ఆండ్రూ మెక్‌డోనాల్డ్

ఆస్ట్రేలియా దేశపు క్రికెట్ క్రీడాకారుడు

ఆండ్రూ బారీ మెక్‌డొనాల్డ్ (జననం 1981 జూన్ 5) ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్. విక్టోరియా, సౌత్ ఆస్ట్రేలియా క్రికెట్ జట్లకు ఆడిన మాజీ క్రికెటరు. అతను విక్టోరియాలోని వోడోంగాలో జన్మించాడు. ప్రస్తుతం విక్టోరియాలోని గీలాంగ్‌లో నివసిస్తున్నాడు.[2]

ఆండ్రూ మెక్‌డోనాల్డ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఆండ్రూ బ్యారీ మెక్‌డోనాల్డ్
పుట్టిన తేదీ (1981-06-05) 1981 జూన్ 5 (వయసు 43)
వొడోంగా, విక్టోరియా, ఆస్ట్రేలియా
మారుపేరురోనీ[1]
ఎత్తు1.94 మీ. (6 అ. 4 అం.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం-ఫాస్ట్
పాత్రఆల్ రౌండరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 406)2009 జనవరి 3 - దక్షిణాఫ్రికా తో
చివరి టెస్టు2009 మార్చి 22 - దక్షిణాఫ్రికా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2001/02–2012/13విక్టోరియా (స్క్వాడ్ నం. 4)
2009–2011ఢిల్లీ డేర్ డెవిల్స్ (స్క్వాడ్ నం. 4)
2010–2011లీసెస్టర్‌షైర్ (స్క్వాడ్ నం. 4)
2011/12Melbourne Renegades
2012Uva Next
2012–2013రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్
2013/14–2014/15సౌత్ ఆస్ట్రేలియా
2014/15–2015/16Sydney Thunder
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ఫక్లా లిఎ T20
మ్యాచ్‌లు 4 95 100 93
చేసిన పరుగులు 107 4,825 1,888 1,743
బ్యాటింగు సగటు 21.40 39.54 29.96 31.69
100లు/50లు 0/1 11/25 0/9 0/11
అత్యుత్తమ స్కోరు 68 176* 67 96*
వేసిన బంతులు 732 12,632 3,707 1,470
వికెట్లు 9 201 79 82
బౌలింగు సగటు 33.33 28.73 39.83 23.01
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 5 1 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/25 6/34 5/38 5/13
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 66/0 42/0 33/0
మూలం: Cricinfo, 2019 ఏప్రిల్ 7

మెక్‌డొనాల్డ్ 2009 జనవరి 3న సిడ్నీలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో రంగప్రవేశం చేశాడు. అతను అండర్ 19 స్థాయిలో కూడా ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రైమ్ మినిస్టర్స్ XI తరపున ఆడాడు. అతను కుడిచేతి వాటం బ్యాటింగు చేసే ఆల్ రౌండరు, రైట్ ఆర్మ్ మీడియం-ఫాస్టు బౌలరు. 2012 అక్టోబరు/నవంబరుల్లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఆస్ట్రేలియా A XIకి మెక్‌డొనాల్డ్ కెప్టెన్‌గా చేసాడు.

కోచ్‌గా, అతను 2023 ఐసిసి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను గెలిపించాడు.

కోచింగ్ కెరీర్

మార్చు

ఆటగాడిగా రిటైరయ్యాక మెక్‌డోనాల్డ్, క్రికెట్ కోచ్ అయ్యాడు. అతను లీసెస్టర్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్, [3] విక్టోరియా, మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌లకు కోచ్‌గా ఉన్నాడు. [4] అతను విక్టోరియా సీనియర్ కోచ్‌గా తన మొదటి సంవత్సరంలో షెఫీల్డ్ షీల్డ్‌ను గెలుచుకున్నాడు.

అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు [5] కి బౌలింగ్ కోచ్‌గా, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రధాన కోచ్‌గా కూడా ఉన్నాడు.

