అనసూయ (2007 సినిమా)

2007 తెలుగు సినిమా

అనసూయ 2007లో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ఒక థ్రిల్లర్ సినిమా.[1] ఇందులో భూమిక, రవిబాబు, అబ్బాస్ ప్రధాన పాత్రలు పోషించారు.

అనసూయ
దర్శకత్వంరవిబాబు
రచననివాస్ (సంభాషణలు)
స్క్రీన్ ప్లేపరుచూరి బ్రదర్స్
కథరవిబాబు
నిర్మాతరవిబాబు
తారాగణంభూమిక చావ్లా, రవిబాబు, అబ్బాస్, అంకిత, నిఖిత, మల్లేశ్ బలష్టు, సుహాని కలిత
ఛాయాగ్రహణంసుధాకర్ రెడ్డి
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంశేఖర్ చంద్ర
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2007 డిసెంబరు 21 (2007-12-21)
భాషతెలుగు

కథ మార్చు

అనసూయ ఒక అనాథ. క్రిమినల్ సైకాలజీ (నేరస్థుల మనస్తత్వ అధ్యయన శాస్త్రం) లో పీజీ పూర్తి చేసి ఓ టీవీ చానల్ లో రిపోర్టరు గా చేరుతుంది. తన వృత్తిలో భాగంగా వరుస హత్యలు చేస్తూ, శవాల్లోని కొన్ని అంతర్భాగాలు మాయమయ్యే ఒక విచిత్రమైన కేసు వెనుక రహస్యాన్ని పరిశోధించాల్సి వస్తుంది. హతకుడు హత్య చేసిన తర్వాత ఆ స్థలంలో ఒక గులాబీ పువ్వు వదిలి వెళుతుంటాడు. ఈలోగా ఓ పోలీసు ఆఫీసరు కూడా హంతకుణ్ణి పట్టుకోవడానికి నియమితుడవుతాడు. వీటన్నింటికి కారణం గులాబీ పువ్వు గోవిందు అనే వ్యక్తి కావచ్చని నిర్ధారణకు వస్తుంది. అతని నేపథ్యాన్ని పరిశీలిస్తూ గోవిందు గతంలో ప్రేమించిన ఓ మెడికో అమ్మాయి గురించి వెతుకుతుంది. ఆ అమ్మాయి గోవిందు ప్రేమని అంగీకరించి ఉండదు. అసలు గోవిందు ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు? అతన్ని అనసూయ ఎలా అంతమొందించిందీ అన్నది మిగతా కథ.

తారాగణం మార్చు

మూలాలు మార్చు

  1. జి. వి, రమణ. "అనసూయ సినిమా సమీక్ష". idlebrain.com. ఐడిల్ బ్రెయిన్. Retrieved 17 October 2017.