అన్రిక్ నోర్ట్యే

అన్రిక్ ఆర్నో నోర్ట్యే (జననం 1993 నవంబరు 16) దక్షిణాఫ్రికా క్రికెట్ ఆటగాడు . అతను 2019 మార్చిలో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తరఫున తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు.[2] 2020 జూలైలో, క్రికెట్ దక్షిణాఫ్రికా వార్షిక అవార్డుల వేడుకలో నోర్ట్యే, ఆ సంవత్సరానికి కొత్త ఆటగాడిగా ఎంపికయ్యాడు. [3]

అన్రిక్ నోర్ట్యే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అన్రిక్ అర్నో నోర్ట్యే[1]
పుట్టిన తేదీ (1993-11-16) 1993 నవంబరు 16 (వయసు 31)
ఉయ్‌టెన్‌హేజ్, కేఫ్ ప్రావిన్స్, దక్షిణాఫ్రికా[1]
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 338)2019 అక్టోబరు 10 - ఇండియా తో
చివరి టెస్టు2023 ఫిబ్రవరి 28 - వెస్టిండీస్ తో
తొలి వన్‌డే (క్యాప్ 133)2019 మార్చి 3 - శ్రీలంక తో
చివరి వన్‌డే2023 ఏప్రిల్ 2 - నెదర్లాండ్స్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.20
తొలి T20I (క్యాప్ 85)2019 సెప్టెంబరు 18 - ఇండియా తో
చివరి T20I2023 మార్చి 28 - వెస్టిండీస్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.20
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2012/13–presentEastern Province
2015/16–2020/21Warriors
2018–2019కేప్‌టౌన్ బ్లిట్జ్
2020–presentఢిల్లీ క్యాపిటల్స్
2023Pretoria Capitals
2023Washington Freedom
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు T20I ఫక్లా
మ్యాచ్‌లు 19 20 31 67
చేసిన పరుగులు 187 25 16 906
బ్యాటింగు సగటు 7.79 6.25 2.66 13.32
100లు/50లు 0/0 0/0 0/0 0/4
అత్యుత్తమ స్కోరు 40 10 4* 79*
వేసిన బంతులు 3,057 946 623 11,064
వికెట్లు 70 36 38 234
బౌలింగు సగటు 26.71 24.94 19.52 26.17
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 4 0 0 9
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 6/56 4/51 4/10 6/44
క్యాచ్‌లు/స్టంపింగులు 6/– 3/– 8/– 15/–
మూలం: ESPNcricinfo, 1 May 2023

దేశీయ, T20 ఫ్రాంచైజీ కెరీర్

మార్చు

2016 ఆఫ్రికా T20 కప్ కోసం అతన్ని తూర్పు ప్రావిన్స్ జట్టులోకి తీసుకున్నారు. [4] 2018 అక్టోబరులో, అతను ఎంజాన్సీ సూపర్ లీగ్ T20 టోర్నమెంటు మొదటి ఎడిషన్ కోసం కేప్ టౌన్ బ్లిట్జ్ జట్టులో ఎంపికయ్యాడు. [5] [6] టోర్నమెంటు మధ్యలో, అతను చీలమండ గాయంతో తప్పుకున్నాడు. [7] 2018 డిసెంబరులో 2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం జరిగిన వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ అతనిని కొనుగోలు చేసింది. [8] [9] అయితే, 2019 మార్చిలో, అతను భుజం గాయంతో టోర్నమెంటు నుండి తప్పుకున్నాడు. [10]

