అపూర్వ రాగంగళ్

1975 తమిళ సినిమా

అపూర్వ రాగంగళ్ (తెలుగు: అపూర్వ రాగాలు) కె.బాలచందర్ దర్శకత్వంలో 1975లో విడుదలైన ఒక తమిళ సినిమా. ఈ చిత్రంలో కమల్ హాసన్, శ్రీవిద్య ప్రధాన పాత్రలను పోషించగా రజనీకాంత్ (తొలి సినిమా), జయసుధ, నగేష్, మేజర్ సుందరరాజన్‌లు సహాయ పాత్రలు ధరించారు. ఈ సినిమాను వి.గోవిందరాజన్, జె.దురైస్వామిలు కళాకేంద్ర మూవీస్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రానికి ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీత బాణీలను సమకూర్చగా కణ్ణదాసన్ పాటలకు సాహిత్యాన్ని అందించాడు.

అపూర్వ రాగంగళ్
దర్శకత్వంకె.బాలచందర్
రచనకె.బాలచందర్
నిర్మాతవి.గోవిందరాజన్
జె.దురైస్వామి
తారాగణంకమల్ హాసన్
మేజర్ సుందరరాజన్
శ్రీవిద్య
జయసుధ
నగేష్
రజనీకాంత్
ఛాయాగ్రహణంబి.ఎస్.లోకనాథన్
కూర్పుఎన్.ఆర్.కిట్టూ
సంగీతంఎం.ఎస్.విశ్వనాథన్
నిర్మాణ
సంస్థ
కళాకేంద్ర మూవీస్
పంపిణీదార్లుకళాకేంద్ర మూవీస్
విడుదల తేదీ
18 ఆగస్టు 1975
సినిమా నిడివి
146 నిమిషాలు[1]
దేశంభారతదేశం
భాషతమిళం

ఈ సినిమా కథ బేతాళ కథలలోని ఒక పొడుపు కథపై ఆధారపడినా 1973లో విడుదలైన 40 క్యారెట్స్ అనే అమెరికన్ సినిమా ప్రభావం ఈ చిత్రంపై ఉన్నట్టు బహుళ ప్రచారం జరిగింది. ఎక్కువ వయసు తేడా కలిగిన మనుషుల మధ్య లైంగిక సంబంధాల గురించి ఈ సినిమాలో చూపించడం ద్వారా భారతీయ సామాజిక కట్టుబాట్లను సవాలు చేసింది. ఆ విధంగా ఈ సినిమా విడుదల కాగానే వివాదాలకు దారితీసింది. ఈ సినిమాలో ప్రసన్న (కమల్ హాసన్) తన కన్నా వయసులో పెద్దదైన భైరవి (శ్రీవిద్య)ను ప్రేమిస్తాడు. ప్రసన్న తండ్రి భైరవి కూతురు రంజిని (జయసుధ)ను ప్రేమిస్తాడు. మిగతా సినిమా అంతా ఈ నలుగురి చుట్టూ, వారి సమస్యల చుట్టూ తిరుగుతుంది.

ఈ సినిమా 1975, ఆగష్టు 18న విడుదలయ్యింది. ఇది వాణిజ్య పరమైన విజయాన్ని సాధించడమే కాక విమర్శకుల ప్రశంసలను పొందింది. ఈ సినిమా మూడు జాతీయ చలనచిత్ర పురస్కారాలను, మూడు దక్షిణాది ఫిలిం ఫేర్ పురస్కారాలను కైవసం చేసుకుంది. ఈ సినిమా తరువాతి కాలంలో హిందీలో "ఏక్ నయీ పహెలీ" అనే పేరుతో, తెలుగులో తూర్పు పడమర పేరుతో పునర్మించబడింది.

