2019 బాలాకోట్ వైమానిక దాడి

2019 బాలాకోట్ వైమానిక దాడి
2019 భారత పాకిస్తాన్ సరిహద్దు ఘర్షణలులో భాగము
తేదీ2019 ఫిబ్రవరి 26 (2019-02-26)
ప్రదేశంబాలాకోట్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా, పాకిస్తాన్
ఫలితం*(2019 ఫిబ్రవరి 26) ఉగ్రవాద శిబిరం విధ్వంసం, అనేకమంది మృతి (భారత వాదన)[1]
బాంబులు నిర్మానుష్యమైన స్థలంలో చెట్లపై పడ్డాయి. (పాకిస్తాన్ వాదన).[1]
  • (2019 ఫిబ్రవరి 27) పాక్ ఆక్రమిత కాశ్ంఈరులో భారత విమానం కూల్చివేత. పైలట్‌ను బందీగా పట్టుకున్నారు; మార్చి 1 న అతని విడుదల.[2]
    భారతీయ Mi-17 హెలికాప్టరు ప్రమాదవశాత్తూ జరిగిన దాడిలో కూలిపోయింది. ఆరుగురు మరణించారు; అక్టోబరు 4 న భారత్ ప్రకటించింది.[3]
ప్రత్యర్థులు
 భారతదేశం
  •  Indian Air Force
  •  పాకిస్తాన్
  •  పాకిస్తాన్
  • సేనాపతులు, నాయకులు
    ఎయిర్ ఛీఫ్ మార్షల్ బీరేందర్ సింగ్ ధనోవాఎయిర్ ఛీఫ్ మార్షల్ ముజాహిద్ అన్వర్ ఖాన్
    పాల్గొన్న దళాలు
    UnknownUnknown
    బలం
    UnknownUnknown
    2019 బాలాకోట్ వైమానిక దాడి is located in Kashmir
    2019 బాలాకోట్ వైమానిక దాడి
    బాలాకోట్‌లో దాడి జరిగిన స్థలం
    2019 బాలాకోట్ వైమానిక దాడి is located in Pakistan
    2019 బాలాకోట్ వైమానిక దాడి
    2019 బాలాకోట్ వైమానిక దాడి (Pakistan)

    ఫిబ్రవరి 26 తెల్లవారుజామున భారత యుద్ధ విమానాలు నియంత్రణ రేఖను దాటి, పాక్ ఆక్రమిత కాశ్మీరులో ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని బాలాకోట్ పట్టణానికి సమీపంలో బాంబులు వేసాయి. ఇదే 2019 బాలకోట్ వైమానిక దాడి.

    ఫిబ్రవరి 26 ఉదయాన, పాకిస్తాన్ మిలిటరీ ఈ వైమానిక దాడి జరిగినట్లు ప్రకటించింది. భారత విమానాలు తమ పేలోడ్‌ను బాలకోట్ సమీపంలో జనావాసాలు లేని కొండ ప్రాంతంలో వేసినట్లు ఆ ప్రకటనలో చెప్పింది. ఆ తరువాత అదే రోజున, వైమానిక దాడిని ధ్రువీకరించిన భారతదేశం, ఇదొక ఉగ్రవాద శిక్షణా శిబిరం లక్ష్యంగా చేసిన ముందస్తు దాడి అని, ఇందులో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారనీ పేర్కొంది.[4] మరుసటి రోజు, ఫిబ్రవరి 27 న పాకిస్తాన్, భారత్‌పై వైమానిక దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంది, ఇందులో ఒక భారత యుద్ధ విమానాన్ని కూల్చివేసింది. దాని పైలట్‌, అభినందన్ వర్థమాన్ను పాకిస్తాన్ బందీగా పట్టుకుంది. మార్చి 1 న అతన్ని విడిచిపెట్టింది.

    అట్లాంటిక్ కౌన్సిల్ కు చెందిన డిజిటల్ ఫోరెన్సిక్స్ లాబొరేటరీ, శాన్ ఫ్రాన్సిస్కో ఆధారిత ప్లానెట్ ల్యాబ్స్, యూరోపియన్ స్పేస్ ఇమేజింగ్, ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ మొదలైనవారు ఓపెన్ సోర్స్ ఉపగ్రహ చిత్రాల విశ్లేషణలు చేసి, బాలకోట్ పరిసరాల్లోని జాబా కొండపై గల స్థలంలో ప్రముఖమైన లక్ష్యాలను భారత్ కొట్టలేదని చెప్పాయి.

    2019 ఏప్రిల్ 10 న, దాడులు జరిగిన 47 రోజుల తరువాత, పాకిస్తాన్ ప్రభుత్వపు పటిష్ఠమైన నిఘాలో కొందరు అంతర్జాతీయ పాత్రికేయులు జరిపిన యాత్రలో జాబా కొండపై నిలిచి ఉన్న పెద్ద భవనం కనిపించింది.

