హోమినినే, హోమినిడే కుటుంబం లోని ఉప కుటుంబం. దీన్ని " ఆఫ్రికా హోమినిడ్లు" లేదా " ఆఫ్రికా వాలిడులు" అని కూడా అంటారు. [1] [2] ఇందులో రెండు తెగలు, వాటిలో ప్రస్తుతం ఉనికిలో ఉన్న, అంతరించిపోయిన జాతులూ ఉన్నాయి: 1) హోమినిని తెగ (ఆధునిక మానవులు, అనేక అంతరించిపోయిన జాతులతో కూడిన హోమో ప్రజాతి; కనీసం రెండు అంతరించిపోయిన ప్రజాతులు ఉన్న ఆస్ట్రలోపిథెసినా ఉపతెగ; పాన్ అనే ప్రజాతి (ఇందులో సాధారణ చింపాంజీలు, బోనోబోలను ఉన్నాయి) కలిగిన పానినా అనే ఉపతెగ. 2) గొరిల్లిని తెగ (గొరిల్లాలు). పాన్ ప్రజాతి దాని స్వంత, మూడవ తెగ అయిన పానినికి చెందినట్లుగా కూడా పరిగణిస్తారు. గొప్ప వాలిడుల వంశరేఖ నుండి ఒరాంగుటాన్లు (పొంగినే ఉపకుటుంబం) విడిపోయిన తరువాత ఉద్భవించిన హోమినిడ్లన్నీ హోమినినే కుటుంబంలో భాగమే. హోమినినే క్లాడోగ్రామ్‌లో మూడు ప్రధాన శాఖలు ఉన్నాయి: ఇవి గోరిల్లిని తెగ ద్వారా గొరిల్లాలు, హోమినిని తెగ, దాన్నుండి హోమినినా ద్వారా (మానవులు), పానినా (చింపాంజీలు) ఉపతెగలు (క్రింది పరిణామ వృక్షాన్ని చూడండి). ఉనికిలో ఉన్న జాతులు -గొరిల్లినిలో రెండు , పానినాలో రెండు (చింపాంజీలు, బోనోబోస్), హోమినినాలో ఒకటి (మానవులు) ఉన్నాయి. హోమో ఫ్లోరేసియెన్సిస్, హోమో డెనిసోవాతో సహా కొన్ని ఊహాత్మక హోమో జాతుల జాడలు 40,000 సంవత్సరాల క్రితం నాటి ఇటీవలి కాలంలో కూడా కనుగొన్నారు. హోమినినే ఉపకుటుంబం లోని జీవులను హోమినైన్ అని, హోమినైన్లనీ పిలుస్తారు. (హోమినిన్, హోమినిన్లు, హోమినిని - ఈ మూడూ "హోమినిని"కి పర్యాయ పదాలు- అనేవి వేరే పదాలు. హోమినినేకు వీటికీ ఉన్న తేడాను గమనింపులో ఉంచుకోవాలి).

హోమినినే
Temporal range: 12.5–0 Ma
Secretary Leonard Carmichael.jpg
ముగ్గురు హోమినైన్లు: ఒక మానవుడు - కుడి చేతిలో గొరిల్లా పిల్లను, ఎడమ చేతిలో చింపాంజీ పిల్లనూ పట్టుకుని.
Scientific classification e
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Mammalia
Order: Primates
Suborder: Haplorhini
Infraorder: Simiiformes
Family: Hominidae
Subfamily: Homininae
Gray, 1825
Type species
Homo sapiens
Linnaeus, 1758
Tribe

Dryopithecini
Gorillini
Hominini

sister: Ponginae

ఆవిష్కరణలు, వర్గీకరణల చరిత్రసవరించు

 
హోమినోయిడియా సూపర్‌ కుటుంబపు పరిణామ వృక్షం. హోమినినే ఉప కుటుంబం హైలైటు చేసి ఉంది: దాదాపు 180 లక్షల సంవత్సరాల క్రితం హైలోబాటిడే (ప్రస్తుత గిబ్బన్లు) ప్రధాన శాఖ నుండి విడిపోయిన తరువాత పొంగినే (ప్రస్తుత ఒరంగుటాన్) ఉప కుటుంబం వేరుపడింది; తరువాత హోమినినే ఉపకుటుంబం హోమినిని (హోమినినా, పానినా ఉపతెగలతో), గొరిల్లిని తెగలుగా విడిపోయింది.

