అకునూరు, కృష్ణా జిల్లా, వుయ్యూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ 521 245., ఎస్.టి.డి. కోడ్ = 08676.

  • ఇది ఉయ్యూరుకు 5 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ చెరుకు, తమలపాకు ముఖ్యమైన పంటలు. పసుపు కూడా విరివిగా పండుతున్నది. పసుపును అంతర పంటగా పండిస్తారు.
  • ఆకునూరు గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో దివంగత కాకాని వెంకటరట్నం కుటుంబంలో ఇప్పటికే రెండు తరాలవారు గ్రామ పరిపాలన బాధ్యతలు నిర్వహించగా,2013 జూలైలో జరుగు ఎన్నికలలో మూడవ తరం ప్రతినిధిగా శ్రీ కాకాని విజయకుమార్ గ్రామ పంచాయతీ సర్పంచి పదవికి పోటీలో ఉన్నారు. ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో ఉక్కు కాకానిగా పేరుగాంచిన శ్రీ కాకాని వెంకటరత్నం, 1934 నుండి 1937 వరకూ ఆకునూరు గ్రామ పంచాయతీ సర్పంచిగా వ్యవహరించారు. అనంతరం రాష్ట్ర మంత్రిగా, పీ.సీ.సీ అధ్యక్షులుగా పనిచేశారు. ఆ తరువాత ఆయన కుమారుడు శ్రీ కాకాని రామమోహనరావు 1964-1970 మధ్య ఈ గ్రామ సర్పంచిగా పనిచేశారు. తరువాత మండల వ్యవస్థ ప్రారంభం అయ్యాక, 1987లో ఆయన ఉయ్యూరు మండలాధ్యక్షులుగా ఎన్నికైనారు. 2013 జూలైలో ఈ గ్రామంలో జరుగు పంచాయతీ ఎన్నికలలో శ్రీ కాకాని రామమోహనరావు కుమారుడు శ్రీ కాకాని విజయ కుమార్ సర్పంచి పదవికి పోటీ చేసి విజయం సాధించారు. [2] & [3]
  • ఈ గ్రామానికి చెందిన శ్రీ మందాడి సత్యనారాయణ, విద్యుచ్ఛక్తి శాఖలో పదవీ విరమణ పొందిన సీనియర్ గణాంకాధికారి. వీరు గ్రామంలోని ప్రజలందరికీ స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో, రు. 13 లక్షలతో తన కుమారుడు శ్రీనివాస్ గ్నాపకార్ధం, గ్రామంలో సురక్షిత త్రాగునీటి పథకాన్ని నిర్మించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఈ పథకం 2014, మార్చి-15న ప్రారంభించెదరు. ఈ పథకం నిర్వహణ బాధ్యతను పంచాయతీకి అప్పగించారు. [3]
అకునూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం వుయ్యూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం
 - పురుషులు 1,637
 - స్త్రీలు 1,606
 - గృహాల సంఖ్య 826
పిన్ కోడ్ 521245
ఎస్.టి.డి కోడ్ 08676

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3243.[1] ఇందులో పురుషుల సంఖ్య 1637, స్త్రీల సంఖ్య 1606, గ్రామంలో నివాసగృహాలు 826 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 363 హెక్టారులు.

సమీప గ్రామాలుసవరించు

మూలాలుసవరించు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-07.

[3] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014, మార్చి-15; 2వ పేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=అకునూరు&oldid=2892206" నుండి వెలికితీశారు