    1971 నాటి భారత-పాకిస్తాన్ యుద్ధం తరువాత, వైమానిక దాడులు జరగడం, ఇరు దేశాల యుద్ధ విమానాలు నియంత్రణ రేఖను దాటడం ఇదే మొదటిసారి. ఈ కాలంలో ఇరుదేశాలూ అణు శక్తులుగా మారాయి. [lower-alpha 1]

    నేపథ్యం మార్చు

    2016లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్‌లో హతమైనప్పుడు కాశ్మీరు కల్లోలంలో కొత్త హింసాత్మక తరంగం కనిపించింది.[6] 2018లో, హింసలో 500 మందికి పైగా (పౌరులు, సైనికులు, తీవ్రవాదులూ అందరూ) మరణించారు.[6] 2019 ఫిబ్రవరి 14 న, జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై భద్రతా సిబ్బందిని తీసుకువెళుతున్న వాహనాల కాన్వాయ్‌పై జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని లెత్‌పోరా వద్ద ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేసారు. ఈ దాడిలో 46 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది మరణించారు. దాడికి పాల్పడిన వ్యక్తి కాశ్మీర్‌కు చెందినవాడు.[7] ఈ దాడిని తామే చేసామని పాకిస్థాన్‌కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రకటించింది.[8][9][10] పాకిస్థాన్ ఈ దాడిని ఖండించింది. దానితో తమకు సంబంధం లేదని తెలిపింది.[11]

    2019 భారత సార్వత్రిక ఎన్నికలకు ముందు బాలాకోట్ వైమానిక దాడి జరిగింది.[12][13] ఫిబ్రవరి 19 న పాకిస్తాన్ ప్రధాని, రాబోయే ఎన్నికల కోసం పాకిస్తాన్‌పై దాడి చేయాలని భారత ప్రభుత్వ కోరిక అని ఆపాదించాడు.[14][15] భారత ప్రభుత్వం ఆ ఆరోపణలను తోసిపుచ్చింది.[14]

    సంఘటన మార్చు

    2019 ఫిబ్రవరి 26 న, పాకిస్తాన్ తన గగనతలంలోకి భారత విమానాలు చొరబడినట్లు ప్రకటించింది.[16] కానీ తాము భారత విమానాలను అడ్డగించామని, దాంతో వారు వెనక్కి తగ్గారనీ, వాళ్ళు తమ బాంబులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేసారనీ, వాటి ఇంధనాన్ని పారబోసారనీ నొక్కి చెప్పింది.[17] విలేకరుల సమావేశంలో, పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) డైరెక్టర్ జనరలైన మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్, ఫిబ్రవరి 26 తెల్లవారుజామున మూడు IAF బృందాలు వివిధ రంగాల నుండి పాకిస్తాన్ సరిహద్దును సమీపిస్తున్నట్లు గుర్తించామని చెప్పాడు. వీటిలో రెండు బృందాలను పాకిస్థానీ గస్తీ విమానాలు ఎదుర్కోవడంతో అవి సరిహద్దు దాటలేదని, మూడవ బృందం మాత్రం ముజఫరాబాద్ సమీపంలోని కీరన్ లోయ మీదుగా నియంత్రణ రేఖను దాటగా మూడు నిమిషాల లోపే పాకిస్థానీ వైమానిక దళం (PAF) విమానాలు అడ్డుకున్నాయనీ ఆయన తెలిపాడు.[18][19] పాక్ రక్షణ మంత్రి పర్వేజ్ ఖట్టక్, ఆ సమయంలో పాక్ వైమానిక దళం ప్రతీకారం తీర్చుకోలేదని, ఎందుకంటే "నష్టం ఏ మేరకు జరిగిందో అంచనా వేయలేకపోయాం" అనీ పేర్కొన్నాడు.[20]

    తరువాత 2019 ఫిబ్రవరి 26 న, భారతదేశం ఈ వైమానిక దాడులను ధ్రువీకరించింది.[4] పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం వాటిని నిర్వహించిందని పేర్కొంది. ఈ దాడులు "సైనిక చర్య తరహావి కావని", "ముందు జాగ్రత్త కోసం" చేసినవనీ ప్రకటించింది; పాకిస్తాన్‌లోని జైష్-ఎ-మొహమ్మద్ సంస్థ తమ లక్ష్యమనీ చెప్పింది.[21] [lower-alpha 2]

    1971లో జరిగిన ఇండో-పాకిస్తాన్ యుద్ధం తర్వాత యుద్ధవిమానాలు నియంత్రణ రేఖ దాటి వైమానిక దాడి చేయడం ఇదే తొలిసారి.[24][25]