2019 అక్టోబరులో అతను, ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టుతో జస్టిన్ లాంగర్‌కు అసిస్టెంట్ కోచ్‌గా నియమితుడయ్యాడు. [6]

2022 ఫిబ్రవరి 5న, జస్టిన్ లాంగర్ రాజీనామాతో, మెక్‌డొనాల్డ్ జట్టు తాత్కాలిక ప్రధాన కోచ్‌ అయ్యాడు. [7]

2022 ఏప్రిల్ 13 న, అతను నాలుగు సంవత్సరాల కాలానికి ఆస్ట్రేలియా జాతీయ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. [8]

కెరీర్ సారాంశం

మార్చు

మెక్‌డొనాల్డ్ తన ఫస్టు క్లాస్ కెరీర్‌ ప్రారంభంలో 2003-04లో తన మొదటి పది గేమ్‌లలో 32 వికెట్లు తీసుకున్నాడు. వెస్ట్రన్ ఆస్ట్రేలియాపై 67 పరుగులకు 6 వికెట్లు పడగొట్టడం అతని అత్యుత్తమ స్పెల్. అతను బ్యాటింగులో ఇబ్బంది పడ్డాడు. వేసవి ప్రారంభంలో 4 వ స్థానంలో బ్యాటింగు చేసినప్పటికీ, తరువాత 8వ స్థానానికి వెళ్ళాడు. తరువాతి సీజన్‌లో వేలికి సర్జరీ చెయ్యడంతో అతను తక్కువ ఆటలు ఆడాడు. 2005-06లో అతను కేవలం నాలుగు మ్యాచ్‌లు ఆడీ, 83 పరుగులు, నాలుగు వికెట్లు మాత్రమే సాధించగలిగాడు. గాయం తగ్గాక మెక్‌డొనాల్డ్, 2006-07 సీజన్‌లో పామ్‌ లోకి వచ్చాడూ. పురా కప్‌లో అతను తన 500వ పరుగును సాధించినప్పుడు వందకు పైగా బ్యాటింగు సగటు ఉంది. అతను షెఫీల్డ్ షీల్డ్/పురా కప్ చరిత్రలో ఒక సీజన్‌లో 750 పరుగులు, 25 వికెట్ల డబుల్‌ను చేరుకున్నాడు. [9]

అతను 2007 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా తొలి స్క్వాడ్‌లో స్థానం పొంది, బలమైన దేశీయ ఫామ్‌కు బహుమతి పొందాడు. [10] అతను 2007 ఐసిసి వరల్డ్ ట్వంటీ 20, 7 మ్యాచ్‌ల వన్‌డే సిరీస్ భారత పర్యటన కోసం ఆస్ట్రేలియా ప్రిలిమినరీ స్క్వాడ్‌లలో కూడా ఎంపికయ్యాడు.

2009 జనవరిలో ఆండ్రూ సైమండ్స్, షేన్ వాట్సన్ ఇద్దరూ గాయపడినందున అతను జనవరి, 2009లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడవ టెస్ట్‌లో తన టెస్టు రంగప్రవేశం చేసాడు. [10] ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో, మెక్‌డొనాల్డ్ ఆరో స్థానంలో 15 పరుగులు చేసి, మార్క్ బౌచర్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్ సమయంలో, అతనికి మోర్నే మోర్కెల్ ఒక బౌన్సరు వేసాడు. అది అతని హెల్మెట్‌ను పడేసింది.[11] [12] మరుసటి రోజు, అతను 51 పరుగుల వద్ద హషీమ్ ఆమ్లా ( ఎల్బీడబ్ల్యూ) ను ఔట్ చేసి తన మొట్టమొదటి టెస్టు వికెట్‌ తీసుకున్నాడు. [13]

 
2009–10 KFC ట్వంటీ20 బిగ్ బాష్‌లో WAకి వ్యతిరేకంగా విక్టోరియా తరపున మెక్‌డొనాల్డ్ ఫీల్డింగ్ చేస్తూ.