ఇతివృత్తం

మార్చు

వీధి కొట్లాటలో దెబ్బలు తగిలిన ప్రసన్న (కమల్ హాసన్)కు శాస్త్రీయ గాయకురాలు భైరవి (శ్రీవిద్య) సపర్యలు చేసి అతని ఆరోగ్యం కోలుకొనేలా చేస్తుంది. ఆ ఇద్దరూ పరస్పరం ఆకర్షితులై ఒకరి నొకరు వివాహం చేసుకోవాలని అనుకుంటారు. భైరవి వయసులో పెద్దదైనా, ఆమెకు గతంలో మరొకరితో సంబంధం ఉన్నా, ఇంకా ఆ సంబంధం పూర్తిగా తెగతెంపులు కాకపోయినా ప్రసన్నకు అవి అడ్డం కాలేదు. అదే సమయంలో ప్రసన్న తండ్రి మహేంద్ర (మేజర్ సుందరరాజన్)కు వయసులో చాలా చిన్నదైన రంజిని (జయసుధ)తో సంబంధం ఏర్పడుతుంది. రంజిని భైరవికి వివాహం కాకుండానే జన్మించిన కూతురు అని తెలుస్తుంది. ఈ రెండు సంబంధాలు డైలమాలో ఉండగా అనుకోని మలుపు భైరవి మొగుడు పాండ్యన్ (రజనీకాంత్) రూపంలో ఎదురౌతుంది.

నటీనటులు

మార్చు

నిర్మాణం

మార్చు

మూలకథ

మార్చు

శ్రీలంక దినపత్రిక డైలీ న్యూస్ కథనం ప్రకారం కె.బాలచందర్ 40 క్యారెట్స్ అనే అమెరికన్ సినిమా 'చిత్రానువాదం'ను అపూర్వ రాగంగళ్ సినిమా కోసం స్వీకరించాడు. 1973లో విడుదలైన ఆ సినిమాకు మిల్టన్ కాట్సెలస్ దర్శకుడు. ఆ సినిమాలో ఆన్ స్టాన్లీ అనే వితంతువు తనకన్నా పిన్న వయస్కుడైన పీటర్ లాథమ్‌ను ప్రేమిస్తుంది.[3] భేతాళ కథలలోని ఒక చిక్కుముడి కథ ఈ సినిమా కథ తయారు చేయడానికి ఉపయోగపడిందని బాలచందర్ పేర్కొన్నాడు.[4] అయితే ఎన్.ఆర్.దాసన్ అనే రచయిత ఈ సినిమా కథ తనదిగా పేర్కొన్నాడు. [4]

ఈ వ్యవహారం మద్రాసు హై కోర్టులో విచారణకు వచ్చినప్పుడు కోర్టు కథ తనది అన్న దాసన్ వాదనను ఒప్పుకోలేదు. కాబట్టి ఈ కథ స్క్రిప్టు హక్కులను బాలచందర్‌కు అప్పగించింది. [4] వి.గోవిందరాజన్, జె.దురైస్వామి ఈ సినిమాను కళాకేంద్ర మూవీస్ బ్యానర్‌పై నిర్మించారు.[5] బి.ఎస్.లోకనాథ్ ఛాయాగ్రాహకుడిగా, ఎన్.ఆర్.కిట్టు ఎడిటర్‌గా, రామసామి కళాదర్శకుడిగా ఎంపిక చేయబడ్డారు.[6]

నటీనటుల ఎంపిక

మార్చు

అపూర్వ రాగంగళ్ కమల్ హాసన్‌కు హీరోగా బ్రేక్‌త్రూ ఇచ్చిన మొదటి సినిమా.[7] ఈ సినిమాలో ప్రసన్న పాత్ర కోసం కమల్ హాసన్ ఏడు నెలల పాటు మృదంగం నేర్చుకున్నాడు.[8] ఈ సినిమాలో ప్రసన్న పాత్ర కోసం మీసాలను చిన్నగా, జుట్టును పొడుగుగా పెంచుకున్నాడు. ఇంకా బెల్‌బాటం ప్యాంటులను, పోలో షర్టులను ధరించాడు.[9] శ్రీవిద్యను భైరవి పాత్ర కోసం ఎంపిక చేశారు.[10] జయసుధను శ్రీవిద్య కూతురు పాత్రకోసం ఎన్నుకున్నారు. గీత రచయిత కణ్ణదాసన్, నటుడు జైశంకర్‌లు వారి వారి పాత్రలలో నటించి తమదైన ముద్రను వేశారు.[11]