    ఈ ఆపరేషన్‌లో పన్నెండు మిరాజ్ 2000 జెట్‌లు పాల్గొన్నట్లు అధికారిక వర్గాలు ధ్రువీకరించినట్లు భారత మీడియా పేర్కొంది. మిరాజ్ 2000లు స్పైస్ 2000 & పొపాయ్ ప్రెసిషన్-గైడెడ్ మందుగుండు సామగ్రిని మోసుకెళ్ళాయనీ, వాటికి నాలుగు సుఖోయ్ సు-30MKI, నేత్ర, ఫాల్కన్ ఎయిర్‌బోర్న్ ముందస్తు హెచ్చరిక-నియంత్రణ విమానాలు, ఒక IAI హెరాన్ UAV, రెండు ఇల్యూషిన్ Il-78 ఏరియల్ రీఫ్యూయలింగ్ విమానాలు మద్దతునిచ్చాయనీ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రాసింది.[26] అంతేకాకుండా, నాలుగు SU-30MKIలు దక్షిణ పంజాబ్ లోని స్థావరం నుండి ఎగిరి, జోధ్‌పూర్ వైపు, రాజస్థాన్‌లోని బార్మర్‌కు వెళ్లాయని, పశ్చిమం వైపు పాకిస్తాన్‌లోని జైష్-ఎ-మహ్మద్ ప్రధాన కార్యాలయం ఉన్న బహావల్‌పూర్‌ వైపు తిరిగాయనీ భారత అధికారులు పేర్కొన్నారు. ఈ నాలుగు విమానాలూ PAF ఫైటర్‌లను దారిమళ్ళించేలా పనిచేసి, ప్రధాన దాడి దళానికి దక్షిణంగా వాటిని తప్పుదారి పట్టించాయి.[27]

    బాంబులు వేసిన తర్వాత, జెట్‌లు క్షేమంగా భారత గగనతలంలోకి తిరిగి వచ్చాయి. పాకిస్తాన్ తన F-16 జెట్‌లను పంపినప్పటికీ, అవి భారత విమానాలను వెంటాడలేకపోయాయని భారత మీడియా పేర్కొంది.[28]

    లక్ష్యం మార్చు

    భారత లక్ష్యం కచ్చితంగా ఏమిటనే విషయంలో సందిగ్ధత ఉంది. మసూద్ అజర్ బావమరిది ముహమ్మద్ యూసుఫ్ అజార్ నిర్వహిస్తున్న మదర్సా – తలీమ్ ఉల్-ఖురాన్ [29] చురుకైన JeM క్యాంపా కాదా అనే దానిపైన కూడా సందిగ్ధత ఉంది.

    వికీలీక్స్ ప్రకారం, 2004 యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఇంటరాగేషన్ నివేదిక ప్రకారం బాలాకోట్‌లో, "పేలుడు పదార్థాలు, ఫిరంగులపై ప్రాథమిక, అధునాతన ఉగ్రవాద శిక్షణ ఇచ్చే శిక్షణ శిబిరం" ఉంది.[30] దీనికి విరుద్ధంగా మిలిటరీ విశ్లేషకులు, ఈ ప్రాంతంలో గతంలో తీవ్రవాద శిబిరాలకు ఆతిథ్యం ఇచ్చేవారని, కానీ 2005 పాకిస్తాన్ భూకంపం తర్వాత వారు, ఆ ప్రాంతంలో సహాయాన్ని అందించే అంతర్జాతీయ సహాయక బృందాల కంటబడకుండా ఉండటానికి చెదిరి పోయారనీ చెప్పారు.[31]

    ఈ శిబిరం బాలాకోట్ నుండి 20 km (12 mi) దూరంలో కొండలపై ఉన్న అడవిలో ఉందని భారత నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇది రిసార్ట్-శైలి సదుపాయం అని, స్విమ్మింగ్ పూల్, వంటవాళ్ళు, క్లీనర్‌లతో సహా 500–700 మంది ఉగ్రవాదులకు ఇక్కడ వసతి ఉంది.[32] న్యూయార్క్ టైమ్స్ పాశ్చాత్య భద్రతా అధికారులు అటువంటి పెద్ద-స్థాయి శిక్షణా శిబిరాలు ఉంటాయా అనే సందేహం వెలిబుచ్చినట్లు పేర్కొంది. పాకిస్తాన్ అలాంటి శిబిరాలను నిర్వహించదనీ, "మిలిటెంట్ గ్రూపులు దేశవ్యాప్తంగా చిన్న సమూహాలలో విస్తరించి ఉన్నాయ"నీ పేర్కొంది.

    ఉగ్రవాద శీక్షణ శిబిరం ఉందనే విషయంపై స్థానిక ప్రజలు భిన్నాభిప్రాయం వెలిబుచ్చారు.[30] దాడులు జరిగిన వెంటనే, కొందరు దీనిని చురుకైన జైష్ శిక్షణా శిబిరమని పేర్కొనగా, మరికొందరు ఇది స్థానిక పిల్లల కోసం కేవలం పాఠశాల మాత్రమేననీ, అటువంటి మిలిటెంట్ శిబిరాలు చాలా పూర్వం ఉండేవనీ నొక్కి చెప్పారు.[30][33] ఆ తరువాతి కాలంలో రాయిటర్స్ ఇక్కడ చేసిన సందర్శనలలో, పాఠశాలను ఒక సంవత్సరం క్రితమే మూసివేసారనీ, ఇప్పుడది పనిచేయడం లేదనీ స్థానికులు చెప్పినట్లు పేర్కొంది.

