తరంగము

(అల నుండి దారిమార్పు చెందింది)

యానకంలో ఏర్పడిన అలజడి (disturbance), యానక కణాల ఆవర్తన (periodic) చలనం వల్ల, ఒక చోటు నుంచి మరొక చోటుకి ప్రసారితమయ్యే ప్రక్రియను తరంగము (ఆంగ్లం: wave) అని అంటారు. తరంగము నకు ఉండే చలనమును తరంగ చలనం అంటారు. తరంగ ప్రసార ప్రక్రియలో యానక కణాలు, తమ మాథ్యమిక స్థానానికి రెండువైపులా కంపనం చేస్తాయి తప్ప తరంగంతో పాటు ముందుకు ప్రయాణించవు. శక్తికి ప్రతిరూపమైన అలజడి, ఒక కణం నుంచి మరో కణానికి బదిలీ అవుతూ ముందుకు సాగుతుంది. తరంగాలన్నీ శక్తిని జనక స్థానం నుండి ముందుకు తీసుకుని పోతాయి.

నీటి ఉపరితలంలో తరంగాలు.

ఉదాహరణలు

మార్చు

తరంగాలు-రకాలు

మార్చు
 
Sinusoidal waves correspond to simple harmonic motion.

తరంగములు ముఖ్యంగా రెండు రకములు. అవి.

  1. యాంత్రిక తరంగాలు
  2. విద్యుదయస్కాంత తరంగాలు

యాంత్రిక తరంగాలు

మార్చు

ఈ తరంగాలు రెండురకములు అవి.

  1. పురోగామి తరంగాలు
  2. స్థిర తరంగాలు

పురోగామి తరంగాలు

మార్చు

యానకంలో తరంగాలు ముందుకు ప్రయాణించి మరల వెనుకకు రాకపోతే వాటిని పురోగామి తరంగాలు అంటారు. ఈ తరంగాలకు ముఖ్యంగా యానకం (ప్రసార మాధ్యమం) అవసరం. ఈ తరంగాలు రెండు రకములు. అవి.

  1. అనుదైర్ఘ్య తరంగాలు
  2. తిర్యక్ తరంగాలు
అనుదైర్ఘ్య తరంగాలు
మార్చు
  • యానకంలో తరంగ ప్రసారథిశకు యానకంలోని కణాల కంపన దిశ సమాంతరంగా ఉంటే వాటిని అనుదైర్ఘ్య తరంగాలు అంటారు.
  • ఈ తరంగాల ప్రసారానికి స్థితిస్థాపకత, జడత్వం కలిగిన యానకం అవసరం.
  • ఈ తరంగాలకు ఉదాహరణ ధ్వని తరంగాలు.
  • వీటిలో కణాలు దగ్గరగా ఉన్న ప్రాంతాలను "సంపీడనాలు", కణాలు దూరంగా ఉన్న ప్రాంతాలను "విరళీకరణాలు" అంటారు.
  • రెండు వరుస సంపీడనాల మధ్య దూరం గాని లేదా రెండు వరుస విరళీకరణాల మధ్య దూరం గాని "తరంగ దైర్ఘ్యం" అవుతుంది.
  • ఈ తరంగాలు శూన్యంలో ప్రసారం చేయలేవు.
తిర్యక్ తరంగాలు
మార్చు
  • యానకంలో తరంగ ప్రసారథిశకు యానకంలోని కణాల కంపన దిశ లంబంగా ఉంటే వాటిని తిర్యక్ తరంగాలు అంటారు.
  • ఈ తరంగాల ప్రసారానికి స్థితిస్థాపకత, జడత్వం కలిగిన యానకం అవసరం.
  • ఈ తరంగాలకు ఉదాహరణ నీటి తలంపై ఏర్పడిన తరంగాలు.
  • నిశ్చలంగా ఉన్న కొలను నీటిలో, ఒక గులక రాయిని వేస్తే, అది పడిన చోట, వృత్తాకార తరంగాలు (అలలు) ఏర్పడడం మనం గమనిస్తాం. తరంగాలు వచ్చునపుడు నీటిలో ఒక తేలికగా ఉండు బెండు బంతిని వేసినపుడు అది పైకి క్రిందికి కదులుతుంది. దీనిని బట్టి యానకంలో తరంగ ప్రసారథిశకు యానకంలోని కణాల కంపన దిశ లంబంగా కదులుతాయని తెలుస్తుంది.
  • వీటిలో శృంగాలు, ద్రోణులు యేర్పడతాయి.
  • రెండు వరుస శృంగాల మధ్య దూరం గాని లేదా రెండు వరుస ద్రోణుల మధ్య దూరం గాని "తరంగ దైర్ఘ్యం" అవుతుంది.

