హైదరాబాద్ లవ్ స్టోరి
రాజ్ సత్య దర్శకత్వంలో 2018లో విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా
హైదరాబాద్ లవ్ స్టోరి, 2018 ఫిబ్రవరి 23న విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా.[1] ఎన్ఎన్ఆర్ ఫిల్మ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానరులో ఎస్.ఎన్. రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి రాజ్ సత్య దర్శకత్వం వహించాడు. ఇందులో రాహుల్ రవీంద్రన్, రేష్మి మీనన్, జియా నటించగా,[2] సునీల్ కష్యప్ సంగీతం సమకూర్చాడు. 2015లో విడుదల కావలసిన ఈ సినిమా 2018లో విడుదలైంది.[3]
హైదరాబాద్ లవ్ స్టోరి | |
---|---|
దర్శకత్వం | రాజ్ సత్య |
నిర్మాత | ఎస్.ఎన్. రెడ్డి |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | బిఏ అమరనాధ్ రెడ్డి |
కూర్పు | ఎంఆర్ వర్మ |
సంగీతం | సునీల్ కష్యప్ |
నిర్మాణ సంస్థ | ఎన్ఎన్ఆర్ ఫిల్మ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ |
విడుదల తేదీ | 23 ఫిబ్రవరి 2018 |
సినిమా నిడివి | 140 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- రాహుల్ రవీంద్రన్ (కార్తీక్)
- రేష్మి మీనన్ (భాగ్యలక్ష్మి)
- జియా శంకర్ (వైష్ణవి)
- రావు రమేశ్ (గోపాల్ రావు)
- సన (కార్తీక్ తల్లి)
- సూర్య (కార్తీక్ తండ్రి)
- అంబటి
- రమాప్రభ
- షఫి
- తాగుబోతు రమేశ్
- శంకర్ మెల్కోటే
- ధన్‌రాజ్
- రచ్చ రవి
నిర్మాణం
మార్చు2014 చివర్లో ప్రకటించబడిన ఈ సినిమా, కొన్ని కారణాల వల్ల నిర్మాణంలో ఆలస్యం అయింది.[3]
పాటలు
మార్చుఈ సినిమాకు సునీల్ కష్యప్ సంగీతం సమకూర్చాడు.[1] 2015, జనవరిలో పాటలు విడదలయ్యాయి.[4]
- ఖవ్వాలీ (గానం: సునీల్ కశ్యప్)
- ఏమైనదో (గానం: హేమచంద్ర)
- జాజి పువ్వా (గానం: సునీల్ కశ్యప్, మానస)
- హర్ట్ ఎటాక్ (గానం: హేమచంద్ర)
- సూపర్ గర్ల్ (గానం: శ్రావణ భార్గవి)
- ఈ నేలపై (గానం: లిప్సిక)
విడుదల, స్పందరన
మార్చు"హైదరాబాద్ లవ్ స్టోరీ సినిమా గజిబిజి లాగా ఉంది" అని న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అని రాసింది.[5] "ప్రధాన తారాగణం నటన, కథ బాగుంది. కామెడీ సరిగాలేదు" అని ఆసియానెట్ పత్రిక రాసింది.[6]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Rahul Ravindran's 'Hyderabad Love Story' gets a release date – Times of India". The Times of India.
- ↑ "Trailer: Hyderabad Love Story – Times of India". The Times of India.
- ↑ 3.0 3.1 kavirayani, suresh (25 June 2015). "My focus is on Telugu: Rahul Ravindran". Deccan Chronicle.
- ↑ "ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ". Sakshi. 11 January 2015.
- ↑ "Hyderabad Love Story review: Brainless wonder on 70mm". The New Indian Express.
- ↑ ""హైదరాబాద్ లవ్ స్టోరీ" మూవీ రివ్యూ". Asianet News Network Pvt Ltd.