    నష్టం మార్చు

    భారత యుద్ధ విమానాలు జారవిడిచిన మందుగుండు సామాగ్రి అటవీ ప్రాంతంలో అనేక చెట్లపై పడినట్లు కనిపించిందని, అయితే దాడి జరిగిన ప్రాంతంలో ఎటువంటి నష్టం జరగలేదని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తటస్థ వర్గాలు పేర్కొన్నాయి.[34][35][36][37][38][39] కొంతమంది పాశ్చాత్య దౌత్యవేత్తలు కూడా భారత వైమానిక దళం ఏదైనా తీవ్రవాద శిబిరాన్ని ఛేదించినట్లుగా తాము భావించడం లేదని పేర్కొన్నారు.[37] పాశ్చాత్య భద్రతా అధికారులు భారత వాదనలపై అనుమానం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌లో ఇంత పెద్ద ఎత్తున ఉగ్రవాద శిబిరాలు లేవని తేల్చిచెప్పారు.[40]

    భారతీయ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని మరో ఆత్మాహుతి దాడికి సిద్ధమవుతున్న "చాలా పెద్ద సంఖ్యలో జెఇఎమ్ ఉగ్రవాదులు, శిక్షకులు, సీనియర్ కమాండర్లు, జిహాదీల సమూహాలు" ఈ దాడిలో హతమయ్యారని భారతదేశం నొక్కి చెప్పింది.[21] శిబిరం నేలమట్టమైందని, దాదాపు 200–350 మంది జెఎమ్ మిలిటెంట్లు హతమయ్యారనీ భారతీయ మీడియా నివేదించింది. అయితే, వివిధ మీడియా-వర్గాల గణాంకాలు విభిన్నంగా ఉన్నాయి.[41] భారత నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, దాడికి ముందు శిబిరంలో దాదాపు 300 క్రియాశీల మొబైల్ ఫోన్‌లను గుర్తించింది.[42] దీనికి విరుద్ధంగా, దాడి ఫలితంగా ఎటువంటి ప్రాణనష్టం గానీ, మౌలిక సదుపాయాలకు నష్టం గానీ జరగలేదని పాకిస్తాన్ పేర్కొంది.[43]

    తెల్లవారుజామున 3 గంటల సమయంలో సమీపంలోని అడవిలో, పొలంలో నాలుగు బాంబులు పడ్డాయని, భవనం దెబ్బతిందని, ఒక వ్యక్తి గాయపడ్డాడనీ అక్కడి గ్రామస్థులు చెప్పారు.[44] అసోసియేటెడ్ ప్రెస్‌కు చెందిన పాత్రికేయులు ఫిబ్రవరి 26 న ఈ ప్రాంతాన్ని సందర్శించారు. దాడి వల్ల పడిన గుంటలను, దెబ్బతిన్న చెట్లనూ చూశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వారు కలిసిన గ్రామస్థులు తెలిపారు.[45] అల్ జజీరా బృందం దాడులు జరిగిన రెండు రోజుల తర్వాత ఆ స్థలాన్ని సందర్శించింది. నాలుగు పేలుడు బిలాల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న "విరిగిన పైన్ చెట్లు, రాళ్ళను" గుర్తించింది. స్థానిక ఆసుపత్రి అధికారులు, నివాసులు ఎటువంటి మృతులను గానీ, గాయపడిన వ్యక్తులను గానీ చూడలేదని నొక్కి చెప్పారు. పాత్రికేయులు,[41] బాంబు పడిన స్థలానికి తూర్పున ఒక కిలోమీటరు దూరంలో నిటారుగా ఉన్న శిఖరంపై జైష్-ఎ-మొహమ్మద్ నడుపుతున్న పాఠశాలను చూసారు. కానీ దాని వద్దకు వెళ్ళలేకపోయారు.[30] రాయిటర్స్ నుండి వచ్చిన పాత్రికేయులు మదర్సాలోకి ప్రవేశించడానికి సైన్యం పదేపదే నిరాకరించింది. అయితే వారు, ఆ నిర్మాణానికి వెనుక భాగం దెబ్బతినకుండా ఉన్నట్లు గమనించారు.[46] పాకిస్తాన్ మిలిటరీ ప్రెస్ వింగ్ నిర్వహించ తలపెట్టిన సందర్శనలను రెండుసార్లు వాయిదా వేసింది.[47] అయితే, 2019 మార్చి 29 న, ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR), పాత్రికేయులను దాడి జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లింది. మదర్సాలో దాదాపు 375 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులను ఇంటర్వ్యూ చేసేందుకు పాత్రికేయులను అనుమతించారు. ఆ స్థలంలో ఫోటోలు తీయడానికి, వీడియో రికార్డ్ చేయడానికి కూడా వారిని అనుమతించారు.[48]