స్థిర తరంగాలు

మార్చు
  • పురోగామి తరంగాలకు ఏదయినా అడ్డంకి వచ్చినపుడు అవి 180 డిగ్రీలు పరావర్తనం చెంది మరల వెనుకకు వస్థాయి. అపుడు స్థిర తరంగాలు యేర్పడుతాయి.
  • ఒక దారాన్ని గోడకు కట్టి దానిని నీవు చేతితో పట్టుకొని పైకి క్రిందికి వేగంగా కదిపించినట్లైతే కొన్ని ఉచ్చులు యేర్పడుతాయి.వీటిని స్థిర తరంగాలు అంటారు.
  • ఈ తరంగాలలో అధిక స్థానబ్రంశము గల బిందువులను ప్రస్పందన స్థానం అని, అల్ప స్థానబ్రంశము గల బిందువులను అస్పందన స్థానం అని అంటారు.
  • ఏవైనా వరుస రెండు ప్రస్పందన లెదా అస్పందన బిందువుల మధ్య దూరం తరంగ దైర్ఘ్యంలో సగం ఉంటుంది. λ/2
  • ఈ తరంగములో ప్రతి బిందువుకు ఒక ప్రత్యేక మైన కంపన పరిమితి ఉంటుంది.
  • ఏవైనా వరుస రెండు ప్రస్పందన, అస్పందన బిందువుల మధ్య దూరం తరంగ దైర్ఘ్యంలో నాల్గవ వంతు ఉంటుంది. λ/4

విద్యుదయస్కాంత తరంగాలు

మార్చు
 
విద్యుదయస్కాంత తరంగం

తరంగ ప్రసారథిశకు లంబంగా కంపిస్తున్న విద్యుత్, అయస్కాంత క్షేత్రములు కలిగి ఉంటే వాటిని విద్యుదయస్కాంత తరంగాలు అంటారు. వీటి ప్రసారానికి యానకం అవసరం లేదు. అందుచేత సూర్యుని నుండి వివిధ వికిరణములు భూమిని చేరుతున్నాయి. కాని మధ్యలో చాలా ప్రాంతం వరకు యానకం లేదు. యివి ప్రస్తుతం 7 రకాలు. అవి.

  1. గామా కిరణాలు
  2. ఎక్స్ కిరణాలు
  3. అతి నీలలోహిత కిరణాలు
  4. దృగ్గోచర వర్ణపటం: పరమాణువులలోని ఉత్తేజ వేలన్సీ ఎలక్ట్రానులు, వాటి భూస్థాయిలోకి పడిపోవటం వలన దృగ్గోచర వర్ణపటం ఉద్గారమవుతుంది.
  5. పరారుణ తరంగాలు
  6. మైక్రో తరంగాలు: విద్యుద్వలయాలలో అధిక పౌనః పున్య విద్యుదయస్కాంత డోలకాలు ఉత్పత్తి చేసే వికిరణాలని మైక్రో తరంగాలు అంటారు.
  7. రేడియో తరంగాలు

ఈ తరంగాలలో ఒక్క దృగ్గోచర వర్ణపటమును మాత్రమే మన చూడగలం. మిగిలినివి కనిపించవు. కాని కొన్ని ప్రయోగాల ద్వారా చూడవచ్చు. ఉదాహరణకు టెలివిజన్ యొక్క రిమోట్ కంట్రోల్ను చీకటిలో ఆన్ చేసి ఉంచి దాని ముందు భాగమును ఒక సెల్ ఫోన్ తో ఫోటో తీసినట్లనిన మైక్రో తరంగ ఉనికిని చూడవచ్చు.పై తరంగాల లక్షణాలన్నీ విద్యుదయస్కాంత తరంగాలు పేజీలో వివరంగా చూడవచ్చు.

భాషా విశేషాలు

మార్చు

తరంగము [ taraṅgamu ] tarangamu. సంస్కృతం n. A wave, a surge, an undulating swell or surface like waves. అల. తరంగిణి tarangiṇi. n. A river. This and other expressions for river, sea, stream, are used in the titles of some books, as విద్యాతరంగిణి the Circle of the Sciences.

ఉదాహరణలు

మార్చు
 
కొండల్ని ఢీకొంటున్న సముద్ర తరంగాలు.
"https://te.wikipedia.org/w/index.php?title=తరంగము&oldid=3161903" నుండి వెలికితీశారు