1970 వరకూ, హోమినిడే అంటే మానవులు మాత్రమే; మానవులు కాని గొప్ప వాలిడులన్నిటినీ పోంగిడే కుటుంబం లోకి చేర్చారు.[3] తరువాతి కాలంలో జరిగిన ఆవిష్కరణల తరువాత ఈ వర్గీకరణ సవరణలకు గురైంది. మానవులను (ప్రస్తుతం హోమినినే ఉపకుటుంబంలో ఉన్నారు) హోమినిడే కుటుంబంలో భాగంగా చేసి, గొప్ప వాలిడులతో కలిపారు. [4] 1990 నాటికి, ఒరంగుటన్ల కంటే గొరిల్లాలు, చింపాంజీలూ మానవులకు దగ్గరని తెలిసింది. దాంతో గొరిల్లాలు, చింపాంజీలను కూడా హోమినినే ఉపకుటుంబం లోకి చేర్చారు.[5]

హోమినినే ఉప కుటుంబాన్ని మూడు శాఖలుగా విభజించవచ్చు: 1. గొరిల్లిని తెగ (గొరిల్లాలు), 2. పానినా (చింపాంజీలు) హోమినినా (మానవులు, వారి అంతరించిన బంధువులూ) ఉపతెగలతో హోమినిని తెగ, 3. అంతరించిపోయిన డ్రయోపిథెసీని తెగ. 2007 లో వివరించిన అంత్య మియోసిన్ శిలాజం నకాలిపిథెకస్ నకయామాయి, బహుశా, దాని సమకాలీన ఔరానోపిథెకస్ లాగానే డ్రయోపిథెసీని క్లేడ్ లోని ప్రాథమిక సభ్యుడు; అంటే, అవి ప్రస్తుతం ఉనికిలో ఉన్న మూడు శాఖలలో దేనికీ చెందవు. వాటి ఉనికిని బట్టి, హోమినినే తెగలు విడిపోయినది సుమారు 80 లక్షల సంవత్సరాల క్రితం కంటే ముందు కాదని తెలుస్తుంది.

వర్తమాన కాలంలో, చింపాంజీలు, గొరిల్లాలు ఉష్ణమండల అడవులలో ఆమ్లయుత నేలల్లో నివసిస్తాయి. ఈ నేలల్లో శిలాజాలు సురక్షితంగా ఉండవు, దెబ్బతింటాయి. గొరిల్లాల శిలాజాలేమీ దొరకనప్పటికీ, 500,000 సంవత్సరాల క్రితం నాటి చింపాంజీ దంతాలు తూర్పు ఆఫ్రికా రిఫ్ట్ వ్యాలీలో (కప్తూరిన్ నిర్మాణం, కెన్యా) లో నాలుగు కనిపించాయి. ఇక్కడ మానవ వంశానికి (హోమినిన్స్) [Note 1] చెందిన అనేక శిలాజాలను కూడా కనుగొన్నారు. [6] దీన్నిబట్టి ఆ కాలంలో కొన్ని చింపాంజీలు హోమోల (హెచ్. ఎరెక్టస్ లేదా హెచ్. రోడెసియెన్సిస్) సమీపంలో నివసించినట్లు తెలుస్తుంది; గొరిల్లాల విషయంలో కూడా ఇది వర్తిస్తుంది.  