    ఉపగ్రహ డేటా అంచనాలు మార్చు

    ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ కు చెందిన నాథన్ రూసర్ ఉపగ్రహ -డేటా విశ్లేషణ" చేసి విస్తృతమైన నష్టం జరిగినట్లు చెప్పేందుకు స్పష్టమైన ఆధారాలు లేవని, దాని మీద దాడుల భారతీయ వాదనలను ధ్రువీకరించడం లేద"నీ నిర్ధారించాడు.[41][49][50] అట్లాంటిక్ కౌన్సిల్ కు చెందిన డిజిటల్ ఫోరెన్సిక్స్ విశ్లేషకుడు మైఖేల్ షెల్డన్, దీనిపై మరొక స్వతంత్ర పరిశోధన చేసాడు. లక్ష్యిత స్థలం చుట్టుపక్కల ఉన్న ఏ మౌలిక సదుపాయాలకు ఎటువంటి నష్టం జరగలేదని ఇది పేర్కొంది. "లక్ష్యానికి గురిపెట్టే క్రమంలో ఏదో తప్పు జరిగినట్లు కనిపించింది" అని, ఉపయోగించిన క్షిపణుల స్వయంప్రతిపత్తి స్వభావం దృష్ట్యా జరిగిన గడబిడ అనూహ్యంగా ఉందనీ నిర్ధారించింది.[51] ప్లానెట్ ల్యాబ్స్ హై-రిజల్యూషన్ శాటిలైట్ ఇమేజరీ ఆధారంగా రాయిటర్స్ చేసిన పరిశోధనలో 2018 ఏప్రిల్ ఉపగ్రహ ఫోటోతో పోల్చినప్పుడు అక్కడి ల్యాండ్‌స్కేప్‌ మారలేదని గుర్తించింది. "భవనాల పైకప్పులలో గుర్తించదగిన రంధ్రాలు లేవు, కాలిపోయిన, పేలిపోయిన గోడలు, మదర్సా చుట్టూ స్థానభ్రంశం చెందిన చెట్లు గానీ లేదా వైమానిక దాడికి సంబంధించిన ఇతర సంకేతాలు గానీ లేవు" అని పేర్కొంది. WorldView-2 ఉపగ్రహం నుండి తీసుకున్న అధిక నాణ్యత చిత్రాలను కూడా ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ విశ్లేషించింది. "మూడు ఆయుధాలూ గురికి దూరంగా వెళ్ళిపోయాయని" చూపిస్తూ "లక్ష్యాన్ని గుర్తించడంలో ఉన్న లోపం జరిగినట్లు సూచిస్తున్నాయి" అని చెప్పింది.[52][53]

    యూరోపియన్ స్పేస్ ఇమేజింగ్ కూడా దాడి జరిగిన స్థలపు అధిక-రిజల్యూషన్ చిత్రాన్ని అందించింది. దాడి జరిగిన ఒక రోజు తర్వాత, 2019 ఫిబ్రవరి 27 నాటి ఈ ఉపగ్రహ చిత్రాల్లో భవనాలు క్షేమంగా ఉన్నాయని, అక్కడ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని కనిపించింది. మేనేజింగ్ డైరెక్టర్ అడ్రియన్ జెవెన్‌బెర్గెన్, "కాలిపోయిన సంకేతాలు లేవు, భవనాలలో పెద్దగా గుర్తించదగిన రంధ్రాలు లేవు. చుట్టుపక్కల వృక్షసంపదపై ఒత్తిడికి సంబంధించిన సంకేతాలు లేవు" అని పేర్కొన్నాడు.[54]

    భారత అధికారుల వాదన మార్చు

    దీనికి విరుద్ధంగా, ఎయిర్‌బోర్న్ ప్లాట్‌ఫారమ్ ద్వారా మోసుకెళ్లిన సింథటిక్ అపర్చర్ రాడార్ (SAR) నుండి ముందు, తరువాత చిత్రాల విశ్లేషణలో నాలుగు భవనాలు ధ్వంసమైనట్లు తేలిందని, అయితే ఆ చిత్రాలను విడుదల చేయలేదనీ భారత అధికారులు తెలిపారు.[50] దాడి జరిగిన మొదటి రోజు నుండి SAR చిత్రాలు భవనాల పైకప్పు రేకులు కనిపించకుండా పోయాయని, రెండు రోజుల తర్వాత మరమ్మతులు చేసినట్లూ అధికారి తెలిపారు. కొత్త పైకప్పులు వేసిన కారణంగా, అంచనా వేయడం కష్టతరమైందని, క్లాసిఫైడ్ SAR చిత్రాల విడుదలపై నిర్ణయం తీసుకోవడం భారత ప్రభుత్వంపై ఆధారపడి ఉందనీ ఆ అధికారి చెప్పారు.[55] భారత వైమానిక దళం ఇండియా టుడేకు, ఇతర మీడియా సంస్థల విలేఖరులకు, IAF వద్ద ఉన్న హై-రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాలను చూపించింది. ఇండియా టుడే ప్రకారం, ఆ ఫొటోల్లో ఒక భవనపు పైకప్పులో మూడు రంధ్రాలు కనిపించాయి. ఈ రంధ్రాలు "SPICE బాంబు దాడికి చెందిన స్పష్టమైన సూచనలు" అని రాసింది.[56]

    అనంతర పరిణామాలు మార్చు

    భారతీయ వాయుసేన, అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖల వెంబడి వైమానిక రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేసింది. పాకిస్తాన్ వైమానిక దళం ఏదైనా ప్రతీకార చర్యలకు పాల్పడితే ఎదుర్కొనేందుకు ఈ చర్య తీసుకుంది.[57]

    పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో భద్రతా పరిస్థితిని చర్చించడానికి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసాడు.[58] ప్రతీకారం తీర్చుకునే హక్కు పాకిస్తాన్‌కు ఉందని నొక్కి చెప్పాడు.[59] పరిస్థితిని సమీక్షించేందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాడు.[60] ఈ సమావేశం ముగింపులో, జాతీయ భద్రతా మండలి (NSC), ఉగ్రవాద శిబిరాన్ని ధ్వంసం చేసినట్లుగా భారతదేశం చేస్తున్న వాదనలను తిరస్కరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ దాడిని "అవాంఛనీయమ"ని అభివర్ణించింది. ఉమ్మడి పార్లమెంటరీ సెషన్ తర్వాత, దానికి ప్రతీకారం తీర్చుకుంటామని పేర్కొంది.[61][62] అంతర్జాతీయ మీడియాను దాడుల ప్రాంతానికి తీసుకెళ్తామని, అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆలస్యమౌతోందనీ ఆయన అన్నాడు.[63]

    ఇవి కూడా చూడండి మార్చు

    గమనికలు మార్చు

    1. India became a nuclear power with successful Smiling Buddha operation in 1974 and Pakistan's successful operation of Chagai-I took place in 1998.[5]
    2. Scholar Ayesha Jalal has mentioned, "Many recruits to the Jaish-i-Muhammad were trained in a madrassa in Balakot named after Sayyid Ahmad Shaheed".[22] Rana and Mir state describe its precise location, "At a distance of five kilometres from this village [Attar Sheesha] there is a dirt track on the left that leads up to the mountains.... If an ordinary person does reach the madrassa he is not allowed to enter. Even Jaishe Mohammed workers can only enter after a thorough search and a registration process.... Judging from the outside, the area of the madrassa is very large and there is a fort like entrance gate that has a Jaishe Mohammed flag flying atop it."[23]

