30వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన

30వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన (హైదరాబాద్ బుక్ ఫెయిర్) ప్రదర్శన హైదరాబాద్‌ తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్‌ స్టేడియం) ప్రాంగణంలో జరిగింది. ఈ పుస్తక ప్రదర్శన 15 డిసెంబర్ 2016 నుంచి 26 డిసెంబర్‌ 2016 వరకు నిర్వహించారు.[1]

నిర్వహణసవరించు

30వ జాతీయ పుస్తక ప్రదర్శన 15 డిసెంబర్ 2016 నుంచి 26 డిసెంబర్‌ 2016 వరకు మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.00 గంటల వరకు, శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో మధ్యాహ్నం 12.30 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించారు. 290 బుక్‌ స్టాల్స్‌ తో ఏర్పాటు చేసిన ఈ పుస్తక ప్రదర్శనను తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించగా, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, తెలంగాణ సాంస్కృతిక, పర్యాటకశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ అధ్యక్ష, కార్యదర్శులు జూలూరు గౌరీశంకర్, కోయ చంద్రమోహన్‌, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.[2] ఈ పుస్తక ప్రదర్శన ప్రాగణానికి సురవరం ప్రతాపరెడ్డి పేరిట నామకరణం చేసి, తెలంగాణ కలం యోధుడు మఖ్దూం మొయినుద్దీన్‌ వేదికతోపాటు, మహా శ్వేతాదేవి ప్రాంగణంలో గూడ అంజన్న వేదికను ఏర్పాటు చేసి సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు.[3][4][5]

పలు కార్యక్రమాలు, పుస్తకావిష్కరణలుసవరించు

 • పోయెట్రీ వర్క్‌షాప్‌
 • తెలంగాణ వ్యాపాలు పుస్తకావిష్కరణ
 • హైదరాబాద్‌ - పర్యావరణ స్పృహ అంశంపై సదస్సు
 • జమీల నిషత ఆధ్వర్యంలో మహిళ కవ్వాలి [6]
 • ఆలేటి కంపణం పుస్తకావిష్కరణ [7]
 • భువనైక సౌందర్యం పుస్తకావిష్కరణ
 • తెలంగాణ సినిమా - చిత్ర కళ అనే అంశంపై సదస్సు [8]

పలు స్టాళ్ల వివరాలుసవరించు

 • స్టాల్‌ నెంబర్‌ 65 - చలం సాహిత్యం
 • స్టాల్‌ నెంబర్‌ 20 - విశ్వనాథ సత్యనారాయణ సమగ్ర సాహిత్యం
 • స్టాల్‌ నెంబర్‌ 91 - ఓషో రచనలు
 • స్టాల్‌ నెంబర్‌ 04 - జిడ్డు కృష్ణమూర్తి సమగ్ర సాహిత్యం
 • స్టాల్‌ నెంబర్‌ 02 - కేంబ్రిడ్జి యూనివర్సిటీ
 • స్టాల్‌ నెంబర్‌ 03 - హరిపబ్లికేషన్స్‌ (భగవద్గీత, భారత, రామాయణాలు)
 • స్టాల్‌ నెంబర్‌ 122 - రాయలసీమ సాహితీ సౌరభాలు -
 • స్టాల్‌ నెంబర్‌ 187 - ఈషా షాపింగ్‌ జగ్గీవాసుదేవ్‌ ప్రవచనాలు
 • స్టాల్‌ నెంబర్‌ 252 - లెఫ్ట్‌ వరల్డ్‌ (వామపక్ష భావజాల సాహిత్యం)
 • స్టాల్‌ నెంబర్‌ 267 - ఇస్లామిక్‌ సాహిత్యం (తెలుగు)
 • స్టాల్‌ నెంబర్‌ 90 - పూలే-అంబేద్కర్‌

సాంస్కృతిక కార్యక్రమాల వివరాలుసవరించు

 • 15న సీహెచ్‌.రవి కుమార్‌తో ఒగ్గుడోలు
 • 16న రవీంద ర్‌రాజుతో కథక్‌ నృత్యం
 • 17న సుదీప్తపండాతో ఒడిస్సా నృత్యం
 • 18న బి.విజయకుమార్‌తో పేరిణి నృత్యం
 • 19న వడ్డేపల్లి శ్రీనివాస్‌తో జానపద ఆర్కేస్ర్టా
 • 20న జమీలా నిషతతో మహిళా కవ్వాళి
 • 21న గడ్డం సమ్మయ్యతో చిందు యక్షగానం
 • 22న టీఎస్‌ఎస్‌.ఆర్టిస్ట్‌ బి.విద్యానంద చారితో జానపద పాటలు
 • 23న సర్వత ఆలీటీంతో ఫిల్మీ గజల్స్‌
 • 24న సుధాకర్‌, రత్నశ్రీ టీంతో కూచిపూడి నృత్యం
 • 25న సీహెచ్‌రవితో గుస్సాడి నృత్యం
 • 26న రమేష్‌తో కొమ్ము కోయ నృత్యం

చిత్రమాలికసవరించు

మూలాలుసవరించు

 1. Andhrajyothy (2017). "15 నుంచి హైదాబాద్‌లో జాతీయ పుస్తక ప్రదర్శన". Archived from the original on 27 December 2021. Retrieved 27 December 2021.
 2. Sakshi (16 December 2016). "గొప్ప చరిత్రల సృష్టికి అక్షరమే పునాది". Archived from the original on 27 December 2021. Retrieved 27 December 2021.
 3. Andhrajyothy (2017). "'హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ నెంబర్‌ వన్‌ కావాలి'". Archived from the original on 27 December 2021. Retrieved 27 December 2021.
 4. Andhrajyothy (2017). "హైదరాబాద్‌లో పుస్తక మహోత్సవానికి విశేష స్పందన". Archived from the original on 27 December 2021. Retrieved 27 December 2021.
 5. Sakshi (13 December 2016). "ఆదరణ తగ్గని పుస్తక పఠనం". Archived from the original on 27 December 2021. Retrieved 27 December 2021.
 6. Andhrajyothy (2017). "హైదరాబాద్‌లో ఆకట్టుకుంటున్న పుస్తక మహోత్సవం". Archived from the original on 27 December 2021. Retrieved 27 December 2021.
 7. Andhrajyothy (2017). "'వాళ్ల నిర్లక్ష్యం వల్లే తెలంగాణ చరిత్ర మూలనపడింది'". Archived from the original on 27 December 2021. Retrieved 27 December 2021.
 8. Andhrajyothy (2017). "'భువనైక సౌందర్యం' ఆవిష్కరణ". Archived from the original on 27 December 2021. Retrieved 27 December 2021.