ఈ సినిమా ద్వారా రజనీకాంత్ సినీ రంగ ప్రవేశం చేశాడు. తరువాత దక్షిణాది సినిమా తారలలో అత్యంత విజయవంతమైన నటుడిగా ఎదిగాడు. రజనీకాంత్ మద్రాసులోని ఫిలిం ఛాంబర్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందే సమయంలో తన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్ పేరుతో పిలువబడేవాడు. ఒక నాటకంలో ఇతని నటన బాలచందర్‌ను ఆకట్టుకుంది.[12] మరుసటి రోజు బాలచందర్ గైక్వాడ్‌కు ఫోన్ చేసి తన తరువాతి సినిమా కోసం ఆడిషన్‌కు హాజరు కావలసినదిగా కోరాడు. ఆడిషన్ సమయంలో గైక్వాడ్ తన నటనా కౌశలాన్ని చాటడానికి శివాజీ గణేశన్ను అనుకరించి చూపాడు. కానీ బాలచందర్‌కు గైక్వాడ్ స్వంత ప్రతిభ కావాలి గాని ఇతరులను అనుకరించడం కాదు. రెండు రోజుల తర్వాత గైక్వాడ్‌ను మరో సారి ఆడిషన్‌కు పిలిచి నప్పుడు గైక్వాడ్ ఒక సిగరెట్టును చేతి నుండి గాలిలోకి ఎగురవేసి స్టైలుగా నోటిలో పడేటట్టు ప్రదర్శించాడు. ఇది బాలచందర్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇటువంటి విలక్షణమైన మేనరిజాన్ని అతడు ఇంతకు ముందు ఏ నటునిలోను చూసి ఉండలేదు.[13] బాలచందర్ గైక్వాడ్‌ను తమిళం మాట్లాడటం నేర్చుకోమని సలహా ఇచ్చాడు. దానిని అతడు వెంటనే పాటించాడు.[14][15]

గైక్వాడ్‌కు తెరపై కొత్తగా నామకరణం చేయాల్సి వచ్చినప్పుడు బాలచందర్‌ రజనీకాంత్, చంద్రకాంత్, శ్రీకాంత్ అనే పేర్లను పరిశీలించాడు.[16] చివరకు గైక్వాడ్‌కు రజనీకాంత్ అనే పేరును 1975 మార్చి 27న నిర్ధారించాడు.[16] ఈ సినిమాలో రజనీకాంత్ నటించింది చిన్న పాత్రే అయినా కీలకమైన పాండ్యన్, భైరవి భర్త పాత్ర కావడం గమనార్హం.[17]

చిత్రీకరణ

మార్చు

ఈ సినిమా మొదటిరోజు వి.జి.పి గోల్డన్ బీచ్‌లోని జీడిమామిడి తోటలలో "అతిశయ రాగం" పాటను చిత్రీకరించడంతో మొదలయ్యింది. ఈ పాట చిత్రీకరణలో కెమెరాను ట్రాక్‌ ఉపయోగించకుండా కెమెరామాన్ మోసుకుంటూ చిత్రీకరించాడు. ఈ విధంగా ట్రాక్ ఉపయోగించకుండా చిత్రీకరించిన మొదటి తమిళ సినిమా ఇది.[4] అపూర్వ రాగంగళ్ సెట్టింగులలో కాకుండా నిజమైన ఇళ్లలో షూట్ చేసిన మొదటి తమిళ సినిమా.[4] అంతే కాకుండా క్లైమాక్స్ సన్నివేశంలో పాట వున్న తొలి తమిళ సినిమా కూడా ఇదే. "కెల్వియిన్ నాయగనె" పాట క్లైమాక్సులో పెట్టడానికి కారణం ఆ సినిమాలోని పాత్రలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం ఆ పాటలో సూచనప్రాయంగా ఉండడమే.[18]

సంగీతం

మార్చు
Untitled

ఈ చిత్రానికి ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీత దర్శకత్వం వహించాడు. కణ్ణదాసన్ పాటలను రచించాడు.[20] ఈ సినిమా పాటలు సరిగమ సంస్థ వారిచే విడుదలయ్యాయి.[19] ఈ సినిమా పాటల వివరాలు ఇలా ఉన్నాయి.

