అమ్మని గుడిపాడు

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం లోని గ్రామం

అమాని గుడిపాడు ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన యర్రగొండపాలెం నుండి 30 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మార్కాపురం నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1452 ఇళ్లతో, 6524 జనాభాతో 3556 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3334, ఆడవారి సంఖ్య 3190. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2069 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 54. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590536[2].

అమ్మని గుడిపాడు
పటం
అమ్మని గుడిపాడు is located in ఆంధ్రప్రదేశ్
అమ్మని గుడిపాడు
అమ్మని గుడిపాడు
అక్షాంశ రేఖాంశాలు: 15°56′52.980″N 79°16′33.924″E / 15.94805000°N 79.27609000°E / 15.94805000; 79.27609000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంయర్రగొండపాలెం
విస్తీర్ణం35.56 కి.మీ2 (13.73 చ. మై)
జనాభా
 (2011)[1]
6,524
 • జనసాంద్రత180/కి.మీ2 (480/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు3,334
 • స్త్రీలు3,190
 • లింగ నిష్పత్తి957
 • నివాసాలు1,452
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523330
2011 జనగణన కోడ్590536

గణాంకాలు

మార్చు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5918. ఇందులో పురుషుల సంఖ్య 3026, మహిళల సంఖ్య 2892, గ్రామంలో నివాస గృహాలు 1177 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 3556 హెక్టారులు.ప్రాంతీయ భాష తెలుగు.

సమీప గ్రామాలు

మార్చు

గుర్రపుసాల 8 కి.మీ, బోయదగుంపల 9 కి.మీ, గొళ్లవిడిపి 11 కి.మీ, దూపాడు 12 కి.మీ, గంగపాలెం 12 కి.మీ.

గ్రామ చరిత్ర

మార్చు

'అమాని' అనుపదంనకు అర్థం "గుత్తకివ్వక దివాణపు విచారణ కింద ఉండేవి" అని తెలుపుతుంది. ఈ గ్రామమును, పెద్దగుడిపాడు, రామలింగాపురం అని కూడా పూర్వం నుండి పిలువబడుతుంది. మార్కాపురానికి దగ్గరి గ్రామం. మార్కాపురం, యర్రగొండపాలెం మధ్యగల కుంట నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలోకలదు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన గొడ్రాలికొండకు ఉత్తరభాగంలో ఉంటుంది. ఈ గ్రామం వ్యవసాయాధారిత మైంది. గ్రామీణ బ్యాంకు ఉంది. ఈగ్రామం పూర్వపు దూపాటి సీమలోకలదు.ఇది యర్రగొండపాలెం మండలంలో.

చారిత్రక ఆధారాలు

మార్చు

మొదటగా గుడిపాడు గురించి మనకు కొచ్చెర్లకోటలోని సా.శ.1309 సంవత్సరంనాటి వీరన్నబావివద్దగల శాసనంద్వారా తెలుస్తుంది. ఈ శాసనాన్ని కాకతీయ ప్రతాపరుద్రమహారాజు పాలనలో వెలనాడును పాలిస్తున్న,మాచయనాయకుని కుమారుడు దేవెరి నాయనిం లిఖించారు. ఇతను అక్కడ గౌరీశ్వర, సోమేశ్వర, మహాదేవర అనే త్రికూట ఆలయాల్ని నిర్మించి 'అడవిగుడిపాటి' లోని నీరునేలను దేవరాయుడు రామయ్య అనే అతని ద్వారా స్వామివార్ల అమృతపాళ్ళకు దానంచేసి ఆచంద్రతారార్కం ఈ సేవజరుగు విధంగా శాసనం వేయించారు.