వర్గీకరణసవరించు

హోమినోయిడియా (హోమినాయిడ్లు, వాలిడులు)
హైలోబాటిడే (గిబ్బన్లు)
హోమినిడే (హోమినిడ్లు, గొప్ప వాలిడులు)
పోంగినే
(ఒరంగుటన్లు)
హోమినినే
గొరిల్లిని
(గొరిల్లా)
హోమినిని
పానినా
(చింపాంజీలు)
హోమినినా (మానవులు)
 • తెగ డ్రయోపిథెసీని†
  • కెన్యాపిథెకస్
   • కెన్యాపిథెకస్ వికేరి
  • ఔరానోపిథెకస్
   • ఔరానోపిథెకస్ మాసెడోనియెన్సిస్
  • ఒటావిపిథెకస్
   • ఒటావిపిథెకస్ నమీబియెన్సిస్
  • మొరాటోపిథెకస్
   • మొరాటోపిథెకస్ బిషోపి
  • ఓరియోపిథెకస్
   • ఓరియోపిథెకస్ బంబోలీ
   • నకాలిపిథెకస్
   • నకాలిపిథెకస్ నకయామాయి
  • అనోయియాపిథెకస్
   • అనోయియాపిథెకస్ బ్రెవిరోస్ట్రిస్
  • డ్రయోపిథెకస్
   • డ్రయోపిథెకస్ వుడుయెన్సిస్
   • డ్రయోపిథెకస్ ఫోంటాని
  • హిస్పానోపిథెకస్
   • హిస్పానోపిథెకస్ లేటానస్
   • హిస్పానోపిథెకస్ క్రూసాఫోంటి
  • నియోపిథెకస్
   • నియోపిథెకస్ బ్రాంకోయి
  • పీరోలాపిథెకస్
   • పీరోలాపిథెకస్ కటలానికస్
  • రుడాపిథెకస్
   • రుడాపిథెకస్ హంగేరికస్
  • సంబూరుపిథెకస్
   • సంబూరుపిథెకస్ కిప్టాలమి
  • ఉడాబ్నోపిథెకస్
   • ఉడాబ్నోపిథెకస్ గరేడ్జియెన్సిస్
  • డానూవియస్
   • డానూవియస్ గుగ్గెన్‌మోసి
 • తెగ గొరిల్లిని
  • కొరోరాపిథెకస్
   • కొరోరాపిథెకస్ అబిస్సినికస్
  • ప్రజాతి గొరిల్లా
   • పశ్చిమ గొరిల్లా, గొరిల్లా గొరిల్లా
    • పశ్చిమ పల్లపు భూముల గొరిల్లా, గొరిల్లా గొరిల్లా గొరిల్లా
    • నదికి ఆవలి గొరిల్లా, గొరిల్లా గొరిల్లా డియేలీ
   • తూర్పు గొరిల్లా, గొరిల్లా బేరింగీ
    • కొండ గొరిల్లా, గొరిల్లా బేరింగీ బేరింగీ
    • తూర్పు పల్లపు భూముల గొరిల్లా, గొరిల్లా బేరింగీ గ్రాయేరీ
 • తెగ హోమినిని

పరిణామంసవరించు

హోమినినే ఉపకుటుంబపు (హోమినినే-పొంగినే చివరి సాధారణ పూర్వీకుడి) వయస్సు సుమారు 140 [9] నుండి 125 లక్షల సంవత్సరాలు (శివాపిథెకస్) ఉంటుందని అంచనా వేసారు. [10] [11] గొరిల్లిని, హోమిని లుగా వేరుపడడం ("గొరిల్లా-మానవ చివరి ఉమ్మడి పూర్వీకుడు", జిహెచ్‌ఎల్‌సిఎ) సుమారు 80 - 100 లక్షల సంవత్సరాల క్రితం (T GHLCA), మయోసీన్లో, నకాలిపిథెకస్ నకయామాయి కాలానికి దగ్గరలో జరిగిందని అంచనా వేసారు. [12]

పాన్, హోమో ప్రజాతులు విడిపోయే వరకు, గొరిల్లాలు, పాన్-హోమో పూర్వీకుల మధ్య సంకరం జరిగినట్లు ఆధారా లున్నాయి. [13]

ద్విపాద నడక పరిణామంసవరించు

ఆర్డిపిథెకస్ రామిడస్ (44 లక్షల సంవత్సరాల క్రితం), ఒర్రోరిన్ టుగునెన్సిస్ (60 లక్షల సంవత్సరాల క్రితం) లపై ఇటీవల చేసిన అధ్యయనాల్లో అవి కొంత స్థాయిలో రెండు కాళ్ళపై నడిచేవని తెలిసింది. ఆస్ట్రలోపిథెకస్, తొలి పారాంత్రోపస్ లు ద్విపాదులై ఉండవచ్చు. ఆర్డిపిథెకస్ రామిడస్ వంటి చాలా తొలినాళ్ళ హోమినిన్లు చెట్లపై రెండుకాళ్లపై చరించి ఉండవచ్చు. [14]

