అల్లుడొచ్చాడు
అల్లుడొచ్చాడు పి.ఎ.పి. పతాకంపై ప్రత్యగాత్మ దర్శకునిగా నిర్మించిన 1976 నాటి తెలుగు సాంఘిక చిత్రం.రామకృష్ణ, జయసుధ రాజబాబు,కృష్ణకుమారి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం తాతినేని చలపతిరావు అందించారు.
అల్లుడొచ్చాడు (1976 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ప్రత్యగాత్మ |
నిర్మాణ సంస్థ | ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ప్రై. లిమిటెడ్ |
భాష | తెలుగు |
కథ
మార్చుకమ్మటి పాటలకు పెట్టింది పేరు చంద్రశేఖరం. అతను గాయకుడిగా పెట్టుకున్న పేరు రవి. రవి పాటలంటే ప్రాణం శ్రీదేవికి. కూతుర్ని అల్లారుముద్దుగా పెంచుకున్న విశాఖరావు పెళ్ళి చెయ్యాలనుకుంటాడు. పెళ్ళి సంబంధాలు, హడావిడి లేకుండా విశాఖరావు ఒక ఫోన్ చేసేసరికి అల్లుడొచ్చాడు.
అతని పేరు చంద్రశేఖరమని, తన స్నేహితుడి కుమారుడని, చదువుకున్నవాడని, బుద్ధిమంతుడని విశాఖరావు అభిప్రాయం.
అతని ముద్దుపేరు రవి. రేడియోలో అధ్బుతంగా పాటలు పాడే గాయకుడని కాబోయే పెళ్ళి కుమార్తె శ్రీదేవి అభిప్రాయం.
అంతా దైవ సంకల్పం. ఎక్కదివాడినో ఇక్కడికొచ్చి పడ్డాను. అమ్మాయి బాగుంది. అయితే పాటలు పాడమని ప్రాణాలు తీస్తుంది. తనకు పాటలు పాడడం రాదు. ఎలాగో పాట గండం తప్పించుకుని ఎప్పతి కప్పుడు నాటకమాడేస్తే సరిపోతుందని రవి అభిప్రాయం.
వీడు మహా కేటుగాడు. తన పేరు పెట్టేసుకొని విశాఖరావు ఇంట్లో తిష్ట వేసాడు. వీడు దగుల్బాజీ... ఇది చంద్రశేఖరరావు అభిప్రాయం.
కొంతకాలం తర్వాత ఇద్దరూ ఏకమైపోయి విశాఖరావు ఇంట్లో నాటకమాడటం ప్రారంభించారు. రవి దేవిని ప్రేమించి, అందుకు అవసరమైన కొన్ని పాటలు పాడాడు. శేఖర్ సరోజ అనే అమ్మాయిని ప్రేమించి అమెను దక్కించుకొనేందుకు రవితో చేతులు కలిపాడు. కొంతకాలానికి సరోజ తండ్రిని చంపి వజ్రాలు కాజేసిన వ్యక్తి పేరు శేఖర్ అని తెలుస్తుంది. అక్కడ కథ మలుపు తిరుగుతుంది.
తారాగణం
మార్చు- రామకృష్ణ
- జయసుధ
- రాజబాబు
- కృష్ణకుమారి
- నాగభూషణం
- అల్లురామలింగయ్య
- గోకిన రామారావు
- సాక్షి రంగారావు
- గణేష్ పాత్రో
- చిట్టిబాబు
- సారథి
- అశోక్ కుమార్
- మోదుకూరి సత్యం
- ఝాన్సీ,
- సె.హెచ్.వరలక్ష్మి
- జయమాలిని
- ప్రకాష్
సాంకేతిక వర్గం
మార్చు- సంభాషణలు: భమిడిపాటి రాధాకృష్ణ, గణేష్ పాత్రో
- పాటలు: ఆత్రేయ, కొసరాజు, దాశరథి, నారాయణరెడ్డి
- చిత్రానువాదం, సంగీతం: తాతినేని చలపతిరావు
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- దుస్తులు: యం.కె.రామారావు
- స్టిల్స్: ఎం.సత్యం
- మేకప్: కె.నరసింహారావు, రాము, సుబ్బయ్య
- నృత్యం: తార
- కళ: జి.వి.సుబ్బారావు
- కూర్పు: జె.కృష్ణస్వామి, బాలు
- ఆపరేటివ్ ఛాయాగ్రహణం: హరనాథ్, శర్మ
- ఛాయాగ్రహణం: పి.యస్.సెల్వరాజ్
- నిర్మాత: ఎ.వి.సుబ్బారావు
- దర్శకత్వం: కె.ప్రత్యగాత్మ
నిర్మాణం
మార్చుచిత్రీకరణ
మార్చుసినిమాలోని పాటల చిత్రీకరణ మహాబలిపురంలో జరిగింది.[1]
పాటల జాబితా
మార్చు- కొడితే పులినే కొట్టాలిరా , రచన:సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం
- అంతేనాకు చాలు తమలపాకు తొడిమే పదివేలు, రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం.పులపాక సుశీల
- ఉరకల పరుగుల పరుగుల ఉరకల ప్రాయం, రచన: ఆచార్య ఆత్రేయ, గానం శ్రీపతి పండితారాథ్యుల బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- ఎలా చెప్పేది ఎలా చెప్పేది చల్ మోహనరంగా చెప్పబోతే సిగ్గు, రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.పులపాక సుశీల
- మా తెలుగు తల్లికి మల్లెపూదండ మాకన్నతల్లికి, రచన:సాంప్రదాయం, గానం.పి సుశీల
- లేత కొబ్బరి నీళ్లల్లె పూతమామిడి పిందల్లె చెప్పకుండా, రచన: ఆత్రేయ, గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- వేళాపాళా వుండాలమ్మ దేనికైనా నువ్వు వేగిరపడితే, రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
మూలాలు
మార్చు- ↑ అన్నే, మోహన్ గాంధీ. "అన్నే మోహన్ గాంధీ-మొదటి సినిమా" (PDF). కౌముది. Retrieved 29 ఆగస్టు 2015.
2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.