11వ ఆంధ్రమహాసభ (భువనగిరి)
11వ ఆంధ్రమహాసభ, 1944 మే 27, 28 తేదీలలో భువనగిరి పట్టణంలో జరిగింది.[1] ఈ సభకు దాదాపు 10వేల మంది హాజరయ్యారు.[2] ఈ సభ 11వ సమావేశంలో ఆంధ్రమహాసభ రెండుగా చీలడంతో ఇందులోని సభ్యులు అతివాదులు, మితవాదులుగా విడిపోయి విడివిడిగా సమావేశాలు జరుపుకున్నారు.
ఆంధ్రమహాసభ
మార్చుతెలంగాణ ప్రాంతంలో తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి జరుగుతున్న ఆన్యాయానికి వ్యతిరేకంగా ఆంధ్రమహాసభ స్థాపించబడింది. 1922లో ప్రారంభమైన నిజాం రాష్ట్ర ఆంధ్ర జనసంఘం 1930 నాటికి ఆంధ్రమహాసభగా మారింది.
పాల్గొన్నవారు
మార్చురావి నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభకు ఆహ్వాన సంఘ అధ్యక్షుడికి ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి, కార్యదర్శిగా ఆరుట్ల రామచంద్రారెడ్డి, కవి సుద్దాల హనుమంతు, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు నల్లా నరసింహులు తదితరులు స్వచ్ఛంద సేవకులుగా, పాల్వంచ సంస్థానపు రాణి అలివేలు మంగతాయరమ్మ మహిళా అధ్యక్షురాలుగా వ్యవహరించారు. హైదరాబాద్ నుంచి కామ్రేడ్స్ అసోసియేషన్, ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ ఆన్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సభ్యులు, మేధావులు, అభ్యుదయవాదులు పాల్గొన్నారు. చండ్ర రాజేశ్వరరావు, రాజా బహదూర్ వెంకట రామారెడ్డి తదితరులు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. జైని మల్లయ్య గుప్తా, కాసం కృష్ణమూర్తి తదితరులు కూడా ఈ సభలో పాల్గొన్నారు.[3]
ప్రతిపాదనలు
మార్చుప్రజలను పట్టి పీడిస్తున్న వెట్టిచాకిరి వంటి సమస్యల మీద ఈ సభలో దృష్టిసారించి ఆ దిశగా ప్రజల్లో చైతన్యం కలిగించింది.[4]
ఫలితాలు
మార్చుఈ సభ ద్వారా చైతన్యవంతమైన ప్రజలు వెట్టిచాకిరిపై తిరుగుబాటు చేశారు. నారాయణరెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఈ ఆంధ్ర మహాసభ గ్రామగ్రామానికి విస్తరించి ప్రజలను సమాయత్తపర్చింది. గ్రామాల్లో సంఘాలు ఏర్పడ్డాయి.[5] వెట్టిచాకిరిపై ఉన్న వ్యతిరేకతను గమనించిన నిజాం ప్రభుత్వం వెట్టిచాకిరి రద్దుచేస్తూ 1945లో నిజాం ఫర్మానా విడుదల చేసింది.
ఇతర వివరాలు
మార్చుసభ్యత్వ రుసుము 4 అణాల నుంచి 1 అణాకు తగ్గించారు.
మూలాలు
మార్చు- ↑ Telangana People's Armed Struggle, 1946-1951. Part One: Historical Setting By P. Sundarayya Social Scientist, Vol. 1, No. 7. (Feb., 1973), pp. 3-19.[1]
- ↑ "ఆంధ్ర మహాసభ". EENADU PRATIBHA. Archived from the original on 2021-12-25. Retrieved 2021-12-25.
- ↑ "అలుపెరుగని పోరాటయోధుడు కాసం కృష్ణమూర్తి". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 2021-12-26. Retrieved 2021-12-25.
- ↑ యాదాద్రి భువనగిరి జిల్లా సాహిత్య చరిత్ర, డా. పోరెడ్డి రంగయ్య, మొదటి ముద్రణ 2021, పుట 36.
- ↑ "నైజామోన్ని తరిమిన గడ్డ..!". Sakshi. 2019-09-17. Archived from the original on 2019-10-02. Retrieved 2021-12-26.