డోన్

ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా పట్టణం
(Dronachalam నుండి దారిమార్పు చెందింది)

డోన్ (ద్రోణాచలం), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాకు చెందిన పట్టణం. ఇది డోన్ మండలానికి కేంద్రం. ఇది 2022లో ఏర్పాటుచేసిన డోన్ రెవెన్యూ డివిజనుకు కేంద్రం.

పట్టణం
పటం
Coordinates: 15°25′N 77°53′E / 15.42°N 77.88°E / 15.42; 77.88
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లానంద్యాల జిల్లా
మండలండోన్ మండలం
విస్తీర్ణం
 • మొత్తం5 కి.మీ2 (2 చ. మై)
జనాభా
 (2011)[1]
 • మొత్తం59,272
 • జనసాంద్రత12,000/కి.మీ2 (31,000/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1011
ప్రాంతపు కోడ్+91 ( 08516 Edit this on Wikidata )
పిన్(PIN)518222 Edit this on Wikidata
Websitehttps://nandyal.ap.gov.in Edit this on Wikidata

చరిత్ర

మార్చు

డోన్ చరిత్రాత్మక పట్టణం. దీని పాతపేరు ద్రోణపురి. బ్రిటిష్ వారి కాలంలో దీనికి డోన్ అనే పేరు వచ్చింది. ఓ చారిత్రాత్మక కథనం ప్రకారం, పాండవుల గురువైన ద్రోణాచార్యుడు, తీర్థయాత్రలకు పోతూ ఈ ప్రాంతంలోని కొండల శిఖరాలపై కొంత సమయం బసచేశాడు. ఈ చరిత్ర సంస్మణార్థం, ఈ ప్రాంతానికి ద్రోణపురి అనే పేరు వచ్చింది. కాలానుగుణంగా ఈ పేరు ద్రోణాచలంగా మారింది. బ్రిటిష్ హయాంలో దీని పేరు డోన్ గా స్థిర పడింది. ద్రోణపురి, ద్రోణాచలం, డోన్ పేర్లు ఈ పట్టణానికి చెందినవే.

భౌగోళికం

మార్చు

హైదరాబాదు నుండి 270 కి.మీ. బెంగళూరు నుండి 340 కి.మీ. దూరంలో డోన్ ఉంది.

జనగణన గణాంకాలు

మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2568 ఇళ్లతో, 10971 జనాభాతో 5 చ.కి.మీ విస్తీర్ణం కలిగి ఉంది. మొత్తం జనాభా 59,272.[2]

పరిపాలన

మార్చు

డోన్ పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

విద్యా సౌకర్యాలు

మార్చు
 
డోన్ వద్ద గుంటూరు-గుంతకల్ రైలు మార్గం

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి, సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, డోన్ లోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు, ఇంజనీరింగ్ కళాశాల, సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ కర్నూలులో ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు

మార్చు

ఈ పట్టణం గుండా హైదరాబాదు-బెంగళూరు మధ్యగల జాతీయ రహదారి 44 పోతున్నది. ఈ పట్టణం గుండా పోయే రైలు మార్గాన్ని బ్రిటిష్ వారు 1870లో నిర్మించారు. కాచిగూడ - గుంతకల్లు, గుంటూరు - గుంతకల్లు మార్గాలు డోన్ పట్టణం గుండా పోతున్నది. ఇక్కడి రైల్వేస్టేషను రాష్ట్రంలోగల పెద్ద స్టేషనులలో ఒకటి, రద్దీగానూ వుంటుంది, జిల్లాలోనే అతిపెద్ద స్టేషను, ప్రధాన కూడలి.

భూమి వినియోగం

మార్చు

2011 జనగణన ప్రకారం భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 542 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 1223 హెక్టార్లు
  • బంజరు భూమి: 25 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 3000 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 2704 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 321 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 256 హెక్టార్లు
  • చెరువులు: 65 హెక్టార్లు

ఉత్పత్తి

మార్చు

వేరుశనగ, ఆముదం గింజలు, కందులు

పారిశ్రామిక ఉత్పత్తులు

మార్చు

గ్రానైట్

పరిశ్రమలు

మార్చు

డోన్ పట్టణ పరిసరాలలో అనేక ఖనిజాలు ఉన్నాయి. సున్నపురాయి, గ్రానైటు గనులు గలవు. వీటికి అనుబంధ పరిశ్రమలు కూడా నెలకొల్పబడ్డాయి. లఘు, మధ్యతరహా పరిశ్రమలు, సిమెంటు పరిశ్రమ అనేక మందికి జీవనోపాధిని కలిగిస్తున్నాయి.

సంస్కృతి

మార్చు

డోన్ పట్టణం మతసామరస్యానికి నిలయం. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు సోదరభావంతో సామరస్యంగా జీవిస్తారు. డోన్ పట్టణంలోగల మూడు కొండలపై ఓ దేవాలయం, దర్గా, చర్చి నిర్మించారు. ఈ తరహా దృశ్యం మతసామరస్యాలకు ప్రతీక.

పండుగలు

మార్చు

కులమత తారతమ్యాలు లేకుండా ప్రజలు ఇక్కడ అనేక పండుగలు జరుపుకుంటారు. దీనికి మంచి ఉదాహరణ శివరాత్రి ఉత్సవాలు. స్థానిక దేవాలయ ఉత్సవాలు చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. పాత బుగ్గ వద్ద శివరాత్రి సందర్భంగా తిరుణాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

పర్యాటక ఆకర్షణలు

మార్చు
  • శ్రీరామ దేవాలయం (ప్రాచీనమైనది)
  • కొత్తబుగ్గ రామలింగేశ్వరస్వామి దేవాలయం (ప్రాచీనమైనది)
  • మాలిక్ బాబా దేవాలయం
  • శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము (నెహ్రూనగర్) - ఇచ్చట వెలసిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం చూడచక్కగా అధ్యాత్మిక ప్రవచనాలతో విరజిల్లుతూ వుంటుంది. ఈ దేవాలయములో ప్రతి సంవత్సరం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

ప్రముఖులు

మార్చు

రాజకీయ చైతన్యంగల ఈ పట్టణం నుండే ఇద్దరు ముఖ్యమంత్రులు నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డి ఎమ్.ఎల్.ఏ.లుగా ఎన్నికైనారు.

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=డోన్&oldid=4107154" నుండి వెలికితీశారు