2019 సెప్టెంబరులో, అతను 2019 ఎంజాన్సీ సూపర్ లీగ్ టోర్నమెంటు కోసం కేప్ టౌన్ బ్లిట్జ్ జట్టు కోసం జట్టుకు ఎంపికయ్యాడు. [11] 2020 IPL వేలానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ అతన్ని విడుదల చేసింది. [12] 2020 జూలైలో, అతను 2020 కరేబియన్ ప్రీమియర్ లీగ్ కోసం సెయింట్ లూసియా జౌక్స్ జట్టులో ఎంపికయ్యాడు. [13] [14] అయితే, సరైన సమయంలో ప్రయాణ ఏర్పాట్లను నిర్ధారించలేకపోయినందున టోర్నమెంట్‌కు దూరమైన ఐదుగురు దక్షిణాఫ్రికా క్రికెటర్లలో నోర్ట్యే ఒకడు. [15] 2020 ఆగస్టులో, 2020 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో క్రిస్ వోక్స్ స్థానంలో నోర్ట్యే ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరాడు. [16] 2020 అక్టోబరు 14న, 2020 IPL యొక్క 30వ మ్యాచ్ సందర్భంగా నోర్ట్యే, రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన జోస్ బట్లర్‌కు 156.22 కిమీ/గం వేగంతో బౌలింగ్ చేశాడు. IPLలో ఇప్పటి వరకు ఇదే అత్యంత వేగవంతమైన డెలివరీ. [17]


2021 ఏప్రిల్లో, అతను దక్షిణాఫ్రికాలో 2021–22 క్రికెట్ సీజన్‌కు ముందు తూర్పు ప్రావిన్స్ జట్టుకు ఎంపికయ్యాడు. [18]

USAలో మేజర్ లీగ్ క్రికెట్ ప్రారంభ సీజన్‌కు ముందు, అతను 2023 మార్చిలో వాషింగ్టన్ ఫ్రీడమ్ స్క్వాడ్‌కు ఎంపికయ్యాడు.

అంతర్జాతీయ కెరీర్

మార్చు

2019 ఫిబ్రవరిలో, శ్రీలంకతో జరిగే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) జట్టులోకి నోర్ట్యే ఎంపికయ్యాడు.[19] అతను 2019 మార్చి 3న శ్రీలంకపై దక్షిణాఫ్రికా తరపున తన తొలి వన్‌డే ఆడాడు.[20] 2019 మార్చిలో, అతను శ్రీలంకతో జరిగిన సిరీస్ కోసం దక్షిణాఫ్రికా యొక్క ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) జట్టులో కూడా ఎంపికయ్యాడు గానీ,[21] గాయం కారణంగా T20I సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. [22]

2019 ఏప్రిల్లో, అతను 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం దక్షిణాఫ్రికా జట్టులోకి ఎంపికయ్యాడు. [23] [24] అయితే, 2019 మే 7న, అతను చేతి గాయంతో టోర్నమెంటు నుండి తప్పుకున్నాడు. అతని స్థానంలో క్రిస్ మోరిస్ వచ్చాడు. [25]

2019 ఆగస్టులో, అతను భారతదేశంతో జరిగే పోటీలకు గాను, దక్షిణాఫ్రికా టెస్టు, ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) స్క్వాడ్‌లలో ఎంపికయ్యాడు. [26] అతను 2019 సెప్టెంబరు 18న భారతదేశంపై దక్షిణాఫ్రికా తరపున తన తొలి T20I ఆడాడు [27] 2019 అక్టోబరు 10న దక్షిణాఫ్రికా తరపున, భారతదేశంపైనే తన టెస్టు రంగ ప్రవేశం కూడా చేశాడు [28] 2020 జనవరిలో, ఇంగ్లండ్‌తో జరిగిన నాల్గవ టెస్టులో నోర్ట్యే, టెస్టు క్రికెట్‌లో తన తొలి ఐదు వికెట్ల పంటను సాధించాడు. [29] 2020 మార్చిలో, 2020-21 సీజన్‌కు ముందు క్రికెట్ సౌత్ ఆఫ్రికా అతనికి జాతీయ కాంట్రాక్ట్ ఇచ్చింది. [30] [31]

2021 సెప్టెంబరులో, 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం దక్షిణాఫ్రికా జట్టుకు నోర్ట్యే ఎంపికయ్యాడు. [32]