దూపాటి కైఫీయత్ (శాయపనేనివారిచరిత్ర) ప్రకారం శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలంలో (1514)

కృష్ణాతీరంనుండి పొత్తూరు అనే గ్రామంనుండి శాయప్పనాయుడనే కమ్మ యువకుడు రాయలవారిని దర్శించుకున్నాడు. అతని ముఖవర్చస్సుచూసి రాయలవారు శ్రీశైలపర్వతానికి తూర్పుదిక్కున పదహారుక్రోసులమీదను దూపాటి సీమలోని గుడిపాడుగ్రామాన్ని అమరంగా ఇచ్చి తనకొలువులో ఉద్యోగిగా నియమించుకున్నాడు. అలా అమరంపొందినందున నాటినుండి అమానిగుడిపాడు అయింది.దగ్గరలో దోర్నాలమండలంలో మరోగుడిపాడు ఉండటంతో దీనిని పెద్దగుడిపాడు అనేవారు.అలాగే అడవిప్రాంతంలో ఉండటంవల్ల ఈ గ్రామాన్ని "అడవిగుడిపాడు" అని కూడా అంటారు.ఆశాయప్పనాయుడు అను అతను ఈ గుడిపాడులోనే సంసారం ఉంటూ రాయలకొలువులో ఉద్యోగంచేసేవాడు. క్రీ.శ.1465 శాయప్పనాయుని మరణంతర్వాత అతనికుమారుడగు వెంగళనాయుడు కూడా అమానిగుడిపాడునందే నివశించెను. శ్రీకృష్ణదేవరాయల మరణంతర్వాత వారి అల్లుళ్ళు అయిన తిరుమలరాయలు, రామరాయలు పాలించెను. వీరికాలంలోకూడా వెంగళనాయుడు దూపాటి సీమను అమానీ చేస్తూ గుడిపాడులోనే నివశించెను.తర్వాత వీరికుమారుడు వెంకటాద్రినాయనింగారు కూడా క్రీ.శ.1554 న గుడిపాడునందు మరణించెను. వీరికుమారుడు శాయప్ప నాయుడు (రంగప్పనాయుడు) లేదా చిన్న శాయప్పనాయుడు కాలమంతయు గుడిపాటినుండే పాలన సాగించెను. తర్వాత వీరి కుమారుడు వెంకటాద్రినాయుడు క్రీ.శ.1611 సంవత్సరంలో "దద్దనాల" అనుకోట నిర్మించుకొని తనపాలనాకేంద్రాన్ని అమానిగుడిపాడు నుండి అరణ్యప్రాంతంలో తను నిర్మించుకొన్న దద్దనాల పట్టణానికి మార్చుకున్నాడు.అంటె షుమారు 200 సంవత్సరాలపాటు అమానిగుడిపాడు దూపాటి సీమను పాలించిన శాయపనేని వంశస్థుల రాజధానిగా విలసిల్లింది.

నేడు కన్పడుతున్న శిధిల ఆధారాలు:--

ఈ గ్రామంలో పురాతనమైన వేణుగోపాల స్వామివారి దేవాలయం కలదు.దీనియందు వేణుగోపాలస్వామి వారిని ప్రతిష్టించి యుండలేదు. దేవాలయనిర్మాణానంతరం స్వామివారిప్రతిష్ట చేయాలని అనుకున్నప్పుడ, ఎదురుగాఉన్న కొన్నిఇళ్ళు అగ్నికి ఆహుతయ్యాయట. అప్పటినుండి విగ్రహం ప్రతిష్టలేక అలానే ఉంది.కొద్దికాలంక్రితం, ముక్కలైన స్వామివారి మూలవిరాట్ ను శ్రీశైలంలోని పాతాలగంగలో కలిపినారు.అంతరాలయంలోనే అమ్మవారి గుడికూడా ఉంది. ఇక్కడకూడా ప్రతిష్టించిన మూర్తిలేదు.నేడు పూర్తి శిధిలావస్తకు చేరియున్నది.ప్రధాన గర్భాలయంనందు పీఠము కలదు. ద్వారము పైన గజబంధనము చిత్రించబడి యున్నది. గజలక్ష్మి,కుచబంధం 16 వ శతాబ్ధానికి చెందినదిగా గుర్తింపబడింది.

