అమ్మో ఒకటోతారీఖు
అమ్మో ఒకటోతారీఖు ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో 2000 వ సంవత్సరంలో విడుదలైన తెలుగు చిత్రం.[1] ఇందులో ఎల్. బి. శ్రీరామ్, శ్రీకాంత్, రాశి, ప్రేమ, సురేష్ ముఖ్య పాత్రల్లో నటించారు. కోటి ఈ చిత్రానికి సంగీతాన్నందించాడు. మధ్యతరగతి బ్రతుకులు పేదరికం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాయో చూపించే చిత్రం ఇది.[2]
అమ్మో ఒకటోతారీఖు | |
---|---|
![]() | |
దర్శకత్వం | ఇ.వి.వి.సత్యనారాయణ |
నటవర్గం | ఎల్. బి. శ్రీరాం, సురేష్, మేకా శ్రీకాంత్, ప్రేమ |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
నిర్మాణ సంస్థ | ఎ.ఎ.ఆర్ట్స్ |
విడుదల తేదీలు | 2000 |
భాష | తెలుగు |
కథసవరించు
గోవిందరావు ఆర్టీసీలో డ్రైవరుగా పనిచేస్తుంటాడు. కుటుంబం పెద్దది. నెలజీతం చేతికొచ్చేలోపే ఆవిరైపోతుంటుంది. కొడుకు కిరణ్ చదువు పూర్తి చేసినా ఉద్యోగం లేకుండా తిరుగుతుంటాడు. గోవిందరావు రెండవ కుమార్తె గాయత్రి కూడా చిన్న ఉద్యోగం చేస్తూ తండ్రికి అండగా ఉంటుంది. గోవిందరావుతో పాటు కండక్టరుగా పనిచేస్తుంటాడు పట్టాభి. అతనిది మంచి మనసు. అతని తండ్రి రిక్షా తొక్కుతుంటాడు. అయినా సరే గోవిందరావుకి అవసరానికి ఏమైనా సహాయం చేస్తుంటాడు. కిరణ్ ఉద్యోగం చేయకుండా మంచి ఆస్తి ఉన్న అమ్మాయిని పెళ్ళిచేసుకుంటే జీవితంలో స్థిరపడిపోవచ్చని అనుకుంటూ ఉంటాడు. దానికి తగ్గట్టే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు కానీ ఆ అమ్మాయి పేద అమ్మాయేనని తెలుస్తుంది. మరోవైపు గాయత్రి పట్టాభిని ప్రేమిస్తుంది. వారి వివాహానికి కిరణ్ అంగీకరించడు. గాయత్రి అందుకోసం అన్నను ఎదిరిస్తుంది.
నటవర్గంసవరించు
- గోవిందరావుగా ఎల్. బి. శ్రీరాం
- గోవిందరావు కొడుకు కిరణ్ గా సురేష్
- పట్టాభిగా మేకా శ్రీకాంత్
- గోవిందరావు మొదటి కూతురు ధనలక్ష్మిగా ప్రేమ
- గోవిందరావు కూతురు గాయత్రిగా రాశి
- గోవిందరావు తండ్రి ఆంజనేయులుగా కోట శ్రీనివాసరావు
- పట్టాభి తండ్రిగా చలపతి రావు
- గోవిందరావు భార్య సౌభాగ్యంగా అలపాటి లక్ష్మి
- డబ్బింగ్ జానకి
- గిరీశంగా తనికెళ్ళ భరణి
- క్రాంతిగా మల్లికార్జునరావు
- జమదగ్నిగా ఆలీ
- బ్రహ్మానందం
- ఎం. ఎస్. నారాయణ
- దేవదాస్ కనకాల
సాంకేతికవర్గంసవరించు
పాటలుసవరించు
ఈ చిత్రంలోని పాటలకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతం సమకూర్చాడు.[3]
పాట | సంగీత దర్శకుడు(లు) | గాయకులు | |
---|---|---|---|
" నవ్వుకో పిచ్చి నాయనా " | వందేమాతరం శ్రీనివాస్ | సిరివెన్నెల | మనో, ఎల్.బి.శ్రీరామ్, సురేష్, బృందం |
" సగటు మనిషి బ్రతుకంతా కన్నీటి ఎదురీత" | కె. జె. ఏసుదాసు | ||
" అమృత కడలే నీ దిక్కు" | సి.విజయకుమార్ | సుఖ్వీందర్ సింగ్, సాధనా సర్గమ్ బృందం | |
" నీ ఆకుపచ్చ కోకమీద బుల్ బుల్ తార " | భువనచంద్ర | ఉదిత్ నారాయణ్, మహాలక్ష్మి | |
" ప్రేయసీ యు టెల్ మి టెల్ మి ఐ లవ్ యూ " | సోను నిగమ్, సునీత బృందం |
మూలాలుసవరించు
- ↑ "Ammo Okato Tariku on Moviebuff.com". Moviebuff.com. Retrieved 2020-06-23.
- ↑ "Ammo Okato Tareeku Review". fullhyd.com. Archived from the original on 2020-06-24.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "అమ్మో ఒకటోతారీఖు - 2000". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.