 
బాక్సింగ్ డే టెస్ట్ 2వ రోజున నోర్ట్యే, మహారాజ్‌లు లబుషేన్‌ని రనౌట్ చేస్తున్నారు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Anrich Nortje". Wisden. Retrieved 10 December 2020.
  2. "Anrich Nortje". ESPN Cricinfo. Retrieved 21 September 2016.
  3. "Quinton de Kock, Laura Wolvaardt scoop up major CSA awards". ESPN Cricinfo. Retrieved 4 July 2020.
  4. "Eastern Province Squad". ESPN Cricinfo. Retrieved 21 September 2016.
  5. "Mzansi Super League - full squad lists". Sport24. Retrieved 17 October 2018.
  6. "Mzansi Super League Player Draft: The story so far". Independent Online. Retrieved 17 October 2018.
  7. "Injured Anrich Nortje leaves his imprint at MSL". ESPN Cricinfo. Retrieved 29 November 2018.
  8. "IPL 2019 auction: The list of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 18 December 2018.
  9. "IPL 2019 Auction: Who got whom". The Times of India. Retrieved 18 December 2018.
  10. "South Africa quick Anrich Nortje ruled out of IPL". ESPN Cricinfo. Retrieved 20 March 2019.
  11. "MSL 2.0 announces its T20 squads". Cricket South Africa. Archived from the original on 4 September 2019. Retrieved 4 September 2019.
  12. "Where do the eight franchises stand before the 2020 auction?". ESPN Cricinfo. Retrieved 15 November 2019.
  13. "Mohammad Nabi, Sandeep Lamichhane, Ben Dunk earn big in CPL 2020 draft". ESPN Cricinfo. Retrieved 6 July 2020.
  14. "Teams Selected for Hero CPL 2020". Cricket West Indies. Retrieved 6 July 2020.
  15. "Five South Africans to miss CPL after failing to confirm travel arrangements". ESPN Cricinfo. Retrieved 28 July 2020.
  16. "IPL 2020: Delhi Capitals replace Chris Woakes with Anrich Nortje". CricTracker (in ఇంగ్లీష్). 2020-08-18. Retrieved 2020-08-18.
  17. "IPL 2020: This bowler delivers the fastest ball in IPL history at 156.22 kmph, breaks Dale Steyn's record. In IPL 2020 He Scored Seven Runs and Picked Up 22 Wickets". Zee News (in ఇంగ్లీష్). 2020-10-15. Retrieved 2020-10-15.
  18. "CSA reveals Division One squads for 2021/22". Cricket South Africa. Archived from the original on 20 April 2021. Retrieved 20 April 2021.
  19. "Fit-again Lungi Ngidi back in South Africa's ODI squad, Hashim Amla left out". ESPN Cricinfo. Retrieved 24 February 2019.
  20. "1st ODI, Sri Lanka tour of South Africa at Johannesburg, Mar 3 2019". ESPN Cricinfo. Retrieved 3 March 2019.
  21. "Aiden Markram, Anrich Nortje, Sinethemba Qeshile called up for T20Is against Sri Lanka". ESPN Cricinfo. Retrieved 17 March 2019.
  22. "New-look South Africa seek series win". International Cricket Council. Retrieved 21 March 2019.
  23. "Hashim Amla in World Cup squad; Reeza Hendricks, Chris Morris miss out". ESPN Cricinfo. Retrieved 18 April 2019.
  24. "Amla edges out Hendricks to make South Africa's World Cup squad". International Cricket Council. Retrieved 18 April 2019.
  25. "Chris Morris replaces Anrich Nortje in South Africa's CWC19 squad". International Cricket Council. Retrieved 7 May 2019.
  26. "Nortje, Second and Muthusamy part of South Africa squads to India". ESPN Cricinfo. Retrieved 13 August 2019.
  27. "2nd T20I (N), South Africa tour of India at Mohali, Sep 18 2019". ESPN Cricinfo. Retrieved 18 September 2019.
  28. "2nd Test, ICC World Test Championship at Pune, Oct 10-14 2019". ESPN Cricinfo. Retrieved 10 October 2019.
  29. "England outclass Proteas after Nortje fifer". Cricket South Africa. Archived from the original on 26 జనవరి 2020. Retrieved 26 January 2020.
  30. "Beuran Hendricks earns CSA national contract, Dale Steyn left out". ESPN Cricinfo. Retrieved 23 March 2020.
  31. "CSA announces Proteas contract squads for 2020/21". Cricket South Africa. Archived from the original on 23 మార్చి 2020. Retrieved 23 March 2020.
  32. "T20 World Cup: South Africa leave out Faf du Plessis, Imran Tahir and Chris Morris". ESPN Cricinfo. Retrieved 9 September 2021.