మెదడు పరిమాణం పరిణామ క్రమంసవరించు

మానవ పరిణామ క్రమంలో మెదడు పరిమాణం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇది నుండి ప్రారంభమైంది   వరకు హోమో హబిలిస్‌లో సుమారు 600 సెం.మీ.3 ఉన్న మెదడు హోమో నియాండర్తాలెన్సిస్‌ నాటికి 1500 సెం.మీ 3 అయింది. అయితే, ఆధునిక హోమో సేపియన్స్ మెదడు పరిమాణం నియాండర్తళ్ళ కంటే (1250 సెం.మీ 3) కొద్దిగా తక్కువగా ఉంది. మహిళల మెదడు, పురుషుల కంటే కొంచెం చిన్నగా ఉంటుంది. హాబిట్స్ అనే మారుపేరుతో ఉన్న ఫ్లోరెస్ హోమినిడ్లు ( హోమో ఫ్లోరేసియెన్సిస్ ) కపాల సామర్థ్యం 380 సెం.మీ 3 గా ఉంది. (ఈ పరిమాణం చింపాంజీల విషయం లోనే చిన్నదిగా భావిస్తారు). ఇది హోమో ఎరెక్టస్ సగటు మెదడు పరిమాణంలో మూడవ వంతు. వారు ఇన్సులర్ మరుగుజ్జు కేసుగా హెచ్. ఎరెక్టస్ నుండి ఉద్భవించారని ప్రతిపాదించారు. వారి మెదడు చిన్నదిగా ఉన్నప్పటికీ, H. ఫ్లోరేసియెన్సిస్ అగ్నిని ఉపయోగించారని, రాతి పనిముట్లను కనీసం H. ఎరెక్టస్ లు తయారు చేసినట్లుగా చేసారనీ ఆధారా లున్నాయి. [15] ఈ సందర్భంలో, తెలివితేటల కోసం, మెదడు పరిమాణం కంటే దాని నిర్మాణంపైనే తెలివితేటలు ఎక్కువగా ఆధారపడి ఉంటాయని తెలుస్తోంది. [16]

కుటుంబ నిర్మాణం, లైంగికత పరిణామంసవరించు

లైంగికత అనేది కుటుంబ నిర్మాణానికి సంబంధించినది. కుటుంబాన్ని మలచడంలో దానికి పాత్ర ఉంది. విద్యలో తండ్రుల ప్రమేయం మానవులకే ప్రత్యేకమైన విషయం -కనీసం ఇతర హోమినినేలతో పోల్చినప్పుడు. మహిళల్లో అంతర్గత అండోత్సర్గము (అండం విడుదలైన సమయంలో ఆ సూచనలేమీ బయటికి కనిపించవు), రుతువిరతి (మెనోపాజ్) రెండూ కొన్ని ఇతర ప్రైమేట్లలో కూడా జరుగుతాయి గాని, ఇతర జాతులలో ఇది సాధారణ విషయం కాదు. వృషణము, పురుషాంగం పరిమాణం కుటుంబ నిర్మాణానికి సంబంధించినవిగా కనిపిస్తాయి: మానవుల్లో ఏక పత్నిత్వం, చింపాజీల్లో లైంగిక విశృంఖలత్వం, గొరిల్లాల్లో బహుభార్యాత్వం. [17] [18] లైంగిక డైమోర్ఫిజంను సాధారణంగా లైంగిక ఎంపికకు గుర్తుగా భావిస్తారు. తొలి హోమినిన్లు డైమోర్ఫిజం (పురుషులు, స్త్రీల శరీర నిర్మాణాల్లో ఉండే తేడా) ఎక్కువగా ఉండి, పరిణామ క్రమంలో హోమో జాతి రూపుదిద్దుకునే సమయానికి మానవుల్లో ఉన్న ఏకపత్నిత్వంతో సమాంతరంగా తగ్గుతూ వచ్చిందని అధ్యయనాల్లో తెలిసింది. బహుభార్యల అంతఃపురాల్లో నివసించే గొరిల్లాల్లో పెద్ద ఎత్తున లైంగిక డైమోర్ఫిజమ్‌ కనిపిస్తుంది. మానవ స్త్రీలలో గోప్య అండోత్సర్గము - అంటే స్త్రీలలో అండం విడుదల సమయం బయటికి కనబడక పోవడం - ఉండగా, ఆడ చింపాంజీల్లో జననేంద్రియం ఉబ్బడం ద్వారా అండం విడుదలను తెలియజేస్తుంది. ఋతుదశను బట్టి మానవ స్త్రీలు తమ అండం విడుదలను కొంతవరకు తెలుసుకోవచ్చు, కాని పురుషులు దాన్ని గుర్తించే అవకాశం లేదు. చాలా ప్రైమేట్లలో అర్ధ గోప్య అండోత్సర్గము ఉంది. అందుచేత ఉమ్మడి పూర్వీకుడికి అర్థ గోప్య అండోత్సర్గము ఉందని, ఇది గొరిల్లాలు వారసత్వంగా పొందాయని, తరువాత అది మానవులలో గోప్య అండోత్సర్గముగా పరిణామం చెందిందనీ, చింపాంజీలలో బహిరంగ అండోత్సర్గముగా పరిణామం చెందిందనీ భావించవచ్చు. రీసస్ కోతులలో, చింపాంజీలలో కూడా రుతువిరతి సంభవిస్తుంది. కానీ గొరిల్లాల్లో జరగదు. ఇతర ప్రైమేట్లలో (ఇతర క్షీరద సమూహాలలో) ఇది చాలా అసాధారణ విషయం.

