అమ్మాయి బాగుంది

అమ్మాయి బాగుంది బాలశేఖరన్ దర్శకత్వంలో 2004 లో విడుదలైన చిత్రం.[1] ఇందులో శివాజీ, మీరా జాస్మిన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను డేగా ఆర్ట్స్ పతాకంపై డేగా దేవకుమార్ రెడ్డి నిర్మించాడు. శ్రీలేఖ సంగీత దర్శకత్వం వహించింది. ఈ సినిమా మంజుపెయ్యుం మునుప్పె అనే పేరుతో మలయాళంలోకి అనువదించారు.

అమ్మాయి బాగుంది
దర్శకత్వంబాలశేఖరన్
నిర్మాతడేగా దేవకుమార్ రెడ్డి
నటవర్గంశివాజీ ,
మీరా జాస్మిన్,
కూర్పుకె. రమేష్
సంగీతంశ్రీలేఖ
విడుదల తేదీలు
2004 జూలై 16 (2004-07-16)
దేశంభారత దేశము
భాషతెలుగు

కథసవరించు

శివ మార్కెటింక్ ఎక్జిక్యూటివ్ గా పనిచేస్తుంటాడు. అతనికి స్నేహితులతో కలిసి సమయం గడపటమంటే ఇష్టం. శివ తల్లిదండ్రులు అతనికోసం సంబంధాలు చూస్తుంటారు. కానీ అతనికి పెద్దలు కుదిర్చిన వివాహం అంటే ఇష్టం లేక తనకిష్టమైన అమ్మాయిని వెతికి ప్రేమించి పెళ్ళిచేసుకోవాలనుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఒకమ్మాయిని చూసి వెంటనే ఇష్టపడతాడు. ఆమెతో పరిచయం పెంచుకుని, ఆమె ఇష్టాయిష్టాలు తెలుసుకుని ప్రేమించడం మొదలుపెడతాడు.

ఈ లోపు అతని తల్లిదండ్రులు ఒక ధనవంతుడైన కాంట్రాక్టరు కూతురితో పెళ్ళి చూపులు ఏర్పాటు చేస్తారు. అయిష్టంగానే ఆ పెళ్ళిచూపులకు వెళ్ళిన శివకు అక్కడ తన ప్రేమించిన అమ్మాయే పెళ్ళికూతురిగా కనిపించడంతో సంతోషంగా పెళ్ళికి ఒప్పుకుంటాడు. ఆ అమ్మాయి పేరు సత్య. వాళ్ళిద్దరికీ పెళ్ళి జరుగుతుంది. కానీ తాను అంతకు ముందు చూసిన స్థలంలో సత్య పోలికలతో ఉన్న వేరే అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి పేరు జనని అనీ, తాను సత్యను జనని అని పొరబాటు పడి పెళ్ళిచేసుకున్నానని తెలుస్తుంది శివకి. అప్పటి నుండి శివ తన భార్య సత్యకి దూరంగా ఉంటాడు. కానీ అతని స్నేహితుడు దస్తగరి సలహాతో జననిని మరిచిపోయి మళ్ళీ సత్యతో ప్రేమగా ఉంటాడు. ఈలోపు జనని వారింటికి ఎదురుగా దిగుతుంది. సత్య, జనని స్నేహితులవుతారు. శివ మళ్ళీ జననివైపు మళ్ళడం గమనిస్తాడు దస్తగిరి. పెళ్ళికి ముందు జరిగిన విషయం జననికి చెప్పి ఆమెను అక్కడినుంచి వెళ్ళిపోమని చెప్పబోయి పొరపాటున సత్యకు చెబుతాడు దస్తగిరి. దాంతో ఆమె అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుంది. కానీ తల్లిదండ్రుల దగ్గర మాత్రం భర్తను సపోర్టు చేస్తుంది.

జనని శివను ఓ గుడి దగ్గరకు రమ్మని మాట్లాడాలని చెబుతుంది. అతను వచ్చిన తర్వాత తన ప్రేమ గురించి అడుగుతుంది. శివ అంతకు ముందు జరిగిన దానిని గురించి బాధ పడుతున్నాననీ, ఇప్పుడు తన భార్య సత్యనే మనసారా ప్రేమిస్తున్నాని చెబుతాడు. దాంతో జననిలా ఉన్న సత్య తన భర్త తనను నిజంగా ప్రేమిస్తున్నాడని తెలుసుకుని ఇద్దరూ ఒకటవుతారు. ఇలా ఏర్పాటు చేసిన జనని వారిద్దరి నుండి దూరంగా వెళ్ళిపోతుంది.

 
మీరా జాస్మీన్

తారాగణంసవరించు

మూలాలుసవరించు

  1. "Telugu cinema Review - Ammayi Bagundi - Sivaji, Meera Jasmine - Bala Sekharan". www.idlebrain.com. Retrieved 2020-06-23.