సం.పాటగాయకులుపాట నిడివి
1."అతిశయ రాగం"కె. జె. ఏసుదాసు04:02
2."కై కొట్టి సిరిపార్గల్"సియాక్ మొహమ్మద్03:05
3."కెల్వియిన్ నాయగనే"వాణీ జయరాం
బి.ఎస్.శశిరేఖ
07:25
4."ఏళు స్వరంగలుక్కుళ్"వాణీ జయరాం06:08

విడుదల

మార్చు

చివరకు 3949 మీటర్లు (12956 అడుగులు) పొడుగున్న ఫిల్ముతో నిర్మించబడిన ఈ సినిమా 1975 ఆగష్టు 18వ తేదీన విడుదలయ్యింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయాన్ని సాధించింది. బెంగళూరులోని కపాలి థియేటర్‌లో ఈ సినిమా విడుదలైన రోజు రజనీకాంత్ తన మిత్రుడు రాజ బహద్దూర్‌తో కలిసి సినిమాను తిలకించాడు. అతడు ఆ సినిమాలో నటించినట్లు తోటి ప్రేక్షకులు ఎవరూ గుర్తుపట్టలేక పోయారు. సినిమా ముగిసిన వెంటనే బయటకు వచ్చిన రజనీకాంత్ వెండితెరపై తొలిసారి నటించినందుకు సంతోషం పట్టలేక ఏడ్చాడు.[21][22] ఈ సినిమా శతదినోత్సవ వేడుకల సందర్భంగా బాలచందర్ మద్రాసులో ఈ సినిమాకు పనిచేసిన నటీనటులను, సాంకేతిక నిపుణులను సత్కరించాడు.[21]

విమర్శకుల స్పందన

మార్చు

అపూర్వ రాగంగళ్ విమర్శకుల నుండి మంచి ప్రశంసలను అందుకుంది. ది హిందూ, ది టైమ్స్ ఆఫ్ ఇండియా, ఆనంద వికటన్ మొదలైన పత్రికలు ఈ సినిమాపై అనుకూలమైన సమీక్షలను ప్రచురించాయి.

పురస్కారాలు

మార్చు
23వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు
దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు
  • ఫిల్మ్‌ఫేర్ పురస్కారం - ఉత్తమ తమిళ సినిమా — పి.ఆర్.గోవిందరాజన్, జె.దొరైస్వామి
  • ఫిల్మ్‌ఫేర్ పురస్కారం - ఉత్తమ తమిళ దర్శకుడు — కె.బాలచందర్
  • ఫిల్మ్‌ఫేర్ పురస్కారం - ఉత్తమ తమిళ నటుడు — కమల్ హాసన్

పునర్నిర్మాణాలు

మార్చు

1976లో ఈ సినిమా తెలుగులో తూర్పు పడమర పేరుతో పునర్మించబడింది. ఆ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకత్వం చేపట్టగా మురళీమోహన్, నరసింహ రాజు ముఖ్యమైన పాత్రలను ధరించారు. శ్రీవిద్య తన పాత్రను నిలుపుకోగా, జయసుధ పాత్రను మాధవి ధరించింది.[23][24] 1984లో ఈ సినిమా కె.బాలచందర్ దర్శకత్వంలోనే ఏక్ నయీ పహెలి అనే పేరుతో హిందీలో పునర్మించబడింది. హిందీ సినిమాలో కూడా కమల్ హాసన్ తన పాత్రను కొనసాగించగా, రాజ్‌కుమార్, హేమా మాలిని, పద్మినీ కొల్హాపురిలు మిగిలిన ముఖ్య పాత్రలను ధరించారు.[25][26]

మూలాలు

మార్చు
  1. Rajadhyaksha & Willemen 1998, p. 422.
  2. మన తెలంగాణ, సినిమా (హరివిల్లు) (12 September 2018). "సినిమాలే నా జీవితం..!". manatelangana.news (in ఇంగ్లీష్). వి. భూమేశ్వర్. Archived from the original on 19 July 2020. Retrieved 19 July 2020.
  3. K. S. Sivakumaran (24 August 2011). "Hollywood inspires Kollywood". Daily News Sri Lanka. Archived from the original on 27 March 2015. Retrieved 20 December 2014.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 Dhananjayan 2011, p. 267.
  5. Dhananjayan 2011, p. 266.
  6. Apoorva Raagangal (Tamil) (Motion picture). India: Raj Video Vision. 27 September 2012. Clip from 00:01:00 to 00:06:55.
  7. "Kamal Hassan turns 60: From 'Chachi 420' to 'Viswaroopam', the actor has always been a master of disguise". CNN-IBN. Archived from the original on 18 ఏప్రిల్ 2015. Retrieved 6 మార్చి 2018.
  8. Baradwaj Rangan (21 August 2014). "'You can feel the fear in the song'". The Hindu. Archived from the original on 18 April 2015. Retrieved 18 April 2015.
  9. Southscope 2010, p. 51.
  10. Malathi Rangarajan (27 October 2006). "Subtle portraits, eloquent eyes". The Hindu. Archived from the original on 18 April 2015. Retrieved 20 December 2014.
  11. Dhananjayan 2014, p. 234.
  12. Manisha Lakhe (27 September 2010). "Why Rajinikanth Rocks". Forbes. Archived from the original on 27 మార్చి 2015. Retrieved 6 మార్చి 2018.
  13. Logesh Balachandran (22 August 2014). "39 years of Rajinikanth". Deccan Chronicle. Archived from the original on 18 April 2015. Retrieved 20 December 2014.
  14. N. S. Ramnath, Nilofer D'Souza (22 December 2010). "Rajinikanth: Who Really Is the Super Star?". Forbes. Archived from the original on 18 ఏప్రిల్ 2015. Retrieved 6 మార్చి 2018.
  15. Vinay Madhav (16 అక్టోబరు 2010). "To him, Rajini is still Shivaji". Times Crest. Archived from the original on 18 ఏప్రిల్ 2015. Retrieved 6 మార్చి 2018.
  16. 16.0 16.1 Srinivasa Ramanujam (6 March 2015). "Holi: The day Rajinikanth was 'born'". The Hindu. Archived from the original on 18 April 2015. Retrieved 18 April 2015.
  17. Naman Ramachandran (5 January 2014). "The Other Rajinikanth". The Pioneer. Archived from the original on 18 ఏప్రిల్ 2015. Retrieved 6 మార్చి 2018.
  18. Dhananjayan 2014, p. 235.
  19. 19.0 19.1 "Apoorva Raagangal Tracklist". Saregama. Archived from the original on 26 June 2015. Retrieved 26 June 2015.
  20. "Apoorva Raagangal Songs". raaga. Archived from the original on 3 ఆగస్టు 2014. Retrieved 6 మార్చి 2018.
  21. 21.0 21.1 "It was a small role, but people would remember him". The Hindu. 8 December 2012. Archived from the original on 18 April 2015. Retrieved 20 December 2014.
  22. Ramachandran 2014, p. 43.
  23. Dhananjayan 2011, p. 268.
  24. "K Balachandar - Telugu cinema real stars - Velugu Needalu by Srinivas Kanchibhotla". idlebrain. Archived from the original on 27 డిసెంబరు 2014. Retrieved 6 మార్చి 2018.
  25. Naman Ramachandran (13 July 2009). "Up To All Coquetry". Outlook. Archived from the original on 20 December 2014. Retrieved 20 December 2014.
  26. "10v.v.ramanan". The Hindu. 19 June 2011. Retrieved 20 December 2014.

గ్రంథసూచి

మార్చు

బయటిలింకులు

మార్చు