అత్తిలి సత్తిబాబు ఎల్‌కేజీ

(అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ నుండి దారిమార్పు చెందింది)
అత్తిలి సత్తిబాబు ఎల్‌కేజీ
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం ఇ.వి.వి.సత్యనారాయణ
నిర్మాణం ఇ.వి.వి.సత్యనారాయణ
కథ ప్రసాద్‌వర్మ
చిత్రానువాదం ఇ.వి.వి.సత్యనారాయణ,
విఘ్నేష సతీష్
తారాగణం అల్లరి నరేష్‌,
విదిశ,
కౌశ,
సునీల్‌,
కృష్ణభగవాన్‌,
ఆలీ,
వేణుమాధవ్‌,
బ్రహ్మానందం,
ధర్మవరపు సుబ్రహ్మణ్యం,
చలపతిరావు,
ఎల్బీ శ్రీరాం,
మల్లికార్జునరావు,
సత్య కృష్ణన్,
అభినయశ్రీ
సంగీతం శ్రీకృష్ణ
సంభాషణలు విఘ్నేష సతీష్
ఛాయాగ్రహణం వి.జయరామ్
కూర్పు గౌతంరాజు
నిర్మాణ సంస్థ ఇ.వి.వి. సినిమా
విడుదల తేదీ 6 ఏప్రిల్, 2007
భాష తెలుగు

కథా గమనం

మార్చు

ఇది చక్కని హాస్యభరిత చిత్రం. దీనికి చిన్న సెంటిమెంటునుకూడా జోడించారు. అత్తిలి వెంకట రత్నం అనే ఆయన ఎన్నో ప్రజొపయోగ కార్యక్రామాలు చేసి మంచి పేరుప్రఖ్యతులు సంపాదిస్తాడు. ఆయన సంతానం ముగ్గురు కొడుకులు. ఒకడొక మందుబాబు, మరొకడు పేకబాబు, ఆఖరువాడు సత్తిబాబు, చదువుకున్నది ఎల్కేజీయే. సత్తిబాబు వడ్డీ వ్యాపారి అర్జెంటుగా అపర కుబేరుడైపోవాలన్నది అతని ఆశ. అలవికాని వడ్డీలకు అప్పులిచ్చి ముక్కుపిండి వసూలు చేస్తుంటాడు. డబ్బు విషయంలో తమపర భేదం చూసుకోడు. అలాంటి సత్తిబాబుని అమ్ములు అనే అమ్మాయి ప్రేమిస్తుంది. అమ్ములు తండ్రికి అప్పుఇచ్చినందుకు తనకు వలవేస్తుందని అనుకుంటాడు సత్తిబాబు. ఆమెను ఆమె తండ్రి ఎదుటే అవమాన పరుస్తాడు. అలాంటి సత్తిబాబుని మార్చేందుకు వెంకటరత్నంగారి సహాయంతో చదువుకున్న ఒక లాయర్ తన కూతురుతో కలసి నాటకమాడి సత్తిబాబులో పరివర్తన తీసుకొస్తాడు. తరువాత నిజాన్ని గ్రహించి సత్తిబాబు అమ్ములును పెళ్ళి చేసుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది.

 
సినిమాలో ఒక సన్నివేశము.

విశేషాలు

మార్చు

సత్తిబాబా... కుక్క నోట్లో మాంసం ముక్క లాక్కొని పలావొండుకొనే రకం' ఇదొక డవిలాగు. జంద్యాల తరువాత హాస్యానికి జవాబు ఎవరనే ప్రశ్నకు టక్కున స్పురించే పేరు ఇవివి. హింస శృంగారం మితిమీరుతూ సకుటుంబముగా సినిమా చూడాలంటే బయపడే రోజుల్లో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ సినిమాగా నిలిచింది.