ఈటెల రాజేందర్

ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక తొలి ఆర్ధిక మంత్రిగా పని చేశాడు.[3]

ఈటెల రాజేందర్
ఈటెల రాజేందర్

ఈటెల రాజేందర్


తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి
పదవీ కాలం
17 ఫిబ్రవరి 2019 - 14 జూన్ 2021
నియోజకవర్గం హుజురాబాద్

వ్యక్తిగత వివరాలు

జననం (1964-03-20)1964 మార్చి 20
క‌మ‌లాపూర్‌ కరీంనగర్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి ఇ. జ‌మున
సంతానం నితిన్ రెడ్డి , నీతా రెడ్డి [1][2]
నివాసం శామీర్‌పేట్, హైదరాబాద్
మతం హిందూ
జూన్ 3, 2014నాటికి

జననంసవరించు

ఈటెల రాజేందర్ మార్చి 20, 1964 లో జన్మించారు. ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం నుంచి 1984లో ఆయ‌న బీఎస్‌సీ పూర్తి చేశాడు. ఆయనకు భార్య జామున, కొడుకు నితిన్ రెడ్డి, కూతురు నీతా రెడ్డి ఉన్నారు.

రాజకీయ జీవితంసవరించు

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నుంచి గెలుపొందిన ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. వైఎస్ హయాంలో టీఆర్‌ఎస్ ఎల్పీ నేతగా ఉన్న ఈటెల తన వాగ్ధాటితో అందరిని ఆకట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 2014లో కెసీఆర్ తొలి మంత్రివర్గంలో ఆర్థిక, ప్రణాళికశాఖ, చిన్నమొత్తాల పొదుపు, రాష్ట్ర లాటరీలు, పౌరసరఫరాలు, తూనికలు కొలతలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల బాధ్యతలు నిర్వర్తించాడు. 2019లో కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు.[4][5][6]

ఈటలపై భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో 2021, మే 1న ఆయన నుంచి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు బదిలీ జరిగింది.[7][8][9]ఆయనను 2 మే 2021న మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారు. [10]ఈటల రాజేందర్‌ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ని 31 మే 2021న కలిశాడు. ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి 12 జూన్ 2021న రాజీనామా చేశాడు.[11]ఆయన 4 జూన్ 2021లో ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.ఈటల రాజేందర్ బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీలో అక్టోబర్ 7న ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితుడయ్యాడు.[12]

ప్రజాదీవెన యాత్రసవరించు

ఈటల రాజేందర్‌ హుజురాబాద్ ఉపఎన్నికల కోసం ప్రజాదీవెన యాత్ర పేరుతో హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రతిపల్లెల్లో యాత్ర చేస్తున్నారు

మూలాలుసవరించు

 1. Sakshi (16 November 2019). "మంత్రి ఈటల రాజేందర్‌ కుమర్తె వివాహ వేడుక". Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 30 April 2021.
 2. The Hans India (15 November 2019). "Telangana CM KCR, governor and ministers attends Etela Rajender's daughter's marriage in Hyderabad" (in ఇంగ్లీష్). Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 30 April 2021.
 3. TV9 Telugu (20 March 2021). "Eatala Rajender Birthday Special: ఉద్యమకారుడి నుంచి రాష్ట్ర మంత్రివరకు.. ప్రజానేత ప్రస్థానం - Minister Eatala Rajender Birthday". TV9 Telugu. Archived from the original on 6 జూన్ 2021. Retrieved 6 June 2021.
 4. బిబిసీ తెలుగు, తెలంగాణ (19 February 2019). "తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్ కొత్త టీంలో ఎవరెవరు ఉన్నారంటే." Retrieved 24 July 2019.
 5. టి న్యూస్, ప్రాంతీయ వార్తలు (19 February 2019). "కొత్త మంత్రులు, ప్రొఫైల్". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
 6. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (19 February 2019). "అట్టహాసంగా తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
 7. Andhrajyothy (1 May 2021). "మంత్రి ఈటల శాఖ సీఎం కేసీఆర్‌కు బదిలీ". Archived from the original on 1 మే 2021. Retrieved 1 May 2021.
 8. Andhrajyothy (1 May 2021). "ఈటలకు పొగ!". Archived from the original on 1 మే 2021. Retrieved 1 May 2021.
 9. Eenadu (1 May 2021). "ఈటల నుంచి వైద్యారోగ్య శాఖ సీఎంకు బదిలీ". Archived from the original on 1 మే 2021. Retrieved 1 May 2021.
 10. Sakshi (2 May 2021). "సీఎం కేసీఆర్‌ సంచలనం: ఈటల బర్తరఫ్‌". Sakshi. Archived from the original on 3 మే 2021. Retrieved 3 May 2021.
 11. Andhrajyothy (4 June 2021). "టీఆర్ఎస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా: ఈటల". www.andhrajyothy.com. [. Archived] Check |archiveurl= value (help) from the original on 4 జూన్ 2021. Retrieved 4 June 2021.
 12. V6 Velugu (7 October 2021). "బీజేపీ కొత్త కార్యవర్గంలో వివేక్ వెంకటస్వామి, ఈటలకు కీలక పదవులు" (in ఇంగ్లీష్). Archived from the original on 9 అక్టోబర్ 2021. Retrieved 9 October 2021. Check date values in: |archivedate= (help)