దేవాలయం గోపురం ‘ఫంసానా’ శైలి విమానం కలిగియున్నదని ప్రొ.హరగోపాల్ గారు తెలిపియున్నారు.లోపల ఉన్న అధిష్టానపీఠం 11,12 శతాబ్ధాలకు చెందినదైయున్నది.ఈ గుడిచుట్టూ ‘చతుర్ధళ పుష్పాలు’ ‘భారవాహకుడు’ సూర్యగ్రహణం’ చంద్రగ్రహణం,అభిషేకజలాలు పోయే ప్రణాళి, ఏనుగులు, తాబేళ్ళు, చేపలు, భీముడు, పురుషమృగం, మొదలగు శిల్పములు ఉన్నవి. యాళీశిల్పం కూడా కలదు.ఈ ఆలయాన్ని ఎరుపురంగు ఇసుకరాతి ఇటుకలతో నిర్మించారు.బయటిగోడల పెద్దపెద్ద బండలు కొన్ని ఊడిపోయి ఉన్నాయి. దేవాలయం ఎదురుగాగల రామలింగేశ్వరాలయం వెంబడిగల నీళ్ళ ట్యాంకు వద్ద ఒక నందిశాసనం కలదు.దీనిపై సూర్యుడు,చంద్రుడు గుర్తులు మాత్రమే కనబడుతున్నవి.అక్షరములు పూర్తిగా శిధిలమైనవి. మరొకశాసనం దేవాలయం వెనుకవైపు ఉన్నదని, ఇక్కడ సచివాలయ నిర్మాణ సమయంలో పునాదులలో కలిసిపోయినదని గ్రామస్తులు తెలిపియున్నారు. దీనివల్ల చరిత్ర కనుమరుగవుచున్నది. మరొక ఆలయమైన రామలింగేశ్వర ఆలయం శిధిలమవగా,తిరిగి పునఃనిర్మాణము జరుగినది.

ఈ రామలింగేశ్వరస్వామిదేవాలయం వల్లనే ఈ గ్రామానికి పూర్వమునుంచి రామలింగాపురమని నామమేర్పడినది.రాజులకాలంనుండీ ఉన్న ఈ గ్రామం చాలా పురాతనమైనది. శివాలయానికి ఉత్తరంవైపు చిన్నకోనేరు ఉన్నది.ఈ శివాలయంలో పురాతన విగ్రహములు కలవు. జీర్ణమైన రామలింగేశ్వరుని విగ్రహాన్ని కూడా పాతాళగంగలో కలిపి నూతన స్వయంభూ లింగాన్ని ప్రతిష్టచేశారు. ఊరువెంబడి చేలో చండీ దేవత విగ్రహం చెట్టుకు ఆనించి ఉన్నది.దొంగలు శివాలయంలోని విగ్రహాన్ని తస్కరించి తీసుకొనిపోతూ బరువెక్కిన శిలామూర్తిని పొలములో వదిలేసి ఉంటారు. చెరువుకట్టపైన మహిమోపేతమైన చామరకర్ణ గణపతి విగ్రహంకలదు.ఈ మూర్తి పదమూడవశతాబ్ధానికి చెందినది.ఏలాంటి ఆచ్ఛాదనలేక గట్టుపై నిలబెట్టబడియున్నది.ప్రక్కనే త్రిపురసుందరీమాత విగ్రహంకలదు.అలానే చెరువుకట్టమీద చెంచులక్ష్మీసమేత నరసింహస్వామివారి దేవాలయంకలదు.

ఈ గ్రామంలో గంగబోడు అనే ప్రాంతంలో గంగమ్మ గుడికలదు.ఆంజనేయస్వామివారి గుడులు చాలా ఉన్నాయి. ఇదొక విచిత్రమైన గ్రామంగా నిలచినది. ఎందుకనగా ప్రతిగ్రామం నిర్మాణ సమయంలో బొడ్డురాయి ప్రతిష్ట జరుగుతుంది. కానీ ఈ గ్రామమునకు బొడ్డురాయి ఎక్కడ ఉన్నదో తెలియ రాకున్నది.

