జలగం వెంకటరావు

తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు.

జలగం వెంకటరావు (జననం జూలై 28, 1968) తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. 2004లో భారత జాతీయ కాంగ్రెస్ తరపున సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి, 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశాడు.[1] కొంతకాలం పార్లమెంటరీ కార్యదర్శిగా కూడా ఉన్నాడు.

జలగం వెంకటరావు
జలగం వెంకటరావు

పదవీ కాలం
2023 జులై 25 - ప్రస్తుతం
ముందు వనమా వెంకటేశ్వరరావు
నియోజకవర్గం కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం

పదవీ కాలం
2014-2018
ముందు కూనంనేని సాంబశివరావు
తరువాత వనమా వెంకటేశ్వరరావు
నియోజకవర్గం కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం

పదవీ కాలం
2004 - 2009
నియోజకవర్గం సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1968-04-18) 1968 ఏప్రిల్ 18 (వయసు 56)
ఖమ్మం, తెలంగాణ
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు బీఆర్ఎస్, భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు జలగం వెంగళరావు

జీవిత విషయాలు

మార్చు

వెంకటరావు 1968, జూలై 28న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 5వ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు దంపతులకు ఖమ్మంలో జన్మించాడు. 1990లో అమెరికాలోని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్ లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ విద్యను చదివాడు. వెంకటరావు అన్న జలగం ప్రసాదరావు కూడా మంత్రిగా పనిచేశాడు.

వృత్తి జీవితం

మార్చు

ఇతను ఒక టెక్నోక్రాట్. హైదరాబాదులోని విజే ఇన్ఫోలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీని నడుపుతున్నాడు.[2]

రాజకీయ జీవితం

మార్చు

జలగం వెంకటరావు, తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి 2004లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై 9,536 ఓట్ల తేడాతో గెలుపొందాడు.[3][4]

2009లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున ఖమ్మం శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు చేతిలో 2,472 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

2014లో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు 16,521 ఓట్ల తేడాతో ఎమ్మెల్యేగా గెలిచాడు. 2014లో ఖమ్మం జిల్లా నుండి గెలిచిన తొలి, ఏకైక టిఆర్ఎస్ శాసనసభ్యుడు.[5][6]

2018లో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో 4,120 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అఫిడవిట్ కేసులో ఆయన ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు 2023 జులై 25న తీర్పును వెల్లడించింది. దీంతో 2018లో ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకటరావును కోర్టు ఎమ్మెల్యేగా ప్రకటించింది.[7][8]

జలగం వెంకటరావు 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు చేతిలో ఓడిపోయి 2024 మార్చి 10న ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్‌ సమకంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[9][10]

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "State will set up steel plant at Bayyaram: KTR". The Hindu. Special Correspondent. 2018-04-03. ISSN 0971-751X. Retrieved 2020-12-03.{{cite news}}: CS1 maint: others (link)
  2. "AP result — Mixed reactions from technology sector". @businessline. Retrieved 2020-12-03.
  3. "Jalagam Vengala Rao remembered". The Hindu. 6 May 2009. Archived from the original on 2013-01-25. Retrieved 2020-12-03.
  4. "MLAs". Government of Andhra Pradesh. Archived from the original on 18 December 2012. Retrieved 2020-12-03.
  5. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  6. India, The Hans (2018-04-25). "Kothagudem MLA inspects check dam". www.thehansindia.com. Retrieved 2020-12-03.
  7. Andhra Jyothy (25 July 2023). "కొత్తగూడెం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు.. టి. హైకోర్టు సంచలన తీర్పు". Archived from the original on 25 July 2023. Retrieved 25 July 2023.
  8. Hindustantimes Telugu (10 November 2023). "నాడు టిఆర్ఎస్ ఏకైక ఎమ్మెల్యే.. నేడు రెబల్ అభ్యర్థిగా బరిలోకి." Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
  9. ABP Telugu (10 March 2024). "బీజేపీలోకి బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు". Archived from the original on 10 March 2024. Retrieved 10 March 2024.
  10. Eenadu (10 March 2024). "భాజపాలో చేరిన పలువురు భారాస నేతలు". Archived from the original on 10 March 2024. Retrieved 10 March 2024.