ఢిల్లీ డేర్ డెవిల్స్

(ఢిల్లీ క్యాపిటల్స్ నుండి దారిమార్పు చెందింది)

ఢిల్లీ క్యాపిటల్స్ ఐపిఎల్ క్రికెట్ లీగ్‌లో ఢిల్లీ నగరానికి ప్రాతినిధ్యం వహించే జట్టు. 2008 లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌గా స్థాపించిన ఈ ఫ్రాంచైజీకి జిఎంఆర్ గ్రూప్, జెఎస్‌డబ్ల్యు గ్రూప్ లు సంయుక్తంగా స్వంతదార్లు . న్యూ ఢిల్లీలో ఉన్న అరుణ్ జైట్లీ స్టేడియం ఈ జట్టుకు సొంత మైదానం .

ఢిల్లీ క్యాపిటల్స్
Delhi Capitals Logo.png
సారధి: శ్రేయాస్ అయ్యర్
కోచ్: రికీ పాంటింగ్
అధ్యక్షుడు: పార్థ్ జిందల్
నగరం: ఢిల్లీ
స్థాపన: 2008 ఢిల్లీ డేర్ డెవిల్స్
స్వంత మైదానం: అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూ ఢిల్లీ
(Capacity: 41,820)
యజమాని: జిఎమ్‌ఆర్ గ్రూప్(50%)
జెఎస్‌డబ్ల్యూ గ్రూప్ (50%)[1]
అధికారిక అంతర్జాలం: delhicapitals.in

IPL ఫైనల్స్‌ లోకి ఎప్పుడూ వెళ్ళని ఏకైక జట్టు ఢిల్లీ క్యాపిటల్స్.[2] ఏడు సంవత్సరాలలో మొదటిసారి 2019 లో ఐపిఎల్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. [3] జట్టుకు అత్యధిక పరుగులు చేసింది వీరేందర్ సెహ్వాగ్, ఎక్కువ వికెట్లు సాధించింది అమిత్ మిశ్రా.

ఫ్రాంచైజ్ చరిత్ర

మార్చు
 
ఢిల్లీ డేర్ డెవిల్స్ మాజీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్

ఐపిఎల్ క్రికెట్ లీగ్‌ను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసిసిఐ) నిర్వహిస్తుంది. దీనికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) మద్దతు ఉంది. ప్రారంభ టోర్నమెంట్ ఏప్రిల్-2008 జూన్ లో జరిగింది. దీనిలో టోర్నమెంట్‌లో పాల్గొన్న ఎనిమిది జట్ల జాబితాను బిసిసిఐ ఖరారు చేసింది. ఈ ఎనిమిది జట్లు ఎనిమిది వేర్వేరు నగరాలకు ప్రాతినిధ్యం వహించాయి. వాటిలో ఢిల్లీ ఒకటి. 2008 ఫిబ్రవరి 20 న ముంబైలో జట్ల వేలం నిర్వహించారు. ఢిల్లీ జట్టును జిఎంఆర్ గ్రూప్ US $84 మిలియన్లకు కొనుగోలు చేసింది. [4]

2018 మార్చి లో, జిఎంఆర్ ఢిల్లీ డేర్డెవిల్స్ లో 50% వాటాను జెఎస్డబ్ల్యు సంస్థకు ₹ 550 కోట్లకు విక్రయించింది. [5]

2018 డిసెంబరు లో, జట్టు తన పేరును ఢిల్లీ డేర్ డెవిల్స్ నుండి ఢిల్లీ క్యాపిటల్స్ గా మార్చుకుంది. [6] జట్టు పేరును మార్చడం వెనుక ఉన్న హేతువు గురించి మాట్లాడుతూ, సహ యజమాని, చైర్మన్ పార్థ్ జిందాల్, "ఢిల్లీ దేశానికి శక్తి కేంద్రం, ఇది రాజధాని, అందుకే మా జట్టు పేరు ఢిల్లీ క్యాపిటల్స్" అని అన్నారు. [7] సహ యజమాని కిరణ్ కుమార్ గ్రంథి మాట్లాడుతూ, "కొత్త పేరు ఢిల్లీ యొక్క గుర్తింపును సూచిస్తుంది. ఆ నగరం వలెనే, మేము కూడా అన్నింటా కేంద్రంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాము." [8]

