ఎల్. బి. శ్రీరామ్
ఎల్.బి.శ్రీరాం గా పేరొందిన లంక భద్రాద్రి శ్రీరామ చంద్రమూర్తి ఒక నటుడు, రచయిత, దర్శకుడు. ఆయన ముందుగా రంగస్థలం పై పేరు తెచ్చుకుని, తరువాత రేడియోలో పనిచేసి తరువాత సినిమా పరిశ్రమలో ప్రవేశించాడు. ముందుగా సినీ రచయితగా పనిచేసి తరువాత నటుడుగా నిరూపించుకున్నాడు. 400కి పైగా సినిమాల్లో నటించాడు. నాలుగు సార్లు నంది పురస్కారాలను అందుకున్నాడు. యూట్యూబులో ఎల్. బి. శ్రీరాం హార్ట్ ఫిలింస్ పేరుతో లఘుచిత్రాలు కూడా రూపొందిస్తున్నారు.[1]
ఎల్. బి. శ్రీరాం (లంక భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి) | |
---|---|
జననం | లంక భద్రాద్రి శ్రీరామ్ |
వృత్తి | నటుడు స్క్రిప్టు రచయిత హాస్యనటుడు రంగస్థల నటుడు |
పురస్కారాలు | నంది పురస్కారాలు |
వ్యక్తిగత జీవితం
మార్చుశ్రీరామ్ మే 30న తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం సమీపంలోని నేదునూరు అనే అగ్రహారంలో జన్మించాడు. ఈయన తండ్రి వేదపండితుడు. రాష్ట్రపతి పురస్కార గ్రహీత. అప్పటి జమీందారు ఆయన పాండిత్య ప్రతిభకు మెచ్చి ఒక ఇల్లు బహుమానంగా ఇచ్చాడు. అందులోనే వారి కుటుంబం నివాసం. శ్రీరామ్ పెద్దన్నయ్య కూడా వేద పండితుడే.[2] శ్రీరామ్ మొదట రంగస్థల నటుడిగా రాష్ట్రవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు. తరువాత కొద్ది రోజులు ఆలిండియా రేడియోలో కూడా పనిచేశాడు. శ్రీరాం కొడుకు గ్రాఫిక్స్ విభాగంలో పనిచేస్తున్నాడు.
రంగస్థల జీవితం, రచనలు
మార్చుఈయన రచయితగా అనేక రచనలు చేశారు. అందులో అనేక ప్రసిద్ధ నాటికలు ఉన్నాయి. 1983లో రచించిన గజేంద్రమోక్షం నాటిక బాగా ప్రసిద్ధి చెందింది.ఈ నాటిక అనేక వేల ప్రదర్శనలు జరిగింది.
సినిమా జీవితం
మార్చుకిష్కిందకాండ సినిమా ద్వారా రచయితగా గుర్తింపు పొందిన శ్రీరాం అపుడపుడు కొన్ని సినిమాలలో అతిథి పాత్రలు వేసేవారు. హలో బ్రదర్ (1994), హిట్లర్ (1997) లాంటి విజయవంతమైన చిత్రాలకు మాటల రచయితగా పనిచేశాడు. తరువాత ఇ.వి.వి. సినిమా చాలా బాగుంది ద్వారా పల్లెటూరి యాసతో మాట్లాడే పాత్రతో మంచి నటుడిగానూ గుర్తింపు పొందారు. దాంతో చాలా సినిమాల్లో అవకాశం వచ్చింది. హాస్య పాత్రల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. అంతేకాకుండా సెంట్ మెంట్, భావోద్వేగాలతో మిళితమైన అమ్మో ఒకటో తారీఖు అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ఎల్. బి. శ్రీరామ్ ఒంటెద్దు బండి అనే నాటకం ఆధారంగా తీయబడింది. అంతేకాకుండా చాలా నాటకాలు రచించారు.
నిర్మాతగా
మార్చు- కవిస్రమాట్ (2021)
షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్
మార్చుఅవార్డులు
మార్చు- ఉత్తమ మాటల రచయిత - రామసక్కనోడు (1999).
- ఉత్తమ హాస్య నటుడు - చాలా బాగుంది (2000).
- ఉత్తమ మాటల రచయిత - సొంతవూరు (2009).
- ఉత్తమ పాత్రోచిత నటన - సొంతవూరు (2009).