అతను తరువాత 2009 ఫిబ్రవరి- మార్చిలో దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా 2-1తో గెలిచిన ఆ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో, మెక్‌డొనాల్డ్ విలువైన సహకారం అందించాడు. ఇందులో కేప్ టౌన్‌లో జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 68 పరుగులు, సిరీస్ సమయంలో 6 వికెట్లు పడగొట్టాడు. [14] అతని ప్రదర్శన ఫలితంగా, మెక్‌డొనాల్డ్ 2009 యాషెస్ టూర్‌కు ఎంపికయ్యాడు గానీ, ఏ టెస్టుల్లోనూ ఆడలేదు. అతను నార్తాంప్టన్‌షైర్‌తో జరిగిన రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించి 75 పరుగులు చేశాడు. అలాగే 15 పరుగులకు 4 వికెట్లు తీసుకున్నాడు. ఆస్ట్రేలియా ఆ మ్యాచ్‌ను గెలుచుకుంది. 2009 యాషెస్ పర్యటన సమయంలో తన మొదటి బిడ్డ జన్మించినపుడు, తాత్కాలికంగా ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్ళాడు.[15]

2009 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మెక్‌డొనాల్డ్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరుపున ఆడాడు. [16] ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ 20 లో విక్టోరియా తరపున భారతదేశంలో ఆడిన అతని అనుభవం కారణంగా, 2009 నవంబరులో ఆస్ట్రేలియా వన్‌డే జట్టుకు పిలుపు వచ్చింది.[17]

IPL వేలం 2011 కోసం 350 మంది ఆటగాళ్లలో మెక్‌డొనాల్డ్ ఒకరు. అతడిని ఢిల్లీ డేర్‌డెవిల్స్ 80,000 డాలర్లకు కొనుగోలు చేసింది. 2012 జనవరి 11న మొదటి బదిలీ విండో ట్రేడింగ్ సమయంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు US$100,000 బదిలీ రుసుముతో ఢిల్లీ నుండి అతనిని తీసుకుంది. [18]

మూలాలు

మార్చు
  1. "Heat land Harris as search begins for new 'Gades coach". cricket.com.au. Retrieved 25 January 2020.
  2. Cameron, Louis. "Ron anon: Inside the mind of Australia's head coach". Cricket Australia. Retrieved 19 November 2022.
  3. "Leicestershire appoint Australian Andrew McDonald as new head coach". The Guardian. Press Association. 4 November 2014. Retrieved 31 January 2019.
  4. "McDonald confirmed as coach of Victoria". ESPNcricinfo. 27 August 2016. Retrieved 31 January 2019.
  5. Tagore, Vijay (24 August 2018). "IPL: Daniel Vettori, Trent Woodhill, Andrew McDonald sacked as RCB looks for Kohli-fied team". Bangalore Mirror. Retrieved 31 January 2019.
  6. "Australia appoint Andrew McDonald as Justin Langer's assistant". Hindustan Times. 2019-10-30. Retrieved 2019-10-31.
  7. "Langer steps down as coach, effective immediately". cricket.com.au (in ఇంగ్లీష్). Retrieved 2022-02-05.
  8. "Andrew McDonald appointed Australian men's head coach". International Cricket Council. Retrieved 13 April 2022.
  9. Cricket.com article Archived 5 సెప్టెంబరు 2007 at the Wayback Machine retrieved 12 January 2009
  10. 10.0 10.1 Walsh, Courtney (18 March 2009). "'Ronnie' McDonald in shock after Test call from Australia". Fox Sports. Archived from the original on 4 November 2020. Retrieved 4 November 2020.
  11. Saltau, Jamie Pandaram and Chloe (2009-01-04). "'Ronnie' McDonald has colourful first day at the office". The Sydney Morning Herald. Retrieved 2020-11-04.
  12. Sydney, Jamie Pandaram (2009-01-04). "Bold McDonald endures bruising debut". The Age. Retrieved 2020-11-04.
  13. "RESULT - 3rd Test, Sydney, Jan 3-7 2009, South Africa tour of Australia - Scorecard". ESPN Cricinfo. Archived from the original on 24 September 2020. Retrieved 4 November 2020.
  14. "StatsGuru Search: Andrew McDonald Test matches". Cricinfo. Retrieved 2009-07-25.
  15. "McDonald to return home temporarily". cricinfo.com. 8 August 2009. Retrieved 2009-08-08.
  16. "Indian Premier League 2009 — Delhi Daredevils Squad". Cricinfo. Archived from the original on 16 June 2009. Retrieved 2009-07-25.
  17. "Henriques Out, McDonald And Cockley In". CricketWorld. Retrieved 2009-11-04.
  18. Andrew McDonald transfers to Royal Challengers Bangalore, 14 March 2012, archived from the original on 24 సెప్టెంబరు 2015, retrieved 16 సెప్టెంబరు 2023