జలగం వెంగళరావు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
(Jalagam Vengal Rao నుండి దారిమార్పు చెందింది)

జలగం వెంగళరావు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు 6 వ ముఖ్యమంత్రి, నక్సలైట్లను ఉక్కుపాదంతో అణచి వేసిన ముఖ్యమంత్రిగా అతను దేశవ్యాప్తంగా ప్రసిద్ధిచెందాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పలు మంత్రి పదవులు నిర్వహించాడు.

జలగం వెంగళరావు
జలగం వెంగళరావు

జలగం వెంగళరావు


పదవీ కాలం
10 డిసెంబరు, 1973 నుండి 6 మార్చి 1978
ముందు పి.వి.నరసింహారావు
తరువాత మర్రి చెన్నారెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం మే 1921
మరణం జూన్ 12 , 1999
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
సంతానం జలగం వెంకటరావు
నివాసం హైదరాబాదు
మతం హిందూ మతం

వెంగళరావు 1921 మే నెలలో ఆంధ్ర రాష్ట్రం, శ్రీకాకుళంలోని[1] రాజాంలో జన్మించాడు.

ఉద్యమా జీవితం

మార్చు

తన 20 వ ఏట నిజాముకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. ఆ రోజుల్లో కాంగ్రెసు పార్టీ నిర్వహించిన సరిహద్దు క్యాంపుల్లో పాల్గొన్నాడు. తెలంగాణ ప్రాంతంలో అమలవుతున్న కౌలుదారీ చట్టాలను నిరసిస్తూ చేపట్టిన ఈ ప్రచారంలో పాల్గొని రెండు సార్లు జైలుకు వెళ్ళాడు[2].

రాజకీయ జీవితం

మార్చు

1952 లో శాసనసభకు స్వతంత్రుడిగా పోటీ చేసి ఓడిపోయాడు. 1952 నుండి 1962 వరకు ఆయన కాంగ్రెసు పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు.[3] 1962లో కాంగ్రెసు పార్టీ తరపున ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుండి గెలిచి శాసనసభలో ప్రవేశించాడు. ఆ తరువాత 1978 వరకు మరో మూడు సార్లు సత్తుపల్లి నియోజకవర్గానికి శాసనసభలో ప్రాతినిధ్యం వహించాడు. 1967లో పంచాయితీరాజ్‌ ఛాంబరు చైర్మనుగా ఎన్నికయ్యాడు.

కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో 1969 నుండి 1971 వరకు హోంమంత్రిగాను, నరసింహారావు మంత్రివర్గంలో 1972-73 లో పరిశ్రమల మంత్రిగాను పనిచేసాడు.

ముఖ్యమంత్రిగా

మార్చు

జై ఆంధ్ర ఉద్యమ ఫలితంగా రాష్ట్రంలో విధించిన రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన తరువాత వెంగళరావు ముఖ్యమంత్రి పదవికి ఎంపికయ్యాడు.[4] 10 డిసెంబరు 1973 - 6 మార్చి 1978 వరకు ఆంధ్రప్రదేశ్ 6వ 2ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ ప్రాంతంలో కాకతీయ విశ్వవిద్యాలయం, కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, రాయలసీమ ప్రాంతంలో శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనే మూడు విశ్వవిద్యాలయాలు ప్రారంభించబడ్డాయి.[5][6] తన హయాంలో 1975లో హైదరాబాదు నగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభించాడు.[7]

అతని పాలనా కాలంలోనే ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ (ఆత్యయిక పరిస్థితి) ని విధించింది. ముఖ్యమంత్రిగా వెంగళరావు మంచి పరిపాలకుడిగా పేరుతెచ్చుకున్నాడు. అతను సాధించిన కార్యాలలో ముఖ్యమైనవి:

  1. నక్సలైటు ఉద్యమాన్ని కఠినంగా అణచివేసాడు. ఎన్‌కౌంటర్ల వ్యాప్తికి కారకుడిగా విమర్శలు తెచ్చుకున్నాడు.
  2. తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాదులో నిలదొక్కుకొనేందుకు తగు చేయూతనిచ్చాడు.
  3. మొదటి ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించాడు. అప్పటికి కొన్ని సంవత్సరాల ముందే ముగిసిన ప్రత్యేక తెలంగాణా ఉద్యమం, జై ఆంధ్ర ఉద్యమాల నేపథ్యంలో ఈ సభలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 1975 సంవత్సరాన్ని తెలుగు సాంస్కృతిక సంవత్సరంగా ప్రకటించి పలు కార్యకలాపాలు చేపట్టారు.[8]
  4. నాగార్జున సాగర్ ఎడమ కాలువను ఏన్నొ వ్యయప్రయాసల కోర్చి ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాల అభివ్రుద్దికి పాటుపడ్డారు.

