గా మారాడు. 1962లో ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు.

అంతర్జాతీయ కెరీర్ మార్చు

1969 - 1977 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 30 టెస్టులు ఆడాడు, 36.95 సగటుతో 86 వికెట్లు తీశాడు.1969లో నాగ్‌పూర్‌లో భారత్‌పై హోవార్త్ ఐదు వికెట్లు తీసి, న్యూజీలాండ్‌కు మొదటి టెస్టును అందించడంలో సహాయపడి మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు.[3] [4] కరాచీలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్‌లో 80 పరుగులకు 5 వికెట్లు తీసుకున్నాడు.[5]

1972లో బ్రిడ్జ్‌టౌన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 74 ఓవర్లు, 24 మెయిడిన్లు బౌలింగ్ చేసి 138 పరుగులకు 2 వికెట్లు తీశాడు.[6] ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక ఓవర్లు బౌలింగ్ చేసిన న్యూజీలాండ్ రికార్డు ఇది. 1975లో ఇంగ్లాండ్‌లో జరిగిన క్రికెట్ ప్రపంచ కప్‌లో ఆడిన న్యూజీలాండ్ జాతీయ క్రికెట్ జట్టులో భాగమయ్యాడు.

1977, ఫిబ్రవరిలో తన చివరి టెస్టును ఆడాడు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.[7] 1979 వరకు ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడటం కొనసాగించాడు. పదవీ విరమణ చేసిన తర్వాత, తన కుటుంబానికి చెందిన ఫిషింగ్ వ్యాపారమైన కియా ఓరా ఫిషరీస్, తర్వాత కియా ఓరా సీఫుడ్స్‌కు తన సమయాన్ని కేటాయించాడు.[8][9]

మరణం మార్చు

హోవార్త్ తన 64వ ఏట 2008, నవంబరు 7న క్యాన్సర్‌తో మరణించాడు.[7][8]

మూలాలు మార్చు

  1. "Hedley Howarth dies at 64". Cricinfo. 8 November 2008. Retrieved 2008-11-08.
  2. Nigel Smith, Kiwis Declare: Players Tell the Story of New Zealand Cricket, Random House, Auckland, 1994, p. 187.
  3. via Reuters. "Former New Zealand spinner Hedley Howarth dies", International Herald Tribune, 8 November 2008. Retrieved 9 November 2008.
  4. "2nd Test, Nagpur, Oct 3 - 8 1969, New Zealand tour of India". Cricinfo. Retrieved 8 April 2021.
  5. "1st Test, Karachi, Oct 24 - 27 1969, New Zealand tour of Pakistan". Cricinfo. Retrieved 8 April 2021.
  6. "Records | Test matches | Bowling records | Most balls bowled in an innings | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2021-02-15.
  7. 7.0 7.1 Staff. "Former New Zealand cricketer dies", Television New Zealand, 8 November 2008. Retrieved 9 November 2008.
  8. 8.0 8.1 Cleaver, Dylan. "Balanced spinner with a lot of guts", The New Zealand Herald, 9 November 2008. Retrieved 9 November 2008.
  9. Obituary in Dominion Post, 13 November 2008 page B3

బాహ్య లింకులు మార్చు