    మూలాలు మార్చు

    1. 1.0 1.1 Slater, Joanna; Constable, Pamela (27 February 2019). "Pakistan captures Indian pilot after shooting down aircraft, escalating hostilities". The Washington Post (in ఇంగ్లీష్). Archived from the original on 27 February 2019. Retrieved 27 February 2019. Indian and Pakistani officials gave conflicting accounts of the events. India claimed it had bombed a militant camp inside Pakistan on Tuesday, killing scores, but Pakistan said the bombs had fallen on an uninhabited forested area. Pakistan also denied India's claims that a Pakistani F-16 fighter jet was shot down.
    2. Jeffrey Gettleman; Hari Kumar; Samir Yasir (2 March 2019), "Deadly Shelling Erupts in Kashmir Between India and Pakistan After Pilot Is Freed", The New York Times, On Wednesday, Pakistan mobilized its air force and shot down an Indian fighter jet above Kashmir, capturing the pilot. On Friday, Pakistan released the pilot, Wing Cmdr. Abhinandan Varthaman, calling it a gesture to ease tensions.
    3. AFP, Staff Writer (4 October 2019), India admits friendly fire downed Mi-17 helicopter in Kashmir, Washington, DC: The Defense Post, retrieved 9 February 2021, The Indian Air Force confirmed for the first time on Friday, October 4 that it shot down one of its own Mi-17 helicopters during clashes with Pakistan in February over Kashmir, killing all six on board.
    4. 4.0 4.1 Slater, Joanna; Constable, Pamela (27 February 2019). "Pakistan captures Indian pilot after shooting down aircraft, escalating hostilities". The Washington Post (in ఇంగ్లీష్). Archived from the original on 27 February 2019. Retrieved 27 February 2019.
    5. Teh-Kuang Chang; Angelin Chang; Brent T. Gerchicoff (2017). Routledge Handbook of Asia in World Politics. Routledge. ISBN 978-1317404262.
    6. 6.0 6.1 Kashmir: Why India and Pakistan fight over it Archived 24 డిసెంబరు 2018 at the Wayback Machine, BBC News
    7. India Blames Pakistan for Attack in Kashmir, Promising a Response Archived 23 ఫిబ్రవరి 2019 at the Wayback Machine, New York Times. 15 February 2019.
    8. "Pulwama attack: India will 'completely isolate' Pakistan". BBC (in ఇంగ్లీష్). 16 February 2019. Archived from the original on 15 February 2019. Retrieved 16 February 2019.
    9. "Jaish terrorists attack CRPF convoy in Kashmir, kill at least 38 personnel". 15 February 2019. Archived from the original on 15 February 2019. Retrieved 15 February 2019.
    10. Pulwama Attack 2019, everything about J&K terror attack on CRPF by terrorist Adil Ahmed Dar, Jaish-eMohammad Archived 18 ఫిబ్రవరి 2019 at the Wayback Machine, India Today, 16 February 2019.
    11. "On Kashmir attack, Shah Mahmood Qureshi says 'violence is not the govt's policy'". dawn.com. 16 February 2019. Archived from the original on 23 February 2019. Retrieved 26 February 2019.
    12. Tensions Between India and Pakistan Are at Their Highest Point in Decades.
    13. Analysis by Nikhil Kumar. "Why being seen as tough on Pakistan helps India's Modi". CNN. Archived from the original on 26 February 2019. Retrieved 26 February 2019.
    14. 14.0 14.1 "Pakistan warns India against attacking". 19 February 2019. Archived from the original on 23 February 2019. Retrieved 26 February 2019 – via www.bbc.com.
    15. "Pakistan will address actionable evidence if shared by Delhi, PM Khan tells India after Pulwama attack". dawn.com. 19 February 2019. Archived from the original on 24 February 2019. Retrieved 26 February 2019.
    16. Quote: "Pakistan, which was the first to announce the incursion, ..."
    17. "Indian strikes target militants in Pakistan". 26 February 2019. Archived from the original on 26 February 2019. Retrieved 27 February 2019 – via www.bbc.com.
    18. "ISPR DG debunks India's claims on LoC violation". dawn.com (in ఇంగ్లీష్). 26 February 2019. Archived from the original on 26 February 2019. Retrieved 26 February 2019.
    19. Ghafoor, Maj Gen Asif (25 February 2019). "Indian aircrafts [sic] intruded from Muzafarabad sector. Facing timely and effective response from Pakistan Air Force released payload in haste while escaping which fell near Balakot. No casualties or damage". @OfficialDGISPR (in ఇంగ్లీష్). Archived from the original on 26 February 2019. Retrieved 26 February 2019.
    20. Anderson, Claire (27 February 2019). "Pakistan defence minister mocked after saying it was 'Too Dark' for airstrike retaliation" (in ఇంగ్లీష్). Daily Express. Archived from the original on 28 February 2019. Retrieved 28 February 2019.
    21. 21.0 21.1 "IAF struck 'JeM's biggest training camp' at Balakot, says Foreign Secretary Vijay Gokhale on India's operation in Pakistan". Firstpost. Archived from the original on 1 March 2019. Retrieved 2019-03-01.
    22. Jalal, Ayesha (2009), Partisans of Allah: Jihad in South Asia, Harvard University Press, pp. 287–288, ISBN 978-0-674-03907-0
    23. Rānā, Muḥammad ʻĀmir; Mir, Amir (2004), A to Z of Jehadi Organizations in Pakistan, Mashal Books, p. 226
    24. "India Pakistan: Kashmir fighting sees Indian aircraft downed". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 27 February 2019. Retrieved 27 February 2019.
    25. "Indian planes bomb Pakistan as Kashmir tensions escalate". The Telegraph. 26 February 2019. Retrieved 26 February 2019.
    26. "Wheel comes full circle: Balakot camp was run by IC-814 hijacker". The Indian Express (in Indian English). 27 February 2019. Retrieved 27 February 2019.
    27. https://timesofindia.indiatimes.com/india/iaf-fooled-pakistan-with-decoy-fighters/articleshow/68238409.cms
    28. "Jaish Camp Hit In 90-Second Op, Jets Returned Without A Scratch: Sources". NDTV.com. 26 February 2019. Retrieved 27 February 2019.
    29. "India's bombs haven't killed the Jaish". Firstpost. Archived from the original on 6 March 2019. Retrieved 2019-03-02.
    30. 30.0 30.1 30.2 30.3 "At raid site, no casualties and a mysterious school". aljazeera.com. Archived from the original on 28 February 2019. Retrieved 2019-02-28.
    31. "After India's Strike on Pakistan, Both Sides Leave Room for De-escalation". 2019-02-26. Retrieved 2019-03-03.
    32. "350 terrorists killed while sleeping: Sources". Deccan Herald (in ఇంగ్లీష్). 2019-02-26. Archived from the original on 27 February 2019. Retrieved 2019-02-26.
    33. As it happened: Tension mounts after Indian fighter jets cross Kashmir frontier, bomb camps Archived 27 ఫిబ్రవరి 2019 at the Wayback Machine, Gulf News
    34. "Israel is playing a big role in India's escalating conflict with Pakistan". Independent UK. 28 February 2019. The "300–400 terrorists" supposedly eliminated by the Israeli-manufactured and Israeli-supplied GPS-guided bombs may turn out to be little more than rocks and trees.