పార్లమెంట్ సభ్యుడిగా

మార్చు

కాంగ్రెసు పార్టీ చీలిపోయి కాంగ్రెసు (ఐ) ఏర్పడినపుడు, వెంగళరావు కొన్నాళ్ళు పార్టీకి దూరమయ్యాడు. మళ్ళీ 1984 లో కాంగ్రెసుకు తిరిగి వచ్చి, 1984, 1991 మధ్య ఖమ్మం నియోజకవర్గం నుండి లోక్‌సభకు రెండుసార్లు ప్రాతినిధ్యం వహించాడు. 1986 నుండి 1989 వరకు కేంద్ర పరిశ్రమల మంత్రిగా పనిచేసాడు.

ఇతర వివరాలు

మార్చు
  • రావు తెలుగు భాషలో నా జీవిత కథ అనే ఆత్మకథ రాశాడు. ఇతర రాజకీయ నాయకుల జీవితాలకు సంబంధించి ఈ విషయాలు కొంత వివాదానికి కారణమయ్యాయి.[9][10] అందులో కొంత భాగాన్ని ఔట్‌లుక్ మ్యాగజైన్ ఆంగ్ల అనువాదంలో ప్రచురించింది.[11]
  • హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఒక పార్కుకు ఇతని పేరు మీద జలగం వెంగళరావు పార్కు అని పేరు పెట్టారు.[12] అతని పేరు మీద వెంగళరావు నగర్ అనే ప్రాంతం కూడా ఉంది.

1999 జూన్‌ 12 న హైదరాబాదులో జలగం వెంగళరావు మరణించాడు.[3] అతనికి ఇద్దరు కుమారులు - జలగం ప్రసాదరావు, జలగం వెంకటరావు. వీరిద్దరూ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. జలగం వెంకటరావు 2004లో సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు.

వనరులు, మూలాలు

మార్చు
  1. Bhaskar, B. V. S. (7 September 2002). "Sathupally to be model assembly constituency". The Times of India. Archived from the original on 17 October 2012. Retrieved 2012-03-27.
  2. KOTCHARLA, SRINIVASARAO ,VENKATESWARARAO (16 September 2021). "PEOPLE LEADER-JALAGAM VENGALARAO". https://journals.indexcopernicus.com/. Retrieved 13 January 2024. {{cite web}}: External link in |website= (help)CS1 maint: multiple names: authors list (link)
  3. 3.0 3.1 "Andhra ex-CM Vengala Rao dies at 78". Rediff.com. UNI. 12 June 1999. Retrieved 2012-03-27.
  4. "  ఆత్మకథ విషయపేజీలు".   నా కలం - నా గళం. శ్రీ సుందర శేషమాంబ పబ్లికేషన్స్‌. వికీసోర్స్. 2012. 
  5. "About University". skuniversity.ac.in. Retrieved 2021-04-19.
  6. "Kakatiya University, Warangal-506009, Telangana, India". kakatiya.ac.in. Retrieved 2021-04-19.
  7. Prasad, R.J. Rajendra (22 June 2001). "Bitter memories". Vol. 18, no. 12. Frontline. Archived from the original on 2010-01-22. Retrieved 2012-03-27.{{cite news}}: CS1 maint: unfit URL (link)
  8. రామానుజరావు, దేవులపల్లి (17 మార్చి 1975). తెలుగు నవల (ముందుమాట). హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ. p. iii. Retrieved 7 March 2015.
  9. Sivanand, S. (11 September 1996). "Skeletons In The Closet: Erstwhile Andhra Pradesh chief minister Vengala Rao's memoirs rake up Narasimha Rao's past". Outlook. Retrieved 2012-03-27.
  10. "Hey Ram!". The Times of India. TNN. 25 March 2001. Retrieved 2012-03-27.
  11. "'Pv's Affair Upset Indira': Extracts from Jalagam Vengala Rao's autobiography". Outlook. 11 September 1996. Retrieved 2012-03-27.
  12. "Birth anniversary of Jalagam celebrated". The Hindu. 5 May 2008. Archived from the original on 8 May 2008. Retrieved 2012-03-27.

బయటి లింకులు

మార్చు


ఇంతకు ముందు ఉన్నవారు:
పి.వి.నరసింహారావు
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
10/12/1973—06/03/1978
తరువాత వచ్చినవారు:
డా.మర్రి చెన్నారెడ్డి