అలాగే పన్నెండవ శతాబ్ధపు వీరగల్లులు కూడి కలవు.దీనిని వీరు అరుగుపై ప్రతిష్టించి ఆరాధన చేయుచున్నారు. వినుకొండ సీమ దండకవిలెనందు క్షయ (క్రీ.శ1686) ప్రభవ(క్రీ.శ.1687)న మహాక్షామము ఏర్పడినదట. అప్పుడు, గుట్లపల్లి, తెల్లపాడు ప్రతినామమైన వెంకనపాలెం, పలుకూరు,జువ్వన వెలిగండ్ల,గంగుపల్లి ఈ అయిదు గ్రామాల కరణీకం పూర్వ రాచకరణాలైన దేచిరాజువారి వల్ల క్రయదత్తిగా అశ్వలాయనులైన కరణకకమ్మలు భారద్వాజగోత్రులు, నందవరీకులు నందిగామవారికి వాదికి భోగం చల్లుతువుండగా వారికి కొందరు దౌహిత్రులులైన మానూరు అయ్యపరాజుకు గౌతమసగోత్రునికి సగభాగం దౌహిత్రులు యిచ్చిరి. గనుక అనుభవింస్తూ వుండగాను నందిగామవారు కొందఱు నడవనీయమని వ్యాజ్యం వేసిరి. ఒకసారి కొణిదేనకున్నూ, ఒకసారి గోకనకొండకున్నూ తగువుకు పోయి నందిగామవారు హీనవాదులైరి. గనుక జయ లేఖలు కట్టుకొని పెనమనూరివారు, నందిగామ పొలం సమాంశముగా అనుభవిస్తూవుండిరి. ఇంతట క్షయ (క్రీ.శ. 1686), ప్రభవ (క్రీ.శ. 1687) ల మహా క్షామమందు నందిగామవారు విదేశగతులైనవారు. దేఖీలునను సరించిరి. వారికి బహుదూర జ్ఞాతులు దూపాటి సీమలో గుడిపాటిలో వున్నారు. అని వ్రాయబడింది. (ఆధారాలు- దూపాటి కైఫియత్, కవి రాధాకృష్ణమూర్తి, తురిమెళ్ళ శ్రీనివాస ప్రసాద్ (గ్రామాల చరిత్ర), మణిమేల శివశంకర్ రాసిన గ్రంధాల నుండి సేకరించిన సమాచారం.)

విద్యా సౌకర్యాలు

మార్చు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి యర్రగొండపాలెంలో ఉంది. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల యర్రగొండపాలెంలోను, ఇంజనీరింగ్ కళాశాల మార్కాపురంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు మార్కాపురంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల బోయలపల్లిలోను, అనియత విద్యా కేంద్రం యర్రగొండపాలెంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఒంగోలు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మార్చు

అమ్మని గుడిపాడులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

మార్చు

గ్రామంలో 2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఇద్దరు నాటు వైద్యులు ఉన్నారు.

తాగు నీరు

మార్చు

గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

మార్చు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

మార్చు

అమ్మని గుడిపాడులో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో వాణిజ్య బ్యాంకు ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

గ్రామంలో ఇతర పోషకాహార కేంద్రాలు ఉంది. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆశా కార్యకర్త గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

మార్చు

అమ్మని గుడిపాడులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 319 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 597 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 282 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 76 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 91 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 229 హెక్టార్లు
  • బంజరు భూమి: 752 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1206 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 1297 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 891 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

మార్చు

అమ్మని గుడిపాడులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 891 హెక్టార్లు

ఉత్పత్తి

మార్చు

అమ్మని గుడిపాడులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

మార్చు

వరి, జొన్న

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు

మార్చు
  • గ్రామం చరిత్ర గురించి అన్నపురెడ్డి వీరారెడ్డి రాసిన మన ఊర్ల కధలు అనే పుస్తకం నుండి సేకరించిబడింది.