అరియాలూర్ జిల్లా
అరియలూర్ జిల్లా, తమిళనాడు జిల్లాలలో ఒకటి.[2] అరియలూరులో జిల్లా ప్రధానకార్యాలయాలు ఉన్నాయి. జిల్లా వైశాల్యం 1,949.31 చదరపు కిలోమీటర్లు. అలాగే 2011 గణాంకాలను అనుసరించి జనసంఖ్య 7,52,481. 2001 జనవరి 1 ద్రావిడ మున్నేట్ర కళగం ప్రభుత్వం పెరంబలూరు జిల్లా నుండి అరియాలూరును వేరుచేసి జిల్లాగా రూపొందించబడింది. అయినప్పటికీ 2002లో మార్చి 31 లో తిరిగి ఆల్ ఇండియా అణ్ణా ద్రావిడ మున్నేట్ర కళగం ప్రభుత్వకాలంలో ఆర్థికపరిస్థితితులను కారణం చూపుతూ దానిని తిరిగి పెరంబలూరుతో మిళితం చేయబడింది. 2007 నవంబరు 23న తిరిగి జిల్లాగా అవతరించింది. అప్పటి తమిళనాడు " రూరల్ డెవలప్మెంట్ & లోకల్ అడ్మినిస్ట్రేషన్ " మంత్రి అయిన " ఎం.కె స్టాలిన్ ఆధ్వర్యంలో అరియలూరు " ఐ.టి.ఐ ప్లేగ్రౌండ్ " లో ప్రారంభోత్సవ ఉత్సవం జరిగింది. అరియకూరు జిల్లాకు జిల్లా ఉత్తర , ఈశాన్య సరిహద్దులలో కడలూరుజిల్లా ఉంది. తూర్పు సరి హద్దులలో నాగపట్టినం జిల్లా ఉంది. అలాగే దక్షిణ , ఆగ్నేయ సరిహద్దులలో తంజావూరు జిల్లా ఉంది. వాయవ్య సరిహద్దులలో తిరుచిరాపల్లి జిల్లా ఉంది. పడమర సరిహద్దులలో పెరంబలూరు జిల్లా ఉంది. జిల్లామొత్తంలో 16 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అరియలూరు సిమెంటు పరిశ్రమలకు ప్రసిద్ధి. బిర్లా సిమెంట్, డాల్మియా సిమెంట్, సఖి సిమెంట్, ది తమిళనాడు సిమెంట్, చెట్టినాడు సిమెంట్ మొదలైన ప్రముఖ సిమెంటు తయారీ పరిశ్రమలు జిల్లా ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడకు సమీపంలో ప్రఖ్యాత " గంగై కొండ చోళపురం " ఉంది. ఈ ఊరిలో రాజేంద్రచోళుడు చేత నిర్మించబడిన ఆలయం ఉంది. అరియలూరుకు 5కిలోమీటర్ల దూరంలో కలియపెతుమాళ్ ఆలయం ఉంది. రాజరాజ చోళుని కుమారుడైన రాజేద్రచోళుడు తంజావూరులో నిర్మించిన ప్రసిద్ధి చెందిన బృహదీశ్వరాలయం నిర్మించాడు.
