అర్ధాంగి (1977 సినిమా)
అర్థాంగి ఎ.మోహన్ గాంధీ దర్శకత్వంలో మురళీమోహన్, జయసుధ జంటగా నటించిన 1977 నాటి తెలుగు చలన చిత్రం. ప్రఖ్యాతమైన ప్రసాద్ ఆర్ట్ పిక్ఛ్రర్స్ సంస్థ ఈ సినిమాను తన రజతోత్సవ సంవత్సరం సందర్భంగా నిర్మించింది. మోహన్ గాంధీకి దర్శకునిగా ఇదే మొదటి సినిమా. సినిమాకు కథను మోహన్ గాంధీ గురువుగా భావించే దర్శకుడు ప్రత్యగాత్మ రాశారు. సినిమాలో మురళీమోహన్, జయసుధ, మోహన్ బాబు, చంద్రమోహన్ నటించడంతో భారీ తారాగణం అయింది.
అర్ధాంగి అన్న పేరు అప్పటికే 1955 నాటి విజయవంతమైన చిత్రానికి ఉండడంతో సినిమా విజయంలో ప్రతిబంధకమవుతుందని పలువురు వారించారు. దర్శకుడు గాంధీ ఈ సినిమా కథకు అర్ధాంగి అన్నదే సరైన పేరు అని నిర్ణయించారు. 1977 అక్టోబరు నెలలో సినిమాను విడుదల చేశారు. విడుదలకు వారం రోజుల ముందు ఈ సినిమా విడుదలయ్యే థియేటర్ల పక్క థియేటర్లలో 1955 నాటి అర్ధాంగిని పునర్విడుదల చేయడం, యాదృచ్ఛికంగా ఇదే ఇతివృత్తంతో ఈ సినిమాకు అటూఇటుగా మరో నాలుగు సినిమాలు విడుదల కావడం వంటి కారణాలతో సినిమా యావరేజ్ గా నిలిచింది.
అర్ధాంగి (1977 సినిమా) (1977 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఎ.మోహనగాంధి |
నిర్మాణం | ఎ.వి.సుబ్బారావు |
రచన | సత్యానంద్ |
తారాగణం | మురళీమోహన్, జయసుధ, మోహన్ బాబు, చంద్రమోహన్ |
సంగీతం | టి.చలపతిరావు |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి |
నిర్మాణ సంస్థ | ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నిర్మాణం
మార్చుఅభివృద్ధి
మార్చు1975 నాటికి ప్రత్యగాత్మ వద్ద దర్శకత్వశాఖలో పనిచేస్తున్న ఎ.మోహన్ గాంధీకి, ప్రత్యగాత్మతో అల్లుడొచ్చాడు సినిమా తీస్తున్న పి.ఎ.పి. సంస్థ వారు సినిమాకి దర్శకునిగా అవకాశం ఇస్తామన్నారు. దాని ప్రకారం 1977లో పి.ఎ.పి సంస్థ రజతోత్సవం సందర్భంగా తీసిన సినిమాల్లో అర్ధాంగి కూడా ఒకటి. ఈ సినిమా కథ ప్రముఖ దర్శకుడు ప్రత్యగాత్మ రాశారు. సినిమాకు మొదటి నుంచీ అర్థాంగి అన్నపేరే పెడదామని భావిస్తూ వచ్చారు. అయితే విడుదలకు ముందు సినిమా వర్గాల వారు 1955లో అర్ధాంగి పేరుతో సినిమా వచ్చినందున వేరే పేరు పెట్టుకొమ్మన్నారు. కానీ కథ, కథనాల రీత్యా సరైన పేరు అని భావించడంతో దర్శకుడు గాంధీ అర్ధాంగి అన్న పేరునే నిర్ణయించారు.[1]
నటీనటుల ఎంపిక
మార్చుమురళీమోహన్, జయసుధ, మోహన్ బాబు, చంద్రమోహన్ లు ప్రధాన పాత్రలకు ఎంపికయ్యారు.[1]
చిత్రీకరణ
మార్చుఅర్ధాంగి సినిమా చిత్రీకరణ మే 1, 1977నాడు హైదరాబాదులోని గోల్డ్ స్పాట్ కంపెనీ ప్రాంతంలో సినిమా నిర్మాత రామారావు క్లాప్ కొట్టగా, ప్రముఖ దర్శకుడు ప్రత్యగాత్మ కెమెరా స్విచ్-ఆన్ చేయగా ప్రారంభమైంది. మొదటిషాట్ నటి జయసుధపై చిత్రీకరించారు. సినిమా ప్రధాన చిత్రీకరణ హైదరాబాద్ లో 28 రోజుల్లో పూర్తైంది. చిత్రం ప్యాచ్ వర్క్ మద్రాసులో చేశారు.
విడుదల, స్పందన
మార్చుసినిమాని 1977 అక్టోబరు నెలలో విడుదల చేశారు. ఈ సినిమా విడుదల చేయడానికి వారంరోజుల ముందే ఈ సినిమా విడుదల చేయనున్న థియేటర్ల పక్క థియేటర్లలోనే 1955 నాటి అర్ధాంగి సినిమాను పునర్విడుదల చేశారు. ఇదే సమయంలో కొంత అటూఇటూగా అమరదీపం, ప్రేమలేఖలు, అర్ధాంగి, గోరంత దీపం సినిమాలు దాదాపు ఒకే ఇతివృత్తంతో యాధృచ్ఛికంగా విడుదలయ్యాయి. దాంతో అర్ధాంగి సినిమా ప్రేక్షకాదరణలో యావరేజ్ గా నిలిచింది.[1]
సంగీతం, పాటలు
మార్చుఈ సినిమాకు టి.చలపతిరావు సంగీతాన్ని అందించారు. ఇందులో ఆరు పాటలను చిత్రీకరించారు.[2]
- గూడు ఒక్కటే గువ్వలు రెండమ్మా
- నా మనసే ఒక తెల్లని కాగితం
- గుళకరాళ్లు తెచ్చి
- లట్టు మారి
- ఆర్నీ సిగదరగ అందగాడా
- ఇల్లొకటి ఉండగా
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 అన్నే, మోహన్ గాంధీ. "మొదటి సినిమా-అన్నే మోహన్ గాంధీ" (PDF). కౌముది.నెట్. Retrieved సెప్టెంబరు 1, 2015.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-07-10. Retrieved 2015-09-01.