ఐపిఎల్ సీజన్లు, స్థానాలు

మార్చు

వివిధ సీజన్లలో ఢిల్లీ జట్టు పొందిన స్థానాలు ఇలా ఉన్నాయొ

సంవత్సరం లీగ్ టేబుల్ స్టాండింగ్ తుది స్థానం
2008 8 లో 4 వ స్థానం సెమీఫైనలిస్టులు (4 వ)
2009 8 లో 1 వ స్థానం సెమీఫైనలిస్టులు (3 వ)
2010 8 లో 5 వ 5 వ
2011 10 లో 10 వ 10 వ
2012 9 లో 1 వ స్థానం ప్లేఆఫ్‌లు (3 వ)
2013 9 లో 9 వ 9 వ
2014 8 లో 8 వ 8 వ
2015 8 లో 7 వ 7 వ
2016 8 లో 6 వ 6 వ
2017 8 లో 6 వ 6 వ
2018 8 లో 8 వ 8 వ
2019 8 లో 3 వ ప్లేఆఫ్‌లు (3 వ)

గణాంకాలు

మార్చు

గెలుపోటముల రికార్డు

మార్చు
సంవత్సరం ఆడినవి గెలుపు ఈటమి టైడ్ ఫలితం తేలనివి గెలుపు % స్వంత మైదానంలోగెలుపు % బయట గెలుపు % తటస్థ మైదానంలో గెలుపు % స్థానం
IPL 2008 15 7 7 - 1 50% 4/7 (1 NR) = 66.7% 3/7= 42.86% 0/1=0% Semifinalists
IPL 2009 15 10 5 - - 66.67% - - 10/15= 66.67% , Semifinalists
IPL 2010 14 7 7 - - 50% 3/7= 42.9% 4/7= 57.1% - League stage
IPL 2011 14 4 9 - 1 30.77% 1/7 (1 NR) = 16.7% 3/7= 42.9% - League stage
IPL 2012 18 11 7 - - 61.11% 5/8= 62.5% 6/9= 66.67% 0/1=0% League Stage Table Toppers, Playoffs
IPL 2013 16 3 13 - - 18.75% 3/8= 37.5% 0/8= 0% - League Stage
IPL 2014 14 2 12 - - 14.28% 0/5= 0% 0/4= 0% 2/5=40% League Stage
IPL 2015 14 5 8 - 1 35.70% 3/7= 42.9% 2/7 (1 NR) = 33.3% - League Stage
IPL 2016 14 7 7 - - 50% 4/7 =57.1 % 3/7= 42.9% - League Stage
IPL 2017 14 6 8 - - 42.85% 4/7 =57.1 % 2/7= 28.6% - League Stage
IPL 2018 14 5 9 - - 35.71% 4/7 =57.1 % 1/7 =14.3 % - League stage
IPL 2019 15 10 5 - - 64.27% 4/7 = 57.14% 5/7 = 71.43% - Semifinalist
Overall 176 76 96 - 3 43.93% 33/73 (2 NR) =45.21 % 25/74 (1 NR) = 33.78% 12/22= 54.54%


ముఖాముఖి

మార్చు
జట్లు మ్యాచ్లు గెలుపు కోల్పోయిన ఫలితం లేదు % గెలుపు
చెన్నై సూపర్ కింగ్స్ 19 6 13 - 31,57
డెక్కన్ ఛార్జర్స్ / సన్‌రైజర్స్ హైదరాబాద్ 25 12 13 - 48.00
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 24 10 14 - 41,66
కొచ్చి టస్కర్స్ కేరళ 2 1 1 - 50.00
కోల్‌కతా నైట్ రైడర్స్ 23 10 13 - 41,30
ముంబై ఇండియన్స్ 24 12 12 - 50.00
పూణే వారియర్స్ ఇండియా / రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ 9 4 4 1 44,44
రాజస్థాన్ రాయల్స్ 19 8 11 - 42,10
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 23 8 14 1 38,36
గుజరాత్ లయన్స్ 4 3 1 - 75,00

మూలాలు

మార్చు
  1. "We have pressed reboot button after coming as equal owners in Delhi Capitals: Parth Jindal". The Economic Times. 14 March 2019. Retrieved 25 December 2019.
  2. "IPL 2019: Young captain, young squad, chance for Delhi Capitals (DC) to break title jinx". 14 February 2019.
  3. "Twitter reacts after we qualify for the Playoffs after 7 years!". 30 April 2019.
  4. "IPL announces franchise owners". 24 January 2008. Retrieved 7 August 2019.
  5. "JSW Sports buys 50% stake in Delhi Daredevils". 9 March 2018. Retrieved 9 March 2018.
  6. "Delhi Daredevils renamed as Delhi Capitals". 4 December 2018.
  7. "Delhi Capitals IPL 2019: Retained, Released Players and Team News". 5 December 2018. Archived from the original on 6 డిసెంబరు 2018. Retrieved 27 జూన్ 2020.
  8. PTI (4 December 2018). "Delhi Daredevils is now Delhi Capitals". The Hindu. Retrieved 23 December 2018.