Ariyalur district
அரியலூர் மாவட்டம் | |
---|---|
District | |
Country | India |
రాష్ట్రం | తమిళనాడు |
జిల్లా | Ariyalur |
Municipalities | Ariyalur, Jayankondam |
Blocks | Andimadam, Ariyalur, Jayankondam, Sendurai, T.Palur, Thirumanur |
Town Panchayats | Udayarpalayam, Varadharajanpettai |
ప్రధాన కార్యాలయం | Ariyalur |
Boroughs | Ariyalur, Sendurai, Udayarpalayam |
Government | |
• Collector | Mr.E.Saravanavelraj I.A.S.. |
• Superintendent Of Police | Mr. Ziaul Haque, IPS |
విస్తీర్ణం | |
• Total | 1,949.31 కి.మీ2 (752.63 చ. మై) |
జనాభా (2011)[1] | |
• Total | 7,52,481 |
• జనసాంద్రత | 390/కి.మీ2 (1,000/చ. మై.) |
భాషలు | |
• అధికార | Tamil, English |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | TN-61 |
Nearest city | Tiruchirappalli |
Vidhan Sabha constituency | Ariyalur, Jayankondam |
World Heritage Site | Gangaikondacholapuram |
చరిత్ర
మార్చు1995లో తిరుచిరాపల్లిని మూడుగా విభజించగా పెరంబలూరు, కరూర్ జిల్లాలు ఏర్పడ్డాయి. అరియలూర్ జిల్లా 2001 జనవరి 1 న పెరంబలూరు జిల్లా నుండి వేరు చేయబడింది. కానీ, 2002 మార్చి31న పెరంబలూరు జిల్లాలో విలీనం చేయబడింది. అరియలూర్ జిల్లా G.O.(Ms) No.683 రెవెన్యూ (RA1(1)) డిపార్ట్‌మెంట్, తేదీ:2007 నవంబరు 23 ప్రకారం పెరంబలూరు జిల్లా విభజన ద్వారా 2007 నవంబరు 23 నాటినుండి ఉనికిలోకి వచ్చింది. దీనికి ఉత్తరాన కడలూరు, దక్షిణాన తంజావూరు, తూర్పున కడలూరు, తంజావూరు, పశ్చిమాన పెరంబలూరు, తిరుచిరాపల్లి జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. అరియలూరు జిల్లా 23.11.2007 నుండి ప్రత్యేక జిల్లాగా పని చేస్తోంది.[3]
ప్రముఖ దేవాలయాలు
మార్చుగంగైకొండ చోళపురం బృహదీశ్వరాలయం
మార్చుగంగైకొండ చోళపురం వద్ద ఉన్న బృహదీశ్వర దేవాలయం దక్షిణ భారతదేశం, తమిళనాడు రాష్ట్రం, జయంకొండ లోని గంగైకొండ చోళపురంలో శివునికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. సా.శ. 1035 లో రాజేంద్ర చోళుడు I తన కొత్త రాజధానిలో భాగంగా దీనిని నిర్మించాడు. [4]ఈ చోళ రాజవంశం కాలం నాటి ఆలయం ఆకృతి సారూప్యంగా ఉంది.అరియలూరుకు నైరుతి దిశలో 70 కిమీ (43 మై) దూరంలో ఉన్న బృహదీశ్వర దేవాలయం 11వ శతాబ్దపు పురాతనమైందిగా చెప్పవచ్చు. తంజావూరులో గంగైకొండ చోళపురం ఆలయం తంజావూరు ఆలయం కంటే చిన్నదైనప్పటికీ, మరింత అలంకరణగా చేయబడింది. రెండూ దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద శివాలయాలు, ఇవి ద్రావిడ శైలి ఆలయాలకు ఉదాహరణలు.
