అడవి దొంగ
అడవి దొంగ 1985 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో చిరంజీవి, రాధ ప్రధాన పాత్రధారులు. గోపీ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై చలసాని గోపీ నిర్మించిన ఈ సినిమాకి సంగీతం కొమ్మినేని చక్రవర్తి సమకూర్చారు.
అడవి దొంగ | |
---|---|
దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
రచన | పరుచూరి సోదరులు (కథ, సంభాషణలు) |
నిర్మాత | చలసాని గోపి |
తారాగణం | చిరంజీవి,రాధ,శారద |
ఛాయాగ్రహణం | కె. ఎస్. ప్రకాష్ |
కూర్పు | డి. వెంకటరత్నం |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | నవంబరు 19, 1985 |
భాష | తెలుగు |
కథ
మార్చువసుంధర (శారద), విశ్వం (సూరపనేని శ్రీధర్) ఆదర్శ దంపతులు. అడవికి దగ్గర్లో ఉన్న ఒక ఊర్లో ఉంటూ అక్కడి ప్రజల్ని చదువు చెప్పి చైతన్యవంతుల్ని చేస్తుంటారు. వసుంధర అన్న (జగ్గయ్య) ఒక పోలీసు ఆఫీసరు. ఆయనకు వసుంధర విశ్వాన్ని పెళ్ళి చేసుకుని అలా సేవ చేయడం ఇష్టం ఉండదు.
తారాగణం
మార్చు- కాళిదాసు గా చిరంజీవి
- సరోజ గా రాధ
- వసుంధర గా శారద
- విశ్వం గా సూరపనేని శ్రీధర్
- తోడేళ్ళ అప్పల నాయుడు గా రావు గోపాలరావు
- కొండల నాయుడు గా నూతన్ ప్రసాద్
- వసుంధర అన్నయ్య గా జగ్గయ్య
- ఫారెస్టు అధికారి గా రంగనాథ్
- పులిగాడు గా చలపతి రావు
- అవధాని గా అల్లు రామలింగయ్య
- సూరీడు గా పి. ఎల్. నారాయణ
- మాడా వెంకటేశ్వర రావు
- చిడతల అప్పారావు.
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: కోవెలమూడి రాఘవేంద్రరావు
సంగీతం:కొమ్మినేని చక్రవర్తి
నిర్మాత: చలసాని గోపీ
నిర్మాణ సంస్థ: గోపీ ఆర్ట్ పిక్చర్స్
కధ, మాటలు: పరుచూరి సోదరులు
సాహిత్యం: వేటూరి సుందర రామమూర్తి
నేపథ్య గానం:శిష్ట్లా జానకి, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
ఛాయా గ్రహణం: కె.ఎస్.ప్రకాష్
కూర్పు: డి.వెంకటరత్నం
విడుదల:19:11:1985.
పాటలు
మార్చు- వానా వానా వందనం, రచన వేటూరి సుందర రామమూర్తి, గానం.శ్రీపండితారాథ్యుల బాలసుబ్రహ్మణ్యం ,శిష్ట్లా జానకి
- చల్లగాలి , రచన: వేటూరి, గానం. ఎస్ జానకి , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- ఇది ఒక నందనవనమూ, రచన: వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
- ఓం నమ: శివాయ , రచన: వేటూరి, గానం.శిష్ట్లా జానకి బృందం
- వీర విక్రమ , రచన: వేటూరి, గానం.శిష్ట్లా జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
మూలాలు
మార్చు1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.