    35. "Deadly Shelling Erupts in Kashmir Between India and Pakistan After Pilot Is Freed". New York Times. 2 March 2019.
    36. "'Get ready for our surprise': Pakistan warns India it will respond to airstrikes". The Guardian. 27 February 2019. The attack was celebrated in India, but it was unclear on Tuesday whether anything significant had been struck by the fighter jets, or whether the operation had been carefully calibrated to ease popular anger over the 14 February suicide bombing without drawing a major Pakistani reprisal.
    37. 37.0 37.1 "Pakistani village asks: Where are bodies of militants India says it bombed?". Reuters. 28 February 2019. Western diplomats in Islamabad also said they did not believe the Indian air force hit a militant camp.
    38. "The Young Suicide Bomber Who Brought India and Pakistan to the Brink of War". New York Times. 2 March 2019. But Mr. Modi's plan didn't go as intended. Independent reporting showed that the Indian jets had hit some trees, a field — and not much else. The next morning, Pakistani fighter jets dropped some bombs inside Indian-controlled territory.
    39. "Did Balakot Airstrikes Hit Their Target? Satellite Imagery Raises Doubts". The Wire. 27 February 2019.
    40. "Indian Jets Strike in Pakistan in Revenge for Kashmir Attack". New York Times. 5 February 2019. Western security officials have raised questions about the existence of a large-scale training camp, saying that Pakistan no longer runs such camps.
    41. 41.0 41.1 41.2 Chacko, Johann. "Both India and Pakistan may be lying, and that may breed worse disasters". Quartz India (in ఇంగ్లీష్). Archived from the original on 2 March 2019. Retrieved 2019-03-02.
    42. "'Were trees using 300 mobiles?': Rajnath to Congress on Balakot strike". hindustantimes.com (in ఇంగ్లీష్). 2019-03-05. Archived from the original on 5 March 2019. Retrieved 2019-03-08.
    43. "Indian aircraft violate LoC, scramble back after PAF's timely response: ISPR". dawn.com (in ఇంగ్లీష్). 26 February 2019. Archived from the original on 26 February 2019. Retrieved 26 February 2019.
    44. "No blood. No bodies. No debris. No tragedy". The Express Tribune (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-02-27. Archived from the original on 27 February 2019. Retrieved 2019-02-27.
    45. Tensions escalate as Indian airstrike hits inside Pakistan Archived 2 మార్చి 2019 at the Wayback Machine, Associated Press
    46. "Pakistani village asks: Where are bodies of militants India says it..." Reuters (in ఇంగ్లీష్). 1 March 2019. Archived from the original on 2 March 2019. Retrieved 2 March 2019.
    47. "At raid site, no casualties and a mysterious school". aljazeera.com. Archived from the original on 28 February 2019. Retrieved 28 February 2019.
    48. "Pakistan allows media to visit Balakot air strike location". The Week. 29 March 2019.
    49. "Did Balakot Airstrikes Hit Their Target? Satellite Imagery Raises Doubts". The Wire. Archived from the original on 2 March 2019. Retrieved 2019-03-02.
    50. 50.0 50.1 "Eyewitnesses say Indian air strike on Balakot killed terrorists, former ISI agents". cnbctv18.com (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 6 March 2019. Retrieved 2019-03-02.
    51. "Surgical Strike in Pakistan a Botched Operation?". DFRLab. 2019-02-28. Archived from the original on 4 March 2019. Retrieved 2019-03-05.
    52. "India's strike on Balakot: a very precise miss?". The Strategist (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-03-27. Retrieved 2019-03-27.
    53. "Satellite Imagery confirms India missed target in Pakistan airstrike". European Space Imaging (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2019-03-27.
    54. "Satellite Imagery confirms Indian missed the target in Pakistan airstrike". European Space Imaging. 27 March 2019.
    55. "Defence Establishment Has Evidence Of Air Strikes In Balakot In Terms Of SAR Imagery". indiatimes.com (in ఇంగ్లీష్). 2 March 2019. Retrieved 7 April 2019.
    56. "The inside story of IAF's Balakot strike". India Today (in ఇంగ్లీష్). 16 March 2019. Retrieved 7 April 2019.
    57. "Indian Air Force has put on high alert all air defence systems along the international border and LoC to respond to any possible action by Pakistan Air Force.pic.twitter.com/9GER7eqGPf". @ANI (in ఇంగ్లీష్). 25 February 2019. Archived from the original on 27 February 2019. Retrieved 26 February 2019.
    58. "Radio Pakistan: Pakistan Foreign Minister Shah Mahmood Qureshi has summoned an emergency meeting in Islamabad, Pakistan. The meeting will discuss the security situation. (File pic)pic.twitter.com/G2pPKna28u". @ANI (in ఇంగ్లీష్). 25 February 2019. Retrieved 26 February 2019.
    59. "Minister of Foreign Affairs Shah Mahmood Qureshi Policy Statement after the violation of LOC by Indian Air ForceIpic.twitter.com/tduq8rpXd8". @PTIofficial (in ఇంగ్లీష్). 25 February 2019. Archived from the original on 1 March 2019. Retrieved 26 February 2019.
    60. "PM Khan summons 'important meeting' in wake of India's LoC violation". dawn.com (in ఇంగ్లీష్). 26 February 2019. Archived from the original on 26 February 2019. Retrieved 26 February 2019.
    61. "Pakistan's National Security Committee (NSC) after a meeting chaired by Pakistan PM Imran Khan today: India has committed uncalled for aggression to which Pakistan shall respond at the time and place of its choosing.pic.twitter.com/7IfgrEXFN8". @ANI (in ఇంగ్లీష్). 26 February 2019. Archived from the original on 27 February 2019. Retrieved 26 February 2019.
    62. "This action has been done for domestic consumption being in election environment, putting regional peace and stability at grave risk.The claimed area of strike is open for the world to see the facts on ground.For this domestic&international media is being taken to the impact site". @PTIofficial (in ఇంగ్లీష్). 26 February 2019. Archived from the original on 26 February 2019. Retrieved 26 February 2019.
    63. "Pakistan Foreign Minister Shah Mahmood Qureshi: Pakistan will take international media to the area of strikes, helicopters are being readied, right now weather is bad, will fly when weather permits. (file pic)pic.twitter.com/hkvl1Z40gh". @ANI (in ఇంగ్లీష్). 26 February 2019. Archived from the original on 26 February 2019. Retrieved 26 February 2019.
    64. eBook in Urdu language on Shah Ismail Shaheed with introduction by Abu Ala Maududi, Published 1 October 1943 by Qaumi Kutub Khana, Lahore
    65. Taqwiyat-ul-Iman (Strengthening of the Faith) an eBook translated in English and originally written by Shah Ismail Dehlvi on islamhouse.com website
    66. Profile of Dehlvi on books.google.com website Retrieved 16 August 2018