జైనూర్

తెలంగాణ, కొమరంభీం జిల్లా, జైనూర్ మండలంలోని జనగణన పట్టణం
(Jainoor నుండి దారిమార్పు చెందింది)

జైనూర్, తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లా, జైనూర్ మండలానికి చెందిన జనగణన పట్టణం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2] ఇది జైనూర్ మండలానికి ప్రధాన కేంద్రం.ఇది ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గంలోని, ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన ఒక పట్టణం.గతంలో ఈ పట్టణం ఆదిలాబాదు జిల్లా, ఉట్నూరు రెవెన్యూ డివిజను పరిధిలో ఉండేది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కొత్తగా ఏర్పడిన కుంరంభీం జిల్లా, ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజను పరిధిలోకి 2016 అక్టోబరు 11 నుండి చేర్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1]

జైనూర్
—  జనగణన పట్టణం  —
జైనూర్ కూడలి వద్ద కొమురం భీం, కొడప కాశి పటేల్ విగ్రహాలు
జైనూర్ కూడలి వద్ద కొమురం భీం, కొడప కాశి పటేల్ విగ్రహాలు
జైనూర్ కూడలి వద్ద కొమురం భీం, కొడప కాశి పటేల్ విగ్రహాలు
జైనూర్ is located in తెలంగాణ
జైనూర్
జైనూర్
తెలంగాణ రాష్ట్రంలో జైనూర్ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 19°22′26″N 78°54′32″E / 19.3740°N 78.9090°E / 19.3740; 78.9090
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కొమరంభీం జిల్లా
మండలం జైనూర్
జనాభా (2011)
 - మొత్తం 6,342
 - పురుషుల సంఖ్య 3,034
 - స్త్రీల సంఖ్య 3,308
 - గృహాల సంఖ్య 1,273
పిన్ కోడ్ 504313
ఎస్.టి.డి కోడ్ - 08731

గణాంకాలు

మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జైనూర్ పట్టణ జనాభా మొత్తం 6,342, ఇందులో 3,034 మంది పురుషులు కాగా, 3,308 మంది మహిళలు ఉన్నారు.జైనూర్ పట్టణ పరిధిలో మొత్తం 1,273 ఇళ్లకు పైగా పరిపాలనను కలిగి ఉంది.వీటికి నీటి సరఫరా, మురుగునీటి పారుదల వంటి ప్రాథమిక సౌకర్యాలను జైనూర్ స్థానిక స్వపరిపాలన సంస్థ అందిస్తుంది. పట్టణ పరిధిలో రహదారులను నిర్మించడానికి, పోషించటానికి దాని పరిధిలోని ఆస్తులపై పన్ను విధించడానికి కూడా అధికారం ఉంది [3]

జైనూర్ పట్టణ పరిధిలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 1037 మంది ఉన్నారు. ఇది జైనూర్ (సిటి) మొత్తం జనాభాలో 16.35%గా ఉంది. పట్టణ స్త్రీల సెక్స్ నిష్పత్తి 1090 గా ఉంది.ఇది రాష్ట్ర సగటు 993 కు కన్న ఎక్కువగా ఉంది. అంతేకాకుండా బాలల లైంగిక నిష్పత్తి 998 గా ఉంది. పురుషుల అక్షరాస్యత 80.16% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 65.66%గా ఉంది..[3]

వ్యవసాయం, పంటలు

మార్చు

జైనూరులో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 9023 హెక్టార్లు, రబీలో 399 హెక్టార్లు. ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు కందులు, మొక్కజొన్న, సోయబీన్.[4]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Komaram_Bheem.pdf
  2. "కొమరం భీం జిల్లా జీవో" (PDF). తెలంగాణ మైన్స్. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. 3.0 3.1 "Jainoor Census Town City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-06-28.
  4. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 125

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=జైనూర్&oldid=4379851" నుండి వెలికితీశారు