చంటి క్రాంతి కిర‌ణ్

తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు

చంటి క్రాంతి కిర‌ణ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున ఆందోల్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

చంటి క్రాంతి కిరణ్
చంటి క్రాంతి కిర‌ణ్


పదవీ కాలం
2018 - ప్రస్తుతం
నియోజకవర్గం ఆందోల్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 06 డిసెంబర్ 1976
పోతులబోగూడ గ్రామం, వట్‌పల్లి మండలం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు భూమయ్య, కొమురమ్మ
జీవిత భాగస్వామి పద్మావతి
సంతానం ఒక కుమార్తె
మతం హిందూ

జననం, విద్య

మార్చు

క్రాంతి కిరణ్ 1976, డిసెంబరు 6న భూమయ్య, కొమురమ్మ దంపతులకు తెలంగాణ, సంగారెడ్డి జిల్లా, వట్‌పల్లి మండలం, పోతులబోగూడ గ్రామంలో జన్మించాడు. 1993లో బి.హెచ్.సి.ఎల్.లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని పడాల రామిరెడ్డి లా కాలేజీలో ఎల్.ఎల్.బి. పూర్తిచేశాడు.[2] కొంతకాలం జర్నలిస్ట్‌గా పనిచేశాడు.[3]

వ్యక్తిగత జీవితం

మార్చు

క్రాంతి కిరణ్ కు పద్మావతితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు.[4]

వృత్తిజీవితం

మార్చు

1995లో జర్నలిస్టుగా తన వృత్తిని ప్రారంభించాడు. ఆ సమయంలో రైతు ఆత్మహత్యల పోరాటంలో (1996) పాల్గొన్నాడు. రైతులకు సంబంధించిన ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్‌లోని ముఖ్య సభ్యులలో ఒకడిగా ఉన్నాడు. 1996 నుండి 2000 వరకు సివిల్ లిబర్టీస్ కమిటీలో పనిచేశాడు.

ఈనాడు (1995 - 1999), విజేత (1999 - 2001), కేబుల్ నెట్‌వర్క్‌ ( 2001 - 2002), జెమినీ న్యూస్ చీఫ్ కంట్రిబ్యూటర్‌ (2002 - 2003), టీవి9 సీనియర్ రిపోర్టర్‌ (2003 - 2006), టీవి5 న్యూస్ సీనియర్ రిపోర్టర్‌ (2008 - 2009), వి6 (2012 - 2014), టీవి1 ఛానెల్ హెడ్ (2014 - 2018)గా పనిచేశాడు.

తెలంగాణ ఉద్యమం

మార్చు

2001లో తెలంగాణ రాష్ట్ర విముక్తి, జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడేందుకు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమ్ ను స్థాపించాడు. ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నాడు.

రాజకీయ విశేషాలు

మార్చు

సంగారెడ్డికి చెందిన వ్యక్తిగా, సామాజిక కార్యకర్తగా పనిచేసి ఆ ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందాడు. 2006లో రామచంద్రపురం జెడ్పిటీసిగా గెలుపొందాడు. క్రాంతి కిర‌ణ్ 2009లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నాల్గొవ స్థానంలో నిలిచాడు. 2009లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరిన క్రాంతి కిరణ్, తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా పనిచేశాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దామోదర రాజనరసింహపై 16,000 పైగా ఓట్ల అధిక్యంతో గెలుపొందాడు.[5]

ఇతర వివరాలు

మార్చు

శ్రీలంక, అమెరికా సంయుక్త రాష్ట్రాలు మొదలైన దేశాలను సందర్శించాడు.

మూలాలు

మార్చు
  1. "Member's Profile – Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 2021-05-27. Retrieved 2021-08-27.
  2. Eenadu (14 November 2023). "అత్యధికులు పట్టభద్రులే". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  3. "Kranthi Kiran Chanti | MLA | Andole | Sangareddy | Telangana | TRS". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-05-06. Retrieved 2021-08-27.
  4. admin (2019-01-09). "Andole MLA Chanti Kranthi Kiran". Telangana data (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-27.
  5. "Soon, 'smart' windows that turn into TV screens | Tech News". www.timesnownews.com. Retrieved 2021-08-27.