పరిపాలనా విభాగాలు
మార్చుఅరియలూరు జిల్లాలో అరియలూర్, ఉడయార్‌పాళయం అనే రెండు రెవెన్యూ డివిజన్‌లు ఉన్నాయి, అరియలూర్, సెందురై, ఉడయార్‌పాళయం, అండిమడం (అండిమడం తాలూకా G.O.(Ms) No. 167 ప్రకారం రెవెన్యూ (RA1 (1)) శాఖ తేదీ 2017 మే 08 ప్రకారం ఏర్పడింది. జిల్లాలో 195 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో ఆరు బ్లాకులు ఉన్నాయి. అరియలూరు, తిరుమనూరు, సెందూరై, జయంకొండం, అందిమడం, టి.పాలూరు, 201 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అరియలూర్, జయంకొండం అనే రెండు మునిసిపాలిటీలు ఉన్నాయి.ఉదయర్‌పాళయం, వరదరాజనపేటై అనే రెండు పట్టణ పంచాయతీలు ఉన్నాయి. [5]
గణాంకాలు
మార్చుచారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% p.a. |
1901 | 2,71,501 | — |
1911 | 2,94,621 | +0.82% |
1921 | 3,06,764 | +0.40% |
1931 | 3,08,837 | +0.07% |
1941 | 3,48,381 | +1.21% |
1951 | 3,98,231 | +1.35% |
1961 | 4,37,692 | +0.95% |
1971 | 5,13,704 | +1.61% |
1981 | 5,72,498 | +1.09% |
1991 | 6,36,381 | +1.06% |
2001 | 6,95,524 | +0.89% |
2011 | 7,54,894 | +0.82% |
source:[6] |
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, అరియలూర్ జిల్లా మొత్తం జనాభా 754,894,[7] ఇది గయానా[8] లేదా అమెరికా లోని అలాస్కా[9] లోని జనాభాకు సమానం. భారతదేశంలో (మొత్తం 640లో) ఇది 491వ ర్యాంకును ఇస్తుంది. [7] జిల్లాలో జనసాంద్రత అధికంగా ఉంది.చదరపు కిలోమీటరుకు 387 మంది నివాసితులు ఉన్నారు.[7] 2001-2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు 8.19%.[7] అరియలూర్ జిల్లా లింగ నిష్పత్తి ప్రతి 1016 మంది పురుషులకు 1000 మంది మహిళలు ఉన్నారు[7] అక్షరాస్యత 71.99% ఉంది. జనాభాలో 11.01% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.[7] షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు జనాభాలో వరుసగా 23.34%, 1.42% మంది ఉన్నారు. 2011 నాటికి ఇది తమిళనాడులో అత్యధిక జనాభా కలిగిన మూడవ జిల్లా (32 లో). జిల్లాలో పెరంబలూర్, ఉదగమండలం.[7] జయంకొండ అరియలూర్ జిల్లాలో అత్యంత జనసాంద్రత కలిగిన పట్టణాలు. జిల్లా మొత్తం జనాభాలో 99.27% మంది మాట్లాడే ప్రధాన భాష తమిళం.[10]
ముఖ్య ప్రదేశాలు
మార్చు- గంగైకొండ చోళపురం
- కల్లత్తూరు
- జయంకొండం
- కరైవెట్టి పక్షుల అభయారణ్యం
- తిరుమలపడి
- కమరసవల్లి
- గోవిందపుత్తూరు
- శిలాజ మ్యూజియం
- విక్కిరమంగళం
- అరియలూర్ - కోదండర్మస్వామి కోవిల్
- ఎలాకురిచి చర్చి
- కల్లంకురిచ్చి కాళీయ పెరుమాళ్ కోవిల్. l[12]
మూలాలు
మార్చు- ↑ "2011 Census of India" (Excel). Indian government. 16 April 2011.
- ↑ "Ariyalur District Population Religion - Tamil Nadu, Ariyalur Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in. Archived from the original on 2023-01-08. Retrieved 2023-01-08.
- ↑ "About District | Ariyalur District, Government of Tamil Nadu | Land of Cements | India". web.archive.org. 2023-01-08. Archived from the original on 2023-01-08. Retrieved 2023-01-08.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "About District | Ariyalur District, Government of Tamil Nadu | Land of Cements | India". Retrieved 2023-01-08.
- ↑ "About District | Ariyalur District, Government of Tamil Nadu | Land of Cements | India". web.archive.org. 2023-01-08. Archived from the original on 2023-01-08. Retrieved 2023-01-08.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Decadal Variation In Population Since 1901
- ↑ 7.0 7.1 7.2 7.3 7.4 7.5 7.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 13 June 2007. Retrieved 2011-10-01.
Guyana 744,768
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2013-10-19. Retrieved 2011-09-30.
Alaska 710,231
- ↑ "Table C-16 Population by Mother Tongue: Tamil Nadu". Census of India. Registrar General and Census Commissioner of India.
- ↑ "Table C-01 Population by Religion: Tamil Nadu". censusindia.gov.in. Registrar General and Census Commissioner of India. 2011.
- ↑ "Places of Interest | Ariyalur District, Government of Tamil Nadu | Land of Cements". Retrieved 2019-04-08.