ఇవి కూడా చూడండిసవరించు

గమనికలుసవరించు

 1. హోమినిని తెగ సభ్యుడిని హోమినిన్ అంటారు, హోమినినే ఉపకుటుంబం లోని సభ్యుడిని హోమినైన్ అంటారు. హోమినిడే కుటుంబం లోని సభ్యుడిని హోమినిడ్ అంటారు. హోమినోయిడియా సూపర్ కుటుంబం లోని సభ్యుడిని హోమినాయిడ్ అంటారు.

మూలాలుసవరించు

 1. Lua error in మాడ్యూల్:Citation/CS1/Identifiers at line 1014: attempt to compare nil with number.
 2. Lua error in మాడ్యూల్:Citation/CS1/Identifiers at line 1014: attempt to compare nil with number.
 3. Goodman M (1964). "Man's place in the phylogeny of the primates as reflected in serum proteins". In Washburn SL (ed.). Classification and Human Evolution. Transaction Publishers. pp. 204–234. ISBN 978-0-202-36487-2.
 4. Goodman M (1974). "Biochemical Evidence on Hominid Phylogeny". Annual Review of Anthropology. 3: 203–228. doi:10.1146/annurev.an.03.100174.001223.
 5. Lua error in మాడ్యూల్:Citation/CS1/Identifiers at line 1055: attempt to compare nil with number.
 6. Lua error in మాడ్యూల్:Citation/CS1/Identifiers at line 1055: attempt to compare nil with number.
 7. Praeanthropus garhi Asfaw 1999 (ape).
 8. Orangutan Pongo pygmaeus.
 9. Hill, Andrew; Ward, Steven (1988). "Origin of the Hominidae: The Record of African Large Hominoid Evolution Between 14 My and 4 My". Yearbook of Physical Anthropology. 31 (59): 49–83. doi:10.1002/ajpa.1330310505.
 10. Finarelli JA, Clyde WC (2004). "Reassessing hominoid phylogeny: Evaluating congruence in the morphological and temporal data" (PDF). Paleobiology. 30 (4): 614–651. doi:10.1666/0094-8373(2004)030<0614:RHPECI>2.0.CO;2. Archived from the original (PDF) on 2010-07-21. Retrieved 2019-12-16.
 11. Lua error in మాడ్యూల్:Citation/CS1/Identifiers at line 1055: attempt to compare nil with number.
 12. Jha, Alok (March 7, 2012). "Gorilla genome analysis reveals new human links". The Guardian. Retrieved May 8, 2015.Jha, Alok (March 9, 2012). "Scientists unlock genetic code for gorillas - and show the human link". The Sydney Morning Herald. Retrieved May 8, 2015.Hansford, Dave (November 13, 2007). "New Ape May Be Human-Gorilla Ancestor". National Geographic News. Retrieved May 8, 2015.
 13. Popadin, Konstantin; Gunbin, Konstantin; Peshkin, Leonid; Annis, Sofia; Fleischmann, Zoe; Kraytsberg, Genya; Markuzon, Natalya; Ackermann, Rebecca R.; Khrapko, Konstantin (2017-10-19). "Mitochondrial pseudogenes suggest repeated inter-species hybridization in hominid evolution". bioRxiv (in ఆంగ్లం): 134502. doi:10.1101/134502.
 14. Lua error in మాడ్యూల్:Citation/CS1/Identifiers at line 1014: attempt to compare nil with number.
 15. Lua error in మాడ్యూల్:Citation/CS1/Identifiers at line 1055: attempt to compare nil with number.
 16. Davidson, I. (2007). "As large as you need and as small as you can—implications of the brain size of Homo floresiensis". In Schalley, A.C.; Khlentzos, D. (eds.). Mental States: Evolution, function, nature; 2. Language and cognitive structure. Studies in language companion. 92–93. John Benjamins. pp. 35–42. ISBN 978-9027231055.
 17. Diamond J (1991). The Third Chimpanzee.
 18. Diamond J (1997). Why is Sex Fun?.

వనరులుసవరించు

 • Hollox, Edward; Hurles, Matthew; Kivisild, Toomas; Tyler-Smith, Chris (2013). Human Evolutionary Genetics (2nd ed.). Garland Science. ISBN 978-0-8153-4148-2.
 • Error on call to మూస:cite web: Parameters url and title must be specified

బాయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=హోమినినే&oldid=2814919" నుండి వెలికితీశారు