దామోదర రాజనర్సింహ

దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) 1958 డిసెంబరు 5న జన్మించాడు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడైన రాజనర్సింహ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇంజనీరింగ్ విద్య అభ్యసించి, రాజకీయాలలో ప్రవేశించి 1989లో తొలిసారిగా ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొంది, ఆ తర్వాత మరో రెండుసార్లు కూడా ఇదే స్థానం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.

దామోదర రాజనర్సింహ
దామోదర రాజనర్సింహ


ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి
నియోజకవర్గం ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1958-12-05) 1958 డిసెంబరు 5 (వయసు 64)
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ

రాజకీయ ప్రస్థానం సవరించు

1989లో తొలిసారి మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. 2004లో రెండోసారి అదే నియోజకవర్గం నుంచి గెలుపొంది, 2006లో వైఎస్సార్ మంత్రివర్గంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా నియమితులైనారు. 2009లో కూడా మూడవసారి ఆందోల్ నుంచి విజయం సాధించి వైఎస్సార్, కొణిజేటి రోశయ్య మంత్రివర్గాలలో స్థానం పొంది, 2010 డిసెంబరులో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా చోటుపొందారు. [1]ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వవలసి రావడంతో 2011, జూన్ 10న దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది.

ఆయన 2023 ఆగస్ట్ 20న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానిత సభ్యుడిగా నియమితుడయ్యాడు.[2]

కుటుంబం సవరించు

దామోదర రాజనర్సింహ తండ్రి సి.రాజనర్సింహ ఆందోల్ నుంచే 3 సార్లు శాసనసభకు ఎన్నికైనారు.

మూలాలు సవరించు

  1. ఈనాడు దినపత్రిక, తేది 02-12-2010
  2. Namasthe Telangana (20 August 2023). "కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీని పునరుద్ధరించిన ఖర్గే.. సచిన్‌ పైలట్‌, శశిథరూర్‌, రఘువీరాలకు చోటు". Archived from the original on 20 August 2023. Retrieved 20 August 2023.