నటించిన చిత్రాల జాబితా
మార్చు- లగ్గం (2024)
- మోహన్‌కృష్ణ గ్యాంగ్ లీడర్ (2023)
- బెదురులంక 2012 (2023)
- మా నాన్న నక్సలైట్ (2022)
- కొండా(2022)
- కవిస్రమాట్ (2021)
- శరభ (2018)[3]
- మేరా భారత్ మహాన్ (2019)
- శ్రీశ్రీ (2016)
- టామి (2015)
- పాఠశాల (2014)
- బన్నీ అండ్ చెర్రీ (2013)
- చిన్న సినిమా (2013)
- రచ్చ (2012)
- దరువు (2012)
- ఆలస్యం అమృతం (2010)
- శంభో శివ శంభో (2010)
- కత్తి కాంతారావు (2010)
- కారా మజాకా (2010)
- సింహా (2010)
- బెట్టింగ్ బంగార్రాజు (2010)
- బెండు అప్పారావ్ ఆర్. ఎం. పి (2009)
- పదహారేళ్ళ వయసు (2009)
- శంఖం (2009)
- అధినేత (2009)
- సొంతవూరు (2009)
- బలాదూర్ (2008)
- సిద్దు ఫ్రం శ్రీకాకుళం (2008)
- సుందరకాండ (2008)
- ఉల్లాసంగా ఉత్సాహంగా (2008)
- పాండురంగడు (2008)
- గమ్యం (2008)
- మిస్సమ్మ ఐ.పి.ఎస్ (2007)
- అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ (2007)
- అన్నవరం (2006)
- భాగ్యలక్ష్మి బంపర్ డ్రా (2006)
- స్టాలిన్ (2006)
- అమ్మ చెప్పింది (2006)
- బంగారం (2006)
- హ్యాపీ (2006)
- లక్ష్మి (2006)
- ఛత్రపతి (2005)
- వీరివీరి గుమ్మడిపండు (2005)
- సుభాష్ చంద్రబోస్ (2005)
- బన్ని (2005)
- రాధాగోపాలం (2005)
- అంజలి ఐ లవ్యూ (2004)
- మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు (2004)
- ఇంక అంతా శుభమే పెళ్ళి జరిపించండి (2004)
- మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి (2004)
- శివ్ శంకర్ (2004)
- గుడుంబా శంకర్ (2004)
- కొడుకు (2004)
- రక్షక్ ది ప్రొటెక్టర్ (2004)
- జానకి వెడ్స్ శ్రీరామ్ (2003)
- ఒట్టు ఈ అమ్మాయెవరో తెలీదు! (2003)
- మిస్సమ్మ (2003)
- చంటిగాడు (2003)
- దిల్ (2003)
- ఫూల్స్ (2003)
- హోలీ (2002)
- తొట్టిగ్యాంగ్ (2002)
- శివరామరాజు (2002)
- ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు (2002)
- అల్లరి రాముడు (2002)
- తప్పుచేసి పప్పుకూడు (2002)
- హనుమాన్ జంక్షన్ (2001)
- అందాల ఓ చిలకా (2001)
- రా (2001)
- అమ్మాయే నవ్వితే (2001)
- 9 నెలలు (2001)
- 6 టీన్స్ (2001)
- ఇదే నా మొదటి ప్రేమలేఖ (2001)
- చిన్నా (2001)
- ప్రేమసందడి (2001)
- ఎదురులేని మనిషి (2001)
- బడ్జెట్ పద్మనాభం (2001)
- మృగరాజు (2001)
- ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం (2001)
- చెప్పాలని ఉంది (2001)
- కలిసి నడుద్దాం (2001)
- ఆజాద్ (2000)
- చాలా బాగుంది (1999)
- జయం మనదేరా (2000)
రచయితగా సినిమాల జాబితా
మార్చు- అమ్మో ఒకటోతారీఖు
- భాగ్యలక్ష్మి బంపర్ డ్రా (2006)
- అరుంధతి (1999)
- హిట్లర్ (1997)
- హలో బ్రదర్ (1994)
- అప్పుల అప్పారావు (1991)
- ఏప్రిల్ ఒకటి విడుదల (1991)
- కిష్కిందకాండ
మూలాలు
మార్చు- ↑ "నష్టాలొస్తున్నాయని తెలిసే చేస్తున్నా!". ఈనాడు. 25 September 2016. Archived from the original on 25 September 2016. Retrieved 25 September 2016.
- ↑ "ఎన్నో మిథునాలు సృష్టిస్తున్నా." ఈనాడు. 26 May 2019. Archived from the original on 27 May 2019. Retrieved 27 May 2019.
- ↑ సాక్షి, సినిమా (22 November 2018). "'శరభ' మూవీ రివ్యూ". Archived from the original on 22 November 2018. Retrieved 19 March 2020.