అభిషేక్ సింఘ్వీ

అభిషేక్ మను సింఘ్వీ (జననం 24 ఫిబ్రవరి 1959) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2006 నుండి రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుండి కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు.

అభిషేక్ సింఘ్వీ
అభిషేక్ సింఘ్వీ


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024
నియోజకవర్గం హిమాచల్ ప్రదేశ్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
3 ఏప్రిల్ 2018
అధ్యక్షుడు *రామ్‌నాథ్ కోవింద్
ముందు తపన్ కుమార్ సేన్ (సీపీఎం)
నియోజకవర్గం పశ్చిమ బెంగాల్
పదవీ కాలం
3 ఏప్రిల్ 2006 – 2 ఏప్రిల్ 2018
ముందు రామ్ జెఠ్మలానీ
తరువాత మదన్ లాల్ సైనీ (బీజేపీ)
నియోజకవర్గం రాజస్థాన్

వ్యక్తిగత వివరాలు

జననం (1959-02-24) 1959 ఫిబ్రవరి 24 (వయసు 65)
జోధ్‌పూర్, రాజస్థాన్‌, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
తల్లిదండ్రులు కమల, లక్ష్మీ మాల్ సింఘ్వీ
జీవిత భాగస్వామి అనితా సింఘ్వి
సంతానం 2
పూర్వ విద్యార్థి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ (బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్), ట్రినిటీ కాలేజ్, కేంబ్రిడ్జ్ (ఎం.ఏ, పీహెచ్‌డీ), హార్వర్డ్ విశ్వవిద్యాలయం (ప్రజా ప్రయోజన చట్టం)
వృత్తి న్యాయవాది

జననం, విద్యాభాస్యం

మార్చు

అభిషేక్ సింఘ్వీ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో కమల, లక్ష్మీ మాల్ సింఘ్వీ దంపతులకు 1959 ఫిబ్రవరి 24న జన్మించాడు. ఆయన సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, యూకే నుండి ఏం,ఏ.. పీహెచ్‌డీ చేశాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు

అభిషేక్ సింఘ్వీ గజల్, సూఫీ గాయని అనితా సింఘ్విని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమారులు, అనుభవ్ (జననం 1 డిసెంబర్ 1984), ఆవిష్కర్ (జననం 12 అక్టోబర్ 1987) ఉన్నారు.

రాజకీయ జీవితం

మార్చు

అభిషేక్ సింఘ్వీ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1997 నుండి 1998 వరకు భారత అదనపు సొలిసిటర్ జనరల్‌గా[1], 2001 నుండి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పని చేసి ఏప్రిల్ 2006 రాజ్యసభకు ఎన్నికయ్యాడు.

నిర్వహించిన పదవులు

మార్చు
  • 2009 ఆగస్టు -జూలై 2011 , పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్ సభ్యుడు.
  • 2006 ఆగస్టు – 2007 సెప్టెంబర్ సభ్యుడు, లాభాపేక్ష సభ్యుని కార్యాలయాలపై జాయింట్ కమిటీ, లాభాపేక్ష సభ్యుని కార్యాలయానికి సంబంధించిన రాజ్యాంగ, చట్టపరమైన స్థితిని పరిశీలించడానికి జాయింట్ కమిటీ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కోసం కన్సల్టేటివ్ కమిటీ .
  • 2006 – సెప్టెంబరు 2010 , ప్రివిలేజెస్ కమిటీ సభ్యుడు
  • జూలై 2010 నుండి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోసం కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
  • జూలై 2011 నుండి చైర్మన్, పర్సనల్ కమిటీ, పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్ మెంబర్, జనరల్ పర్పస్ కమిటీ సభ్యుడు.
  • జూలై 2012 నుంచి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి.[2]
  • ఏప్రిల్ 2018 పశ్చిమ బెంగాల్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యాడు.
  • వాణిజ్యంపై స్టాండింగ్ కమిటీ ఛైర్మన్[3]
  • ఏప్రిల్ 2024 హిమాచల్ ప్రదేశ్ నుండి రాజ్యసభకు పోటీ చేసి ఓడిపోయాడు.[4][5][6][7]
  • 2024 ఆగష్టు తెలంగాణ నుండి రాజ్యసభకు పోటీ[8]

మూలాలు

మార్చు
  1. Mahapatra, Dhananjay (9 January 2010). "India's top 10 lawyers". The Times of India. Retrieved 4 April 2017.
  2. "Abhishek Singhvi back as Congress spokesperson". News18. 2 November 2012. Retrieved 24 April 2020.
  3. "Abhishek Singhvi to head parliamentary panel on commerce". The Hindu. 6 October 2022. Archived from the original on 14 February 2024. Retrieved 14 February 2024.
  4. "Cong fields Abhishek Singhvi for RS polls from Himachal". The Week. 14 February 2024. Archived from the original on 14 February 2024. Retrieved 14 February 2024. {{cite magazine}}: Unknown parameter |agency= ignored (help)
  5. The Week. "Cong fields Abhishek Singhvi for RS polls from Himachal" (in ఇంగ్లీష్). Archived from the original on 14 February 2024. Retrieved 14 February 2024.
  6. Andhrajyothy (14 February 2024). "రాజ్యసభ అభ్యర్థుల లిస్ట్‌ను అఫీషియల్‌గా ప్రకటించిన కాంగ్రెస్". Archived from the original on 14 February 2024. Retrieved 14 February 2024.
  7. Andhrajyothy (28 February 2024). "రాజ్యసభ ఎన్నికల్లో హైడ్రామా!". Archived from the original on 28 February 2024. Retrieved 28 February 2024.
  8. Andhrajyothy (19 August 2024). "కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వీ నామినేషన్". Archived from the original on 19 August